విజయ్ పాండురంగ భట్కర్


విజయ్ పాండురంగ్ భట్కర్ భారతీయ కంప్యూటర్ శాస్త్రవేత్త, ఐటి నాయకుడు, విద్యావేత్త. అతను భారతదేశం జాతీయ స్థాయిలో ప్రథమ ప్రయత్నమైన సూపర్ కంప్యూటింగ్‌ లో నిర్మాణ శాస్త్రవేత్తగా గుర్తింపు పొందాడు. అక్కడ అతను పరం సూపర్ కంప్యూటర్ల అభివృద్ధికి నాయకత్వం వహించాడు . అతని కృషికి గాను భారతదేశ పౌర పురస్కారాలైన పద్మ భూషణ్, పద్మశ్రీ లతో పాటు మహారాష్ట్ర భూషణ్ పురస్కారాన్ని పొందాడు. భారతీయ కంప్యూటర్ మ్యాగజైన్ డేటాక్వెస్ట్ అతన్ని భారతదేశ ఐటి పరిశ్రమకు మార్గదర్శకులలో ఒకనిగా నిలిపింది. అతను సి-డిఎసి వ్యవస్థాపక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌. అతను ప్రస్తుతం భారతదేశం కోసం ఎక్సాస్కేల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్‌ను అభివృద్ధి చేసే పనిలో ఉన్నాడు.

విజయ్ భట్కర్
జననం
విజయ్ పాండురంగ భట్కర్

1946 అక్టోబరు 11
మురంబ, మూర్తిజాపూర్, అకోలా జిల్లా, మహారాష్ట్ర
జాతీయతభారతీయుడు
విద్యాసంస్థ
  • విశ్వేశ్వరాయ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నాగాపూర్
  • మహారాజా సయాజీరావు యూనివర్శిటీ ఆఫ్ బరోడా
  • ఐ.ఐ.టి - డిల్లీ
సుపరిచితుడు/
సుపరిచితురాలు
సూపర్ కంప్యూటర్ల శ్రేణి ఫ"పరమ్" కు వాస్తుశిల్పి
పురస్కారాలు
  • పద్మభూషణ్
  • పద్మశ్రీ
  • మహారాష్ట్ర భూషణ పురస్కారం

భట్కర్ జనవరి 2017 నుండి భారతదేశంలోని నలంద విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్‌గా ఉన్నాడు. దీనికి ముందు, 2012 నుండి 2017 వరకు ఐఐటి ఢిల్లీ బోర్డు బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఛైర్మన్‌గా పనిచేశాడు. ప్రస్తుతం ఆయన భారతీయ శాస్త్రవేత్తల లాభాపేక్షలేని సంస్థ అయిన విజ్ఞాన భారతి ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. .

మూలాలు

మార్చు