విజయనగరం జమీందారీ

విజయనగరం జమీందారీ మద్రాసు ప్రెసిడెన్సీకి చెందిన జమీందారీలలో ఒకటి. [1] 1949 లో ఈ జమీందారీ ఇండియన్ యూనియన్‌లో చేరింది. [2]

విజయనగరం జమీందారీ
జమీందారీ , బ్రిటిషు భారతదేశం
1591–1949

Coat of arms of విజయనగరం

Coat of arms

చరిత్ర
 -  పరిచ్ఛేది వంశానికి చెందిన అమల రాజు (విజయనగరం శాఖ స్థాపకుడు) పూసపాడు గ్రామాన్ని నిర్మించాడు. పూసపాటి వంశనామం అలా ఏర్పడింది 1591
 -  జమీందారీ రద్దు 1949
విస్తీర్ణం
 -  1901 7,680 km2 (2,965 sq mi)
జనాభా
 -  1901 9,00,000 
Density 117.2 /km2  (303.5 /sq mi)
విజయనగరం కోట పశ్చిమ ద్వారం.

ఈ ప్రాంతాన్ని మధ్యయుగ కాలం వరకు కుంతల్ (ప్రాచీన బనారస్) ప్రాంతానికి చెందిన వివిధ హిందూ చక్రవర్తులు పాలించారు. కళింగకు (ప్రస్తుత ఒడిశాలో ఎక్కువ భాగం) చెందిన గజపతి సామ్రాజ్యం పతనమైన తరువాత ఈ ప్రాంతాన్ని రాంచీమోర్ పాలకులు పరిపాలించారు. విజయనగరానికి చెందిన మహారాజుల పూర్వీకులు మహారాజా వీర్ ప్రతాప్ వంశానికి చెందినవారు. అంటే రాజస్థాన్‌లో పురాతన సూర్యవీర్ పాలక వంశానికి చెందిన రాజులే, విజయనగరాన్ని నిర్మించిన పూర్వీకులు కూడా.

చరిత్ర

మార్చు

పూసపాటి వంశీకులు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రాచీన పాలక వంశం పరిచ్ఛేది వారసులు. పరిచ్ఛేదిలు హిందూ మతాన్ని ప్రోత్సహించారు. తీర ప్రాంతానికి వెళ్ళిన తరువాత వీరి కుటుంబపు పేరు పూసపాటిగా మారింది. నందిగామ తాలూకాలోని పూసపాడు గ్రామాన్ని పరిచ్ఛేది వంశానికి చెందిన పాలకుడు అమల రాజు నిర్మించాడు. ఈ సంస్థాన పాలకులు పూసాపాడు నుండి వచ్చారు, అందువల్ల వారిని పూసపాటి వారు అని పిలుస్తారు. వారు విజయనగరం నగరాన్ని స్థాపించారు, దీనికి విజయ రామరాజు పేరు పెట్టారు, దీనిని హంపిలోని విజయనగర రాజవంశం నుండి వేరు చేయడానికి దీని ఇంగ్లీషు పేరులో Z చేర్చి Vizianagaram అన్నారు. 18 వ శతాబ్దంలో జైపూర్ రాజ్యానికి చెందిన విక్రమ్ దేవ్ I కు వ్యతిరేకంగా ఉత్తర సర్కారుల బ్రిటిష్ దళాలకు సహాయం చేసిన తరువాత వారు గజపతి అనే బిరుదును పొందారు.

1754 లో, విజయనగరంలో పాలక కుటుంబానికి చెందిన పూసపాటి విజయరామ గజపతి రాజు, ఫ్రెంచి వారితో పొత్తు పెట్టుకున్నాడు. కాని కొన్నేళ్ల తరువాత ఈ భూభాగాన్ని బ్రిటిష్ వారికి అప్పగించాల్సి వచ్చింది. ఇది 1947 లో స్వాతంత్ర్యం వరకు వారి నియంత్రణలోనే ఉంది.

విజయనగరం కోటను సా.శ 1712–1714 సంవత్సరంలో నిర్మించారు. సాంప్రదాయకంగా ఈ కోట నిర్మాణ ప్రారంభంలో ఐదు విజయ సంకేతాలు ఉన్నాయి. ఇది దాని స్థాపకుడు 'విజయ' రామరాజు పేరు మీద నిర్మించారు. శంకుస్థాపన మంగళవారం ('జయ'వారం) నాడు చేసారు. తెలుగు వారి పంచాంగం ప్రకారం 'విజయ' నామ సంవత్సరం, దసరా ఉత్సవాల పదవ రోజున 'విజయ'దశమి రోజున శంకుస్థాపన చేసారు. 1827 లో మహారాజా విజయ రామ గజపతి రాజు III కు బ్రిటిష్ ప్రభుత్వం పలు గౌరవాలు ప్రదానం చేసింది. లార్డ్ నార్త్‌బ్రూక్ అతనికి హిస్ హైనెస్ అనే బిరుదు ఇప్పించాడు.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Imperial Gazetteer of India, v. 24, p. 339.
  2. "Vizianagram (Zamindari)". Archived from the original on 2018-10-26. Retrieved 2020-05-05.

వెలుపలి లంకెలు

మార్చు