విజయ్ శర్మ

ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి

విజయ్ శర్మ (జననం 1973) ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023లో శాసనసభ ఎన్నికల్లో కవార్ధా శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై, 2023 డిసెంబరు 13న ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[1]

విజయ్ శర్మ
విజయ్ శర్మ


3వ ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
13 డిసెంబర్ 2023
Serving with [[అరుణ్ సావో]]
గవర్నరు బిశ్వభూషణ్ హరిచందన్
ముందు టి.ఎస్. సింగ్‌దేవ్

ఎమ్మెల్యే
పదవీ కాలం
3 డిసెంబర్ 2023 – ప్రస్తుతం
ముందు మొహమ్మద్ అక్బర్
నియోజకవర్గం కవార్ధా

వ్యక్తిగత వివరాలు

జననం 1973
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసం కవార్ధా
పూర్వ విద్యార్థి పండిట్ రవిశంకర్ శుక్లా యూనివర్సిటీ, రాయపూర్

జననం, విద్యాభాస్యం

మార్చు

విజయ్ శర్మ 1973లో జన్మించి రాయ్‌పూర్‌లోని పండిట్ రవిశంకర్ శుక్లా విశ్వవిద్యాలయం నుండి 1996లో ఫిజిక్స్‌లో ఎంఎస్సీ, 2001లో భోపాల్‌లోని మధ్యప్రదేశ్ భోజ్ ఓపెన్ యూనివర్సిటీ నుండి ఎంసీఎంలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశాడు.[2]

రాజకీయ జీవితం

మార్చు

విజయ్ శర్మ బీజేపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి జిల్లా పంచాయితీ సభ్యుడిగా, భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా, ఛత్తీస్‌గఢ్ బిజెపికి ప్రధాన కార్యదర్శిగా వివిధ హొయిదాల్లో పనిచేసి 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కవార్ధా శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై[3], 2023 డిసెంబరు 13న ఛత్తీస్‌గఢ్ 3వ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[4]

మూలాలు

మార్చు
  1. India Today (13 December 2023). "Vishnu Deo Sai sworn in as Chhattisgarh Chief Minister, PM Modi present" (in ఇంగ్లీష్). Archived from the original on 14 December 2023. Retrieved 14 December 2023.
  2. NDTV (14 December 2023). "5 Facts About New Chhattisgarh Deputy Chief Minister Vijay Sharma". Archived from the original on 14 December 2023. Retrieved 14 December 2023.
  3. బీబీసీ News తెలుగు (3 December 2023). "ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు-2023 - BBC News తెలుగు". Archived from the original on 10 December 2023. Retrieved 10 December 2023.
  4. The Indian Express (14 December 2023). "Meet BJP's new Chhattisgarh Deputy CMs: Sahu OBC leader Arun Sao, Hindutva face Vijay Sharma" (in ఇంగ్లీష్). Archived from the original on 14 December 2023. Retrieved 14 December 2023.