రాజగోపాలవిలాసము
తెలుగు పద్యకావ్యం
(రాజగోపాల విలాసము నుండి దారిమార్పు చెందింది)
రాజగోపాలవిలాసము 17వ శతాబ్దానికి చెందిన ఒక తెలుగు పద్యరచన. దీనిని విజయరాఘవ నాయకుని ఆస్థానకవి యైన చెంగల్వ కాళయ రచించెను. రచయిత తన కృతిని తంజావూరు నాయకరాజైన విజయరాఘవ నాయకుడు అంకితమిచ్చెను.

దీనిని మొదటిసారి తంజావూరు సరస్వతీ మహల్ గ్రంథాలయం వారు 1951 ముద్రించి ప్రచురించారు. నిడుదవోలు వెంకటరావు విపులమైన పీఠికను ఆంగ్ల-తెలుగు భాషలలో అందించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు.
విషయ సంగ్రహం
మార్చుఈ పద్యకావ్యం ఐదు ఆశ్వాసాలుగా రచించబడినది. వీనిలో రాజగోపాలునిగా పేర్కొన్న శ్రీకృష్ణుని అష్టమహిషులను శృంగార నాయికలుగా కీర్తించబడ్డారు.
మూలాలు
మార్చు- శ్రీ రాజగోపాలవిలాసము (1951) రచయిత: చెంగల్వ కాళకవి, సంపాదకుడు: నిడుదవోలు వెంకటరావు, ప్రచురణ: గోపాలన్, సరస్వతీ మహల్ గ్రంథాలయం, తంజావూరు.