వికీపీడియా చరిత్ర
ఈ వ్యాసం స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వమైన వికీపీడియా చరిత్రకు సంబంధించింది.
వికీపీడియా ప్రస్థానం
మార్చు1.చరిత్ర
మార్చువికీపీడియా మొదటగా న్యూపీడియా అనే ఆంగ్లభాషా విజ్ఞాన సర్వస్వం ప్రాజెక్టుకు సహాయ ప్రాజెక్టుగా ప్రారంభమైంది. న్యూపీడియాలో ఆయా రంగాలలోని నిపుణులు వ్యాసాలు రాసేవారు. వాటిని ఒక పద్ధతి ప్రకారం రివ్యూ చేసిన పిదప విజ్ఞాన సర్వస్వంలోకి చేరుస్తారు. న్యూపీడియా మొట్ట మొదటగా బోమిస్ అనే వెబ్ కంపెనీ ఆధ్వర్యంలో 2000 మార్చి 9 సంవత్సరంలో ఆరంభమైంది. బోమిస్ సిఈఓ పేరు జిమ్మీ వేల్సు, దాని ముఖ్య సంపాదకుడు లారీ సాంగర్. తరువాత వికీపీడియాకు కూడా వీరే అదే పదవుల్లో కొనసాగుతున్నారు. మొదటగా ఇది న్యూపీడీయా ఓపెన్ కంటెంట్ లైసెన్స్ అనే లైసెన్స్ కలిగి ఉండేది. కానీ వికీపీడీయా ఏర్పడిన తరువాత ఫ్రీ సాఫ్టువేర్ ఫౌండేషన్ ఉద్యమ రూపశిల్పి రిచర్డు స్టాల్మన్ కోరిక మేరకు గ్నూ ఫ్రీ డాక్యుమెంటేషన్ లైసెన్సుకు మార్చారు. లారీ సాంగర్, జిమ్మీ వేల్స్ ను వికీపీడియా పితామహులుగా పేర్కొనవచ్చు. అందరూ కలిసి విజ్ఞాన సర్వస్వాన్ని రచించి ఏర్పాటు చేసే ఆలోచన వేల్సు ది అయితే అందుకు వికీలతో కూడిన వెబ్ సైటును ఏర్పాటు చేయాలనే వినూత్నమైన ఆలోచన సాంగర్ ది. వికీమీడియా ఫౌండేషన్ అమెరికాలో స్థాపించబడిన లాభాపేక్షలేని స్వచ్ఛంద సంస్థ. ఇది వికీపీడియా, ఇతర సోదర ప్రాజెక్టుల పురోగతికి కృషిచేస్తుంది. ఇది 2005 లో స్థాపించబడింది. విజ్ఞానాన్ని అందరికి అందుబాటులోకి తేవటానికి వివిధ దేశాలలో కల వికీపీడియా సంఘాలతో కలసిపనిచేస్తుంది. అంతే కాకుండా కొన్ని ప్రపంచంలోని దక్షిణాది దేశాలలో నేరుగా కార్యాలయాలను నెలకొల్పి ఉద్యోగులద్వారా వికీమీడియా ప్రాజెక్టుల త్వరిత పురోగతికి తోడ్పడుతుంది. భారతదేశంలో పని జనవరిలో ప్రారంభించింది.
2.ఫౌండేషన్ చరిత్ర
మార్చువికీమీడియా ఫౌండేషన్ 2003 జూన్ 1 లో ప్రారంభించబడింది. వికీపీడియా వ్యవస్థాపకులలో ఒకరైన జిమ్మీ వేల్స్, తన సంస్థ ద్వారా ప్రారంభించిన వికీపీడియా, ఇతర సోదర ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను దీనికి అప్పగించాడు. బహుభాషలలో విజ్ఞాన సర్వస్వాలు, సోదర ప్రణాళికల పెంపు, అభివృద్ధి, వీటిలో సమాచారాన్ని ఉచిత పంపిణీ చేయటం దీని ముఖ్యోద్దేశం. దీని నిర్వహణకు ధర్మకర్తల (ట్రస్టీల) మండలి ఉంది. ఇది మూడు చోట్ల కొన్ని వందల కంప్యూటర్ సర్వర్లు నడుపుతూ, ఈ ప్రాజెక్టులను వీక్షించే దాదాపు నెలసరిగా అరకోటి ప్రజలకు సేవలందిస్తున్నది. దాదాపు 38 స్వతంత్ర స్థానిక వికీమీడియా సంఘాలతో, ఔత్సాహిక స్వచ్ఛంద కార్యకర్తలతో సమన్వయం చేస్తూ ప్రజల నుండి, సంస్థలనుండి ధన, వనరుల సేకరణ, ప్రాజెక్టులలో వాడబడే మీడియావికీ సాఫ్ట్వేర్ నిర్వహణ, అభివృద్ధి చేస్తుంది. అవగాహన పెంచే కార్యక్రమాలు, కొత్త వాడుకరుల సంఖ్యను అభివృద్ధి చేయటం, మొబైల్, జాలసంపర్కంలేని పద్ధతులలో వికీ ప్రాజెక్టుల సమాచారాన్ని అందచేయటం, శిక్షణా వీడియోలు తయారి, ప్రాజెక్టుల గణాంకాలలో మార్పులను విశ్లేషించి కొత్త తరహా ప్రాజెక్టులను చేపట్టటం, దీని ఇతర కార్యక్రమాలు. వికీమీడియా సంఘాలు., వికీమీడియా భారతదేశం చిహ్నం, వికీపీడియా అవగాహన సదస్సు. వికీమీడియా సంఘాలు (చాప్టర్లు) ఒక దేశం ప్రాతిపదికగా వికీమీడియా ప్రాజెక్టుల పురోగతికి స్థాపించబడిన లాభాపేక్షరహిత స్వతంత్ర సంస్థలు. ఇవి వికీమీడియా ఫౌండేషన్ తో ఒప్పందం ప్రకారం సహకరించుకుని పనిచేస్తాయి.
