వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/ఎర్రలింకుల సంస్కరణ
ఈ ప్రాజెక్టు ప్రాధాన్యత
మార్చుఇది మంచి ప్రాజెక్టు.దీని వలన వ్యాసాల నాణ్యత పెరిగింది. వ్యాసాలు చదివేవార్కి వారి దృష్టి వీటిమీద పడి ఏవగింపుగా లేకుండా, ప్రత్యేక పేజీలు ద్వారా వివరించబడిన కొన్ని అభ్యంతరాలుకు పరోక్షంగా నిర్వహణకు ఉపయోగపడింది. ఈ ఎర్ర లింకులపై కొద్దిగా పరిజ్ఞానం ఉన్న వాడుకరులు సాధారణ సవరణలు చేసే సమయంలో వాటిని తగువిధంగా సవరించిన సందర్బాలు ఉండవచ్చు. నా అనుభవంలో వ్యాసం ఉండి కూడా లింకు కలపనివి చాలా చూసి లింకు కలిపిన సందర్బాలు చాలా ఉన్నవి. అలా ఎన్ని చేసినా అది లెక్కలోనికి రానిపరిస్థితి ఉంది.అలాగే వీటి వివరాలు, పూర్తిగా అందరికి తెలియని పరిస్థితి ఉంది. ఈ ప్రాజెక్టు వలన ఏందుకు చేయాలి? ఏమోమి చేసాం? ఇంకా ఏమోమి చేయాలి? అనే వివరాలపై స్థితి తెలిసింది, ఇలాంటి మంచి ప్రాజెక్టు ఆచరణలోకి తీసుకొచ్చిన ప్రాజెక్టు నిర్వహకులు చదువరి గారికి ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 06:55, 29 ఆగస్టు 2022 (UTC)