విజయ కిషోర్ రహత్కర్

విజయ కిషోర్ రహత్కర్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024 అక్టోబర్ 19న జాతీయ మహిళ కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) చైర్‌పర్సన్‌గా నియమితురాలైంది.[1]

విజయ కిషోర్ రహత్కర్
విజయ కిషోర్ రహత్కర్


పదవీ కాలం
2024 అక్టోబర్ 20 – ప్రస్తుతం
ముందు రేఖా శర్మ

పదవీ కాలం
2016 – 2021

ఔరంగాబాద్ మేయర్‌
పదవీ కాలం
2007 – 2010

వ్యక్తిగత వివరాలు

జననం (1966-08-21)1966 ఆగస్టు 21
ఔరంగాబాద్, ఔరంగాబాద్ జిల్లా, మహారాష్ట్ర
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి కిషోర్ రహత్కర్
సంతానం కళ్యాణి
నివాసం మహారాష్ట్ర
పూర్వ విద్యార్థి పూణే విశ్వవిద్యాలయం
వృత్తి రాజకీయ నాయకురాలు

జననం, విద్యాభాస్యం

మార్చు

విజయ కిషోర్ రహత్కర్ మహారాష్ట్రలో జన్మించి డిగ్రీని సైన్స్‌లో మేజర్‌గా ఫిజిక్స్‌లో పూర్తి చేసి పూణే యూనివర్శిటీ నుండి హిస్టరీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తి చేసింది.

రాజకీయ జీవితం

మార్చు

విజయ కిషోర్ రహత్కర్ 1995లో భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2000 నుండి 2010 వరకు ఔరంగాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌ కార్పొరేటర్‌గా ఎన్నికై 2007 నుండి 2010 వరకు ఔరంగాబాద్ర్ మేయర్‌గా పని చేసింది. ఆమె మేయర్‌గా ఉన్న సమయంలో నేషనల్ మేయర్స్ కౌన్సిల్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా, మహారాష్ట్ర మేయర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్‌గా పని చేసింది.

విజయ కిషోర్ రహత్కర్ 2010 నుండి 2014 వరకు వరుసగా రెండు పర్యాయాలు బీజేపీ మహిళా మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శిగా, 2014లో బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా, రాజస్థాన్ బీజేపీ యూనిట్ కో-ఇన్‌చార్జ్‌గా, 2016 నుండి 2021 వరకు మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా పని చేసి ఆ తరువాత 2024 అక్టోబర్ 19న జాతీయ మహిళ కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) చైర్‌పర్సన్‌గా నియమితురాలైంది.[2][3][4] ఆమెను ఛైర్‌పర్సన్‌గా మూడు సంవత్సరాల పాటు నామినేట్ చేస్తూ పదవికి బాధ్యతలు స్వీకరించే తేదీ లేదా 65 ఏళ్ల వయస్సు వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు, ఏది ముందుగా అయితే అది” అని మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అధికారిక నోటిఫికేషన్‌లో తెలిపింది.[5][6][7]

మూలాలు

మార్చు
  1. The Hindu (19 October 2024). "Vijaya Kishore Rahatkar appointed new NCW chairperson" (in Indian English). Retrieved 20 October 2024.
  2. Hindustantimes (19 October 2024). "Who is Vijaya Kishore Rahatkar, the new NCW chief?". Retrieved 20 October 2024.
  3. Eenadu (20 October 2024). "ఎన్‌సీడబ్ల్యూ కొత్త ఛైర్‌పర్సన్‌గా విజయా కిశోర్‌ రహాట్కర్‌". Retrieved 20 October 2024.
  4. India Today (19 October 2024). "Vijaya Kishore Rahatkar named new National Commission for Women chief" (in ఇంగ్లీష్). Retrieved 20 October 2024.
  5. The New Indian Express (19 October 2024). "Vijaya Kishore Rahatkar appointed as new NCW chief" (in ఇంగ్లీష్). Retrieved 20 October 2024.
  6. Swarajya (19 October 2024). "Who Is Vijaya Kishore Rahatkar, The New Chairperson Of National Commission For Women" (in ఇంగ్లీష్). Retrieved 20 October 2024.
  7. Sakshi. "ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్‌గా విజయా కిశోర్‌ | Vijaya Kishore Rahatkar appointed new National Commission for Women chief | Sakshi". Retrieved 20 October 2024.