2.1 వికీమీడియా భారతదేశం తెలుగు వికీపీడియా
మార్చువికీపీడియా వివిధ భాషల్లో లభించే ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము. దీన్ని లాభాపేక్ష రహిత సంస్థ అయిన వికీమీడియా ఫౌండేషన్ నిర్వహిస్తుంది. వికీ అనగా అనేక మంది సభ్యుల సమష్టి కృషితో సులభంగా వెబ్ సైటును సృష్టించగల ఒక సాంకేతిక పరిజ్ఞానం. ఎన్‌సైక్లోపీడియా అనగా సర్వ విజ్ఞాన సర్వస్వం. వికీపీడియా అనేపదం ఈ రెండు పదాల నుంచి ఉద్భవించింది. ఇది 2001లో జిమ్మీ వేల్సు, లారీ సాంగర్లచే ప్రారంభించ బడింది. అప్పటి నుంచి అత్యంత వేగంగా ఎదుగుతూ, ఇంటర్నెట్ లో అతి పెద్ద వెబ్ సైట్లలో ఒకటిగా ప్రాచుర్యం పొందింది.
3. ఇతర భాషలు
మార్చుప్రస్తుతం వికీపీడియా 253 భాషల్లో లభిస్తోంది. వీటిలో 16 భాషల వికీపీడీయా 1,00,000 పైగా వ్యాసాలు కలిగి ఉన్నాయి. 145 వర్షన్లు 1000కి పైగా వ్యాసాలు కలిగి ఉన్నాయి. 2007 డిసెంబరు గణాంకాల ననుసరించి వ్యాసాల సంఖ్య పరంగా చూస్తే ఇంగ్లీషు, జర్మన్, ఫ్రెంచి, పోలిష్, జపనీస్ మొదటి ఐదు పెద్ద వర్షన్లు.
4.వికీ విధానాలు
మార్చుమౌలిక పరిశోధనలు నిషిద్ధం: వికీపీడియాలో మౌలిక పరిశోధనా వ్యాసాలకు చోటు లేదు. మీరు వ్రాసేది పరిశోధనా వ్యాసం కాదు అని నిర్ధారించే ఏకైక విధానం.. మీరు వ్రాసిన విషయానికి సంబంధించిన విశ్వసనీయ మూలం లేదా వనరులను ఉదహరించడమే! రచనలో తటస్థ దృక్కోణం ప్రతిఫలించాలి. దీన్నే ఇంగ్లీషు వికీలో NPOV (Neutral Point Of View) అంటారు. రచనలో తటస్థత ఉండాలి. వివాదాస్పద విషయాలలో ఏదో ఒక దృక్కోణం రాయక తప్పని పరిస్థితి ఏర్పడవచ్చు. అప్పుడు, వివాదంలో ఉన్న అన్ని వర్గాల అభిప్రాయాలను తెలుపుతూ వ్యాసాన్ని వ్రాయాలి. నిర్ధారత్వం: మీరు ఉదహరించిన వనరులును సంప్రదించి, విషయాన్ని నిర్ధారించుకునేందుకు వీలుగా ఉండాలి. వికీ ఒక విజ్ఞాన సర్వస్వం. పాఠకులకు ఇది ఒక పాఠ్య పుస్తకంలాగా ప్రామాణికంగా ఉండాలి. రచయిత ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ తన అభిప్రాయాలు వ్రాయరాదు. కింది సూచనలను పాటించండి. నేను భావిస్తున్నాను, నాకు తెలిసినంతవరకు, నా అనుభవంలో.. ఇలాంటి వాక్యాలు వ్రాయవద్దు. వ్యాస విషయానికి సంబంధించి అవసరమైన చోట్ల దృష్టాంతాలను, రుజువులను ఉదహరించండి. గౌరవ వాచకాలు వికీపీడియా శైలి కాదు. అంచేత గారు, శ్రీ వంటివి వ్రాయవద్దు. అలాగే చెప్పారు, వెళ్ళారు, చేసారు వంటి మాటలకు బదులుగా చెప్పాడు, వెళ్ళింది, చేసాడు వంటి పద ప్రయోగం ఉండాలి. ఈ విషయమై మీ అభిప్రాయాలను రచ్చబండలో వ్రాయండి. చర్చా పేజీలు ఇందుకు మినహాయింపు. వికీపీడియా వ్యాసంలో తమ పేరు నమోదుచేయకూడదు. ఉదాహరణకు కూర్పు, సంగ్రహణ లేదా మూలం అని తమ స్వంతపేర్లు వ్రాయకూడదు.
