వికీపీడియా చర్చ:సమావేశం/తెవికీ జన్మదిన వేడుక 2021

తాజా వ్యాఖ్య: 2 సంవత్సరాల క్రితం. రాసినది: MYADAM ABHILASH

సభ్యులకు నమస్కారం, కరోనా వల్ల గత రెండేళ్ళుగా తెవికీ ఆధ్వర్యంలో ఆఫ్‌లైన్‌ కార్యక్రమాలు (సమావేశాలు, శిక్షణా శిబిరాలు) జరగలేదు. అయితే, ఈ రెండేళ్ళకాలంలో కొంతమంది కొత్త వాడుకరులు తెవికీకి రావడమేకాకుండా తెవికీ అభివృద్ధిలో కృషి చేస్తున్నారు. కాబట్టి ఈసారి తెవికీ జన్మదిన వేడుకలను సముదాయ సభ్యులతో కొత్త వాడుకరుల పరిచయ వేదికగా, తెవికీ శిక్షణ కార్యక్రమంగా నిర్వహిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అందుకోసం వచ్చే ఆదివారం (డిసెంబరు 19న) రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ థియేటర్ లో ఉదయం 10 నుండి సాయంత్రం 5 వరకు జన్మదిన వేడుకలను నిర్వహించుకొని, అక్కడినుండి అందరం కలిసి హైదరాబాదు పుస్తక ప్రదర్శనను సందర్శించడాన్ని ప్రతిపాదిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పాల్గొనవీలుకాని వారికోసం కొంత సమయం (ఒక గంట లేదా రెండు గంటలపాటు) కేటాయించుకొని ఆన్లైన్ వేదికగా పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసుకుందాం. ఈ ప్రతిపాదనపై సభ్యులు తమ స్పందనలు, సలహాలు, సూచనలు తెలియజేయగలరు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 05:36, 13 డిసెంబరు 2021 (UTC)Reply

ప్రణయ్ రాజ్ గారు నిర్ణయించిన తెవికీ జన్మదిన వేడుకల తేదీ, స్థలాలు నాకు అనుకూలంగా ఉన్నాయి. నేను కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొనగలను.-అభిలాష్ మ్యాడం 05:44, 13 డిసెంబరు 2021 (UTC)Reply
Return to the project page "సమావేశం/తెవికీ జన్మదిన వేడుక 2021".