విటమిన్ షి
విటమిన్ షి 2020లో విడుదలైన తెలుగు సినిమా. ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రవి పొలిశెట్టి నిర్మించిన ఈ సినిమాకు వి.జయశంకర్ దర్శకత్వం వహించాడు. శ్రీకాంత్ గుర్రం, ప్రచి తాకెర్, రంజిత్ రెడ్డి, వికాస్ పొన్నూరు, సంజీవ్ జోషి, మోయిన్, అశోక్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2020 డిసెంబరు 30న ఎం.ఎక్స్ ప్లేయర్ ఓటీటీలో విడుదలైంది.[1]
విటమిన్ షి | |
---|---|
దర్శకత్వం | వి.జయశంకర్ |
రచన | వి.జయశంకర్ |
నిర్మాత | రవి పొలిశెట్టి |
తారాగణం | శ్రీకాంత్ గుర్రం, ప్రచి తాకెర్, రంజిత్ రెడ్డి |
ఛాయాగ్రహణం | శివ శంకర వర ప్రసాద్ |
కూర్పు | నాని లుక్క |
సంగీతం | పివిఆర్ రాజా |
నిర్మాణ సంస్థ | ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | డిసెంబర్ 30, 2020 (ఎం.ఎక్స్ ప్లేయర్ ఓటీటీ) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చులింగబాబు యోగానంద అలియాస్ లియో (శ్రీకాంత్ గుర్రం) రోజూ ఫోన్ ఏ లోకంగా బతికే అబ్బాయి. లియో తన స్నేహితుడి సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ అక్కడే పనిచేసే వైదేహి (ప్రాచి టక్కర్) ను ప్రేమిస్తుంటాడు. లియో తన పాత మొబైల్ పాడవ్వడంతో ‘విటమిన్ షి’ అనే కొత్త మొబైల్ కొంటాడు. కొత్తగా కొన్న ఫోన్‌లో ఉన్న వాయిస్ అసిస్టెంట్ లైలాపై పూర్తిగా పడి చివరికి తన ప్రేమ గురించి కూడా లైలా దగ్గర సలహాలు తీసుకోవడం మొదలుపెడతాడు. లియోని వైదేహి ప్రేమించేలా చేసిన లైలా తర్వాత వారిద్దరి మధ్య దూరం పెరిగేలా చేస్తుంది. తరువాత లైలాపై ఆధారపడిన లియో తన ప్రేమలో గెలిచాడా లేదా? చివరికి లియో వైదేహి పెళ్లి చేసుకున్నారా లేదా ? అనేదే మిగతా సినిమా కథ.[2][3]
నటీనటులు
మార్చు- శ్రీకాంత్ గుర్రం
- ప్రచి తాకెర్
- రంజిత్ రెడ్డి
- వికాస్ పొన్నూరు
- సంజీవ్ జోషి
- మోయిన్
- అశోక్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్
- నిర్మాత: రవి పొలిశెట్టి
- కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: వి.జయశంకర్[4]
- సంగీతం: పివిఆర్ రాజా
- సినిమాటోగ్రఫీ: శివ శంకర వర ప్రసాద్
- ఎడిటర్: నాని లుక్క
- ఓటీటీ ప్లాట్ ఫామ్: MX Player
సంగీతం
మార్చుఈ చిత్రం యొక్క పాటలు, నేపథ్య సంగీతం పి.వి.ఆర్. రాజా స్వరపరిచాడు. ఈ చిత్రంలో అన్ని పాటలు పివిఆర్ రాజా రచించాడు[5]
సం. | పాట | పాట రచయిత | గానం | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "నిన్నే చూసిన క్షణమే" | పి.వి.ఆర్. రాజా | ధనుంజయ్ | 2:16 |
2. | "నిన్నే చూసిన క్షణమే" | పి.వి.ఆర్. రాజా | బృందా | 1:23 |
3. | "నా యదనే" | పి.వి.ఆర్. రాజా | ధనుంజయ్ | 2:17 |
మొత్తం నిడివి: | 5:56 |
మూలాలు
మార్చు- ↑ The Times of India (2 January 2021). "Jayashankarr's Vitamin She gets a positive response as it streams on MX Player - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 14 October 2021. Retrieved 14 October 2021.
- ↑ The Hans India (30 December 2020). "Vitamin She Movie Review & Rating {2.75/5}". Archived from the original on 14 October 2021. Retrieved 14 October 2021.
- ↑ Zee Cinemalu (30 December 2020). "'విటమిన్ షి' మూవీ రివ్యూ" (in ఇంగ్లీష్). Archived from the original on 14 October 2021. Retrieved 14 October 2021.
- ↑ The Times of India (7 January 2021). "We will be controlled by mobile technology in the near future: 'Vitamin She' director V Jayashankarr - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 14 October 2021. Retrieved 14 October 2021.
- ↑ "Vitamin She (Original Motion Picture Sound Track)". open.spotify.com. Spotify. Retrieved 18 February 2021.