సోదర ప్రాజెక్టులు
మార్చుమెటా-వికీ, కామన్సు, విక్షనరీ, వికీబుక్సు, వికీకోట్, వికీసోర్స్ మొదలైనవి తెలుగు వికీపీడియా సోదర ప్రాజెక్టులు.
1.తెలుగు వికీపీడియా.
మార్చుఎవరైనా రాయదగిన ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము. ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు. ఇందులో ఏమేమి వ్రాయవచ్చు, ఎలా వ్రాయవచ్చు, వ్రాసేటప్పుడు కలిగే ఇబ్బందులు, వాటి నివారణ మొదలగు విషయాలు సందర్భాను సారంగా అక్కడక్కడా తెలుప బడినవి. వికీపీడియా - స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం వికీపీడియా - ఎన్సైక్లోపీడియా పేరును అనుసరిస్తూ పెట్టిన పేరిది. 2001 లో జిమ్మీ వేల్సు అనే అమెరికనుకు వచ్చిందీ స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం ఆలోచన. ఎవరైనా రాయగలిగేదీ, దిద్దుబాట్లు చెయ్యగలిగేదీ, చదువుకునేందుకు ఇంటర్నెట్లో అందరికీ ఉచితంగా అందుబాటులో ఉండేదే స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం. కార్య సాధకుడవడం చేత ఆలోచన వచ్చాక ఇక ఊరుకోలేదు, జిమ్మీ. తన ఆలోచనకు ఆకారమిస్తూ వికీపీడియాకు శ్రీకారం చుట్టాడు. అప్పటికే తాను రూపొందిస్తూ ఉన్న నుపీడియా అనే విజ్ఞాన సర్వస్వాన్ని పేరు మార్చి వికీపీడియాను మొదటగా ఇంగ్లీషు భాషలో మొదలుపెట్టాడు. వికీపీడియా చాలా త్వరగా ప్రజల మన్నలను పొందింది. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పెరిగి విశ్వవ్యాప్తమైంది. జర్మను, జపనీసు, స్పానిషు, ఫ్రెంచి, ఇటాలియను, రష్యను, చైనీసు ఇలా ప్రపంచ వ్యాప్తంగా అనేక ఇతర భాషల్లోనూ వికీపీడియాలు మొదలయ్యాయి. గొప్ప గొప్ప వ్యాసాలెన్నో తయారయ్యాయి, అవుతూ ఉన్నాయి. ఇంటర్నెట్లో వివిధ భాషలకు ప్రత్యేకించిన వెబ్ సైట్లలో ఈ విజ్ఞాన సర్వస్వాన్ని రాస్తున్నారు. 3. వికీసోర్సులో సార్వజనీయమైన రచనలు రచనలను మూలరూపంలో భద్రపరుస్తారు. ఉదాహరణగా శతకములు, పురాణములు, వేదములు మొదలైనవి. ఈ పనులు ప్రణాలికాబద్దంగా చేస్తారు. 4. కామన్సులో తెలుగు వికీపీడియాకు ఉపయోగపడే చిత్రాలు, ఛాయాచిత్రాలు, దృశ్య, శ్రవణ, మాధ్యమాలను భద్రపరుస్తారు. ఇవి ఏ వికీప్రాజెక్టులోనైనా వాడుకోవచ్చు 5. వికీబుక్సులో అందరూ కలిసి రూపొందించే పాఠ్యపుస్తకాలుంటాయి. 6. విక్షనరీలో తెలుగుపదాలకు అర్ధాలు, బహువచనాలు, ఇతర భాషానువాదాలు, వ్యాకరణ వివరాలు ఒక్కొక్క పదానికి ఉంటాయి. 7. వికీకోట్ లో ప్రముఖుల వాఖ్యలు ఉంటాయి.
తెలుగు విక్షనరీ
మార్చు- విక్షనరీ అనగా ఏమి?..... విక్షనరీ సమష్టి కృషితో రూపొందుతున్న బహుభాషా పదకోశం. వికీసోర్సు ఒక మూలాల (ఆధార రచనలు) భాండాగారం.
