విజయ మేరి చర్చి, హైదరాబాదు
విజయ మేరి చర్చి హైదరాబాదులోని చింతల్‌బస్తీ ప్రాంతంలో ఉన్న క్రైస్తవ ప్రార్థనామందిరం. ఇది 1905లో స్థాపించబడింది. దీనిని ఆరోగ్యమాత చర్చి అని కూడా పిలుస్తారు.[1] హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.
చరిత్ర
మార్చుహైదరాబాదులోని చింతల్ బస్తీ, మహావీర్ హాస్పిటల్, మాసబ్ ట్యాంక్, ఏసి గార్డ్స్, ఖైరతాబాదు మొదలైన ప్రాంతాలకు సమీపంలో ఒక చర్చి ఉంటే బాగుంటదని భావించిన బ్రిటీషు వారు చింతల్‌బస్తీ ప్రాంతంలో ఈ చర్చిని నిర్మించారు.
నిర్మాణం
మార్చు1903లో ఈ చర్చి నిర్మాణం ప్రారంభమై, అదే ఏడాది చివర్లో నిర్మాణం పూర్తయింది. దీని నిర్మాణానికి 3,500 రూపాయలు ఖర్చు అయింది. 1904, జనవరి 10న డోగ్మా యొక్క జ్ఞాపకార్థంగా బిషప్ విగానో చేత ఈ చర్చి ప్రారంభించబడింది.[2] అయితే, రోజురోజుకి చర్చికి వచ్చే భక్తుల సంఖ్య పెరగడంతో నూతన ప్రార్థన మందిర నిర్మాణంకోసం 1954, డిసెంబర్ 27న ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ శంకుస్థాపన చేశాడు. 1959, సెప్టెంబర్ 15న ఈ నూతన భవనం ప్రారంభించబడింది.[3]
ఎనభై అడుగుల ఎత్తున్న ఈ చర్చికి 47 అడుగుల ఎత్తైన అష్టభుజ గోపురం ఉంది.
కార్యక్రమాలు
మార్చుఈ చర్చిలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8న మేరిమాత జన్మదిన వేడుకలు జరుగుతాయి. ఈ వేడుకలకు దాదాపు లక్షమందికి పైగా వస్తారు.
మూలాలు
మార్చు- ↑ విజయ మేరి చర్చి,ఆదాబ్ హైదరాబాదు, మల్లాది కృష్ణానంద్, 2014, హైదరాబాదు, పుట. 45
- ↑ Telangana Today, Hyderabad (2 September 2018). "Hyderabad's 114-year-old shrine set for annual fete". Sunny Baski. Archived from the original on 3 April 2019. Retrieved 3 April 2019.
- ↑ Deccan Chronicle (7 September 2017). "Khairatabad gears up for Mother Mary feast". Archived from the original on 3 April 2019. Retrieved 3 April 2019.