వికీపీడియాకు సోదర ప్రాజెక్టు ఐనటువంటి విక్షనరీలో ఎన్నో ఆంగ్ల పదాలకు, తెలుగు పదాలకు అర్థాలు ఉన్నాయి. మీకు అనువాదంలో ఏదైనా పదాలకు అర్థాలు కావలంటే దీనిని ఉపయోగించవచ్చు. అంతేకాక మీకు తెలిసిన పదాలను దీనికి చేర్చి విస్తరించండి. ఇది బహుభాషా నిఘంటువు. ప్రపంచ భాషలలో అన్ని భాషలకు ఇందులో అర్థాలు చేరుతు ఉన్నాయి. విక్షనరీ అన్ని భాషలలో వున్నది కనుకు తెలుగు వాడుకరులకు తెలుగు ఇంగ్లీషు కాక మరేదైనా భారతీయ భాష తెలిసి వుంటే..... అనగా..... హిందీ, తమిళము, కన్నడము, మలయాళము మొదలగు భాషలు తెలిసి వుండే అవకాశముంది. వారు తెలుగు భాషా పదాలకు వారికి తెలిసిన ఇతర భాషలలో సంబంధిత తెలుగు పదానికి ఆ యా భాషలలో అర్థము వ్రాయ వచ్చు. విక్షనరీ ఎవరైనా పాల్గొనదగిన ఒక స్వేచ్ఛా బహు భాషా పదకోశం. ఇది మామూలు పదకోశాల వంటిది కాదు.ఇక్కడ పదాల సమాచారాన్ని చూడటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు. ఇక్కడ లేని పదాల సమాచారాన్ని చేర్చవచ్చు కూడా. ఇది బహు భాషా నిఘంటువు. ప్రపంచ భాషలు అన్నింటిలో ఈ నిఘంటువు తయారవు తున్నది. వాడుకరులు విక్షనరీలో వున్న తెలుగు పదానికి సరియగు ఇతర భాషా పదాలను ఇక్కడ వ్రాయవచ్చు. తమకు తెలిసిన తెలుగు వాడుకరులలో తెలుగు, ఇంగ్లీషు, హిందీ, కన్నడ, తమిళము మొదలగు భాషలు కూడా కొందరికి తెలిసి వుండవచ్చు. ఆ భాషలలో ఇక్కడున్న తెలుగు పదానికి అర్థము వ్రాయవచ్చు. అదే విధంగా తెలుగు మాండలిక పదాలు మీకు తెలిసి వుంటే వాటిని కూడా ఇక్కడ వ్రాయవచ్చు. క్రొత్త వాడుకరులకు ఇక్కడ వ్రాయడము చాల సౌలభ్యంగా వుంటుంది. కనుక క్రొత్తవారు తమ రచనలను విక్షనరీలో ప్రారంబించండి. విక్షనరీ [1], వికీపీడియా యొక్క సోదర వెబ్ సైట్. ఈ పదం వికి, డిక్షనరి పదాలను కలుపగా తయారయ్యినది. ఇది తెలుగు పదాలను వివిధమైన వ్యాకరణ, వాడుక, నానార్ధ, వ్యతిరేఖార్థ లాంటి వివరణలతో నిక్షిప్తం చేసే మాధ్యమము (నిఘంటువు). అయితే పుస్తక రూపంలో వుండే నిఘంటువులు మహా అయితే మూడు భాషలలో వుంటాయి. దీనిలో తెలుగు-తెలుగు, ఇంగ్లీషు-తెలుగుతో పాటు ఇతర విక్షనరీలోని సమాన అర్థం గల పదాలకు లింకులుండటంవలన, మీకు ప్రపంచంలోని వికీ భాషలన్నిటిలో సమాన అర్థంగల పదాలను తెలుసుకునే వీలుండటంతో, దీనిని బహుభాష నిఘంటువుగా పేర్కొనవచ్చు. తెలుగు వికీపీడియాలో లాగా, ఇందులో ఎవరైనా తెలుగు పదాలకు పేజీలను సృష్టించవచ్చు లేక మార్పులు చేయవచ్చు వికీపీడియాకు సోదర ప్రాజెక్టు ఐనటువంటి విక్షనరీలో ఎన్నో ఆంగ్ల పదాలకు, తెలుగు పదాలకు అర్థాలు ఉన్నాయి. మీకు అనువాదంలో ఏదైనా పదాలకు అర్థాలు కావలంటే దీనిని ఉపయోగించవచ్చు. అంతేకాక మీకు తెలిసిన పదాలను దీనికి చేర్చి విస్తరించండి. ఇది బహుభాషా నిఘంటువు. ప్రపంచ భాషలలో అన్ని భాషలకు ఇందులో అర్థాలు చేరుతు ఉన్నాయి. విక్షనరీ అన్ని భాషలలో వున్నది కనుకు తెలుగు వాడుకరులకు తెలుగు ఇంగ్లీషు కాక మరేదైనా భారతీయ భాష తెలిసి వుంటే..... అనగా..... హిందీ, తమిళము, కన్నడము, మలయాళము మొదలగు భాషలు తెలిసి వుండే అవకాశముంది. వారు తెలుగు భాషా పదాలకు వారికి తెలిసిన ఇతర భాషలలో సంబంధిత తెలుగు పదానికి ఆ యా భాషలలో అర్థము వ్రాయ వచ్చు ముందుగా మొదటి పేజిలో మీకు కావలసిన పదం కోసం వెతకండి. ఆ పదం లేకపోతే సృష్టించాలా అన్న సందేశం వచ్చి ఆ పదం విషయంలో వున్నపేజీలేవైనా వుంటే వాటిని చూపిస్తుంది. సృష్టించాలా అనే దానిపై నొక్కితే, మీకు ఖాళీ పేజీ కనపడుతుంది. దానిలో మీరు తెలుగు పదం చేర్చబోతుంటే {{ subst: కొత్త తెలుగు పదం}}, ఆంగ్ల పదం చేర్చబోతుంటే {{subst: కొత్త ఆంగ్ల పదం}} అని రాసి దాచండి, ఆ తరువాత మార్పులు చేయండి. దీనిని సులభంగా చేయాలంటే మీరు పదాల మూస అనే పేజీకి వెళ్లి మీరు సృష్టించ తలచిన పదాన్ని అన్వేషించండి . ఆ పదానికి పేజీ ముందే సృష్టించబడి ఉంటే ఆ పదము మీకు నీలిరంగులో వుంటుంది. లేదంటే ఎర్ర రంగులో కనపడే పదాన్ని నొక్కినపుడు కొత్త పేజీ సృష్టించాలా అనే సందేశం కనిపిస్తుంది. తరువాత కొత్త తెలుగు పదం అనే మూసలో ఆ పదాన్ని వ్రాసి ప్రక్కన ఉన్న సృష్టించు అనే బటన్ నొక్కండి. మీరనుకున్న పదానికి ప్రారంభ మూసతో సహా పేజీ సిద్ధం అవుతుంది. మీరు తగినట్లుగా మార్పులు చేసి భద్ర పరచితే చాలు. ఒక్కొక్క విభాగానికి సంబంధించిన వివరాన్ని క్రింద చూడండి. ఆంగ్ల పదాన్ని చేర్చేటప్పుడు వున్న తెలుగు పదానికి లింకు ఇస్తే చాలు. పరభాషా పదాల పూర్తి వివరాల కొరకు సంబంధిత విక్షనరీ చూడాలి. దీనిలో భాషా భాగం, వ్యుత్పత్తి, వచనం వుంటాయి. వ్యాకరణ ఉప విభాగంలో పదం విభక్తి లేక లింగము లేక నామవాచకమో విశేషణం లేక ఇలా ఆపదం ఏ వ్యాకరణ విభాగానికి చెందినదో వ్రాయాలి. వ్యుత్పత్తి ఉప విభాగంలో పదం యొక్క మూల రూపము దాని మార్పులు ఇవ్వాలి. సాధారణంగా మాతృ భాషా పదాలకు మూలాలు భాషా పండితులు కానివారికి మూలాలు అంత సులభంగా తెలియవు. సరైన వనరులు భాషా పుస్తకాలు సంప్రదించి రాయవచ్చు. బహువచనము లేక ఏక వచనము అనే విభాగంలో ఆ పదము యొక్క వచన రూపం వ్రాయాలి.
అర్ధ వివరణ
మార్చుదీనిలో పదానికి తగిన అర్ధవివరణ వ్రాయాలి పదాలు దీనిలో నానార్ధాలు, సంబంధిత పదాలు, వ్యతిరేక పదాలు ఉంటాయి. నానా అర్ధాలులో పదానికి ఉండే ఇతర అర్ధాలు సమాన అర్ధాలు వ్రాయాలి. సంబంధిత పదాలులో ఆ పదానికి సంబంధించిన పదాలు వ్రాయాలి. వ్యతిరేక పదానికి ఆ పదానికి ఉండే వ్యతిరేక పదం వ్రాయాలి. నానార్ధాలు ఉపవిభాగంలో ఇతర సమానార్ధాలు వ్రాయాలి. ఇందులో ప్రాంతీయ, మాండలికాల భిన్న రూప పదాలు వ్రాయ వచ్చు. కూడా వ్రాయవచ్చు. ఉదా;- కోస్తా ప్రాంతంలో ప్రాంతంలో చిన్న బిడ్డ, పసి బిడ్డ అనేది కొంచం పడమట తెలుగు ప్రదేశాలలో సన్న బిడ్డ అంటారు. అలాంటివి నానార్ధాలులో పేర్కొన వచ్చు. అలాగే పదానికి వివిధ విభక్తి రూపాలు, వివిధ విశేషణ రూపాలు పేర్కొన వచ్చు. ఉదా: రాముడు, రాముడితో, రాముని, రాముడి వలన, రాముడే, రాముడి వంటి, రామునిలా, రాముడేనా, రాముడా ఇలా ఒకే పదం విభక్తి కారణంగా వివిధ రూపాలు మారుతుంటాయి. వాటిని సంబంధిత పద విభాగంలో పేర్కొన వచ్చు. అలాగే విశేషణం వలన మారే రూపాలు.
పద ప్రయోగాలు
మార్చుఇక్కడ పదాన్ని వాక్యాలలో, పద్య పాదాలలో, పాదాలలో, జానపదాలతో, సామెతలలో /పాటలలో ప్రయోగిస్తూ ఉదహరించాలి. ఈ పదప్రయోగం వున్న వాఖ్యము ఎవరు వ్రాశారు లేదా ఏ గ్రంథంలోనిది...... తెలియడానికి ఆ గ్రంథ కర్త, గ్రంథం పేరు వ్రాయాలి. ఉదాహరణకు: చందమామ అనే పదానికి అర్థము: చంద్రుడు అని, సంబంధిత పదాలలో వెన్నెల, .... అని, పద ప్రయోగములో మిస్సమ్మ సినిమా పాటలో పద ప్రయోగము అని వ్రాసి తర్వాత రావోయి చందమామ మా వింత గాధ వినుమా..... ... అని వ్రాయవచ్చు.
అనువాదాలు
మార్చుఇది సమగ్రంగా తయారైతే ఎక్కువ ఉపయోగంగా వుండే విభాగం. ఇందులో ఆ పదానికి ఇతర భాషలో అర్ధాలు తెలిసిన వారు వాటిని చేర్చ వచ్చు. అర్ధాల ప్రక్కన బ్రాకెట్ లో ఇతర భాషా ఉచ్ఛారణ తెలుగులో వ్రాయాలి. ఇక్కడ దిద్దుబాటులో ఆ భాషలకు లింకులు ముందే తయారుగా ఉంటాయి. వాటి మధ్య ఆ భాషా పదాన్ని వ్రాసినప్పుడు అది నేరుగా అయా భాషలలో ఆ పదం ఉన్న పేజీకి తీసుకు వెళుతుంది. అంతర వికీలు లింకులు బాట్లతో కూడా సృష్టించవచ్చి కాబట్టి ఈ విషయం చర్చ కొనసాగించాల్సి ఉంది.
మూలాలు వనరులు
మార్చుఇక మూలాలు, వనరులు అనగా మీకు ఎక్కడ ఆ పదం అర్ధంతో తారసపడింది తెలపండి. ఉదా: నకలు హక్కులు తీరిపోయిన నిఘంటువులలో, లేక అనుమతి పొందిన తరువాత ఇతర నిఘంటువులలోని వివరాలు చేర్చేటప్పుడు ఆ నిఘంటువు వివరాలను వనరులలో వ్రాయండి. తెలుగు వికీసో ర్సు (ఎవరైనా అభివృద్ధిపరచగల స్వేచ్ఛా విజ్ఞాన మూలములు ) ఇందులో కాపీ రైట్ హక్కులు గడువు తీరిపోయిన అనేక గ్రంథాలు ఇక్కడ పొందు పరచబడి ఉన్నాయి. ఇందులో ప్రవేశిస్తే ప్రక్కప్రక్కన రెండు పుటలున్న ఒక పేజి కనబడుతుంది. కుడి ప్రక్కన వున్న పుటలో ఆ గ్రంథానికి సంబంధించిన విషయమున్న ఒక పుట కనబడుతుంది. ఎడమ ప్రక్కన ఖాళీ పుట కనబడుతుంది. మీరు కుడిప్రక్కన వున్న పుటలోని విషయాన్ని యదాతదంగా (సవరించు టాబ్ ను నొక్కి) ఖాళీగా వున్న పుటలో వ్రాయవచ్చు. వ్రాసిన తరువాత దానిని భద్రపరిస్తే సరి. తరువాత మరొక పుటకు వెళ్ళ వచ్చు. ఇందులో చాల గ్రంథాలు మీ సేవలకొరకు ఎదురు చూస్తున్నాయి. కొత్తగా చేరిన వారికి ఇందులో వ్రాయడము చాల తేలిక. ప్రయత్నించండి.
తెలుగు వికీబుక్సు
మార్చు( ఇది స్వేచ్ఛానకలుహక్కులతో సమష్టిగా తయారు చేయగల పుస్తకాల జాల స్థలి). ప్రస్తుతం ఇందులో 55 వ్యాసాలున్నాయి.
వికీకోట్ వ్యాఖ్యలు
మార్చువికీవ్యాఖ్య ఒక ఉచిత ఆన్లైను వ్యాఖ్యల భాండాగారము. ఇందులో అన్ని భాషల ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు, వాటి అనువాదాలు కూడా లభిస్తాయి. అంతేకాదు వ్యాఖ్యలను చేసినవారి గురించి తెలుసుకోవడానికి తెలుగు వికీపీడియాకు లింకులు కూడా ఉంటాయి! తెలుగు వికీవ్యాఖ్యలో ఇప్పటివరకూ 333 పేజీలు తయారయ్యాయి. ఒక్కో పేజీలో ఒకటి కంటే ఎక్కువ వ్యాఖ్యలు సామెతలు ఉంటాయి. సహాయ పేజీని సందర్శించో లేకపోతే మీరే స్వయంగా ప్రయోగశాలలో ప్రయోగాలు జరిపో, ఇక్కడ ఎలా మార్పులు చేర్పులు చేయాలో నేర్చుకోండి. అంతేకాదండోయ్ ఇక్కడున్న ఏ పేజీనయినా మీరు ఇప్పటికిప్పుడు మార్చేయవచ్చు; అలాగే మీరు ఒక సభ్యత్వాన్ని తీసుకుని, మీకై మీరు ప్రత్యేకంగా ఒక సభ్య పేజీని కూడా సృష్టించుకోవచ్చు. (వికీవ్యాఖ్య ఒక ఉచిత ఆన్లైను వ్యాఖ్యల భాండాగారము. ఇందులో అన్ని భాషల ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు, వాటి అనువాదాలు కూడా లభిస్తాయి) ఇందులో ప్రముఖ వ్యక్తులు చెప్పిన వ్యాఖ్యలు, గ్రంథాలలో ఇచ్చిన వ్యాఖ్యలు మొదలగు నవి వ్రాయవచ్చు. ఈ సోదర ప్రాజెక్టులో విషయము చాల స్వల్పముగా ఉంది. క్రొత్తగా చేరిన వారికి ఇది కూడా సులభమైన వనరు. ప్రయత్నించండి. ఇందులో ప్రవేశించగానే అందులో ఏమేమి వ్రాయాలో అవగాహన అవుతుంది. చొరవగా ప్రయత్నించండి.
ఏమిటి వికీపీడియా విశిష్టత?
మార్చువికీ అంటే ఎవరైనా దిద్దుబాటు చెయ్యగల వెబ్సైటు అని అర్థం. వికీపీడియా అంటే ఎవరైనా దిద్దుబాటు చెయ్యగల ఎన్సైక్లోపీడియా. వికీపీడియా విజయ రహస్యమంతా ఈ వికీ అనే మాటలోనే ఉంది. వికీపీడియాలో రాసేది ఎవరో ప్రముఖ విద్యావంతులో, ప్రత్యేకంగా అందుకోసం నియమితులైన రచయితలో కాదు. మనలాంటి వారంతా అక్కడ రాస్తున్నారు. వికీపీడియాలో ఎవరైనా రాయవచ్చు, ఏ విషయం గురించైనా రాయవచ్చు. కొన్ని నిబంధనలకు, కట్టుబాట్లకు లోబడితే చాలు. అలాగే వికీపీడియాలోని వ్యాసాలను ఎవరైనా ఉచితంగా చదువుకోవచ్చు, డబ్బు కట్టక్కరలేదు. అంతేనా, ఆ వ్యాసాలను మీరు ప్రింటు తీసుకోవచ్చు. అసలు వికీపీడియా మొత్తాన్ని మీ కంప్యూటరు లోకి డౌనులోడు చేసుకోవచ్చు - పైసా డబ్బు చెల్లించకుండా!! ఇంకా అయిపోలేదు, ఈ మొత్తం వికీపీడియాను ప్రింటు తీసేసి, పుస్తకాలుగా కుట్టేసుకోవచ్చు. ఆగండి, ఇంకా ఉంది.. ఈ పుస్తకాలకు వెల కట్టి అమ్ముకోనూ వచ్చు!!!! వికీపీడియా మిమ్మల్ని పన్నెత్తి మాటనదు, పైసా డబ్బడగదు. ఒకే ఒక్కమాట - దీన్ని నేను వికీపీడియా నుండి సేకరించాను అని రాస్తే చాలు.
భారతీయ భాషల్లో వికీపీడియా
మార్చు1. మొదటగా 2001 లో ఇంగ్లీషులో మొదలైందీ వికీపీడియా. నిదానంగా ఇతర భాషలకూ విస్తరించి, ఇప్పుడు 200 కు పైగా భాషల్లో తయారవుతోంది. అందులో తెలుగూ ఒకటి. హిందీ, సంస్కృతం, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, తమిళం, మలయాళం, కన్నడ, ఉర్దూ, తెలుగు ఇలా దాదాపుగా అన్ని ప్రముఖ భారతీయ భాషల్లోనూ వికీపీడియా తయారవుతోంది. మనకు గర్వకారణమైన విషయమేమిటంటే, భారతీయభాషల వికీపీడియాలన్నిటిలోకీ తెలుగే ముందుంది. వ్యాసాల సంఖ్యలోగానీ, సభ్యుల సంఖ్యలో గానీ తెలుగు వికీపీడియాదే అగ్రస్థానం.
తెలుగు వికీపీడియా అంశాలు
మార్చుతెలుగు వికీపీడియాలో ఏమేం రాస్తున్నారు తెలుగు వికీపీడియా వెబ్ అడ్రసు: http://te.wikipedia.org. చరిత్ర, సంస్కృతి, ప్రముఖ వ్యక్తులు, సినిమా, భాష, నగరాలు, పట్టణాలు, గ్రామాలు, రచయితలు, కంప్యూటర్లు, సైన్సు, రాజ్యాంగ వ్యవస్థ, నదులు.. ఇలా ఎన్నో విషయాలపై రాస్తున్నారు. 13 వేలకు పైగా సభ్యులు 60 వేలకు పైగా వ్యాసాల మీద ప్రస్తుతం పనిచేస్తున్నారు. ప్రఖ్యాత రచయితలు, సంఘసేవకులూ కూడా వికీపీడియాలో రాస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల లోని అన్ని గ్రామాల గురించీ రాయాలనే సంకల్పంతో సభ్యులు రేయింబవళ్ళు పనిచేస్తున్నారు. చాల వరకు పని పూర్తయింది. రేయింబవళ్ళు అనే మాట వాక్యంలో తూకం కోసం వాడింది కాదు.., భారత్, అమెరికా, కెనడా, బ్రిటను, ఫ్రాన్సు, కొరియా, ఆస్ట్రేలియా ఇలా ప్రపంచం నలుమూలలలోనూ ఉన్న తెలుగువారు ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. అంచేతే ఎల్లవేళలా వికీపీడియాలో ఎవరో ఒకరు రాస్తూనే వుంటారు.
ఎవరీ నిర్వాహకులు?
మార్చువికీపీడియాలో ఉన్న కొద్దిపాటి నియమాలను కుటుంబపరమైన బాధ్యతలుగా అమలు చేసే సభ్యులు ఉఁటారు. వారిని నిర్వాహకులు అని అఁటారు. నిర్వాహకులకు మిగిలినవారిపై పెత్తనం చెలాయించే హక్కు గాని, వివాదాలను పరిష్కరించే హోదా గాని లేవు. వారి అభిప్రాయాలకు ప్రత్యేకమైన విలువ లేదు. అయితే నిర్వాహకులకు ఇప్పటికే కొంత అనుభవం ఉన్నందున వారి సూచనలను బహుశా ఇతరులు గౌరవించ వచ్చును. నిర్వాహకుడు కావడం ఎలా ఏసభ్యుడైనా/సభ్యురాలైనా నిర్వాహకుడు/ నిర్వాహకు రాలు కావచ్చు. వికీపీడియాలో ఉన్న సమాచారం మీద నిర్వాహకులకు ప్రత్యేక హక్కులేమీ లేవు; వాళ్ళు చిన్నపిల్లల బడిలో ఆయాల వంటి వారు. నిర్వాహకులు పేజీలను తొలగించగలరు (వికీపీడియా:తొలగింపు విధానం), సంరక్షించగలరు (వికీపీడియా:సంరక్షణ విధానం), నిరోధించగలరు (వికీపీడియా:నిరోధ విధానం). పై చర్యలన్నిటినీ మరో నిర్వాహకుడు/నిర్వాహకురాలు రద్దు చెయ్యవచ్చు. మీరు వికీపీడియాలో చురుగ్గా ఉంటే (కనీసం ఒక వెయ్యి దిద్దుబాట్లు చేసి ఉంటే), నిర్వాహకత్వం కోరవచ్చు.
నిర్వాహకుడి హోదా
మార్చునిర్వాహకులు (ఇంగ్లీషులో sysop అని అంటారు, System Operator కు సంక్షిప్త రూపం) పేజీలను తొలగించడం, మళ్ళీ చేర్చడం, మార్పులు చేర్పులకు అవకాశం లేకుండా సంరక్షించడం, సంరక్షించినవాటిని మార్చడం, విధానాలని అతిక్రమించే సభ్యులను నిషేధించడం మొదలైనవి చెయ్యగలరు. సాధారణంగా వాళ్ళు వికీపీడియా:తొలగింపు కొరకు వోట్లు వంటి పేజీల్లో వికీ అభిమతాన్ని అమలుచేస్తూ వుంటారు. నమోదయిన సభ్యులు మాత్రమే నిర్వాహకులు కాగలుగుతారనేది సుస్పష్టం. మామూలుగా కొన్నినెలల పాటు వికీపీడియాలో ఓ మాదిరి స్థాయిలో పనిచేసి, ఎవరితోనూ గొడవలు పడకుండా వుండివుంటే నిర్వాహకుడు కావడానికి సరిపోతుంది.