పివిఆర్ రాజా

భారతీయ సంగీత స్వరకర్త

పీవీఆర్ రాజా (PVR Raja) గా పేరొందిన పెనుమత్స వెంకట రామరాజు (జ. 1985 జూన్ 1) ఒక భారతీయ సంగీత దర్శకుడు, స్వరకర్త, గేయ రచయిత, సంగీత ఉపాధ్యాయుడు మరియు గిటారిస్ట్. "లఘుచిత్రాల ఇళయరాజా", "షార్ట్ ఫిలిమ్స్ మాస్ట్రో"గా తెలుగు లఘు చిత్ర పరిశ్రమలో జనాదరణ పొందాడు. 250కి పైగా లఘు చిత్రాలకి సంగీత దర్శకత్వం చేసాడు. తెలుగులో అత్యధిక లఘు చిత్రాలకు సంగీతం అందించినందుకు గాను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించాడు. విటమిన్ షి, బ్లాక్ మరియు మది తెలుగు చలన చిత్రాలకు సంగీత దర్శకుడు.[1][2][3][4][5][6]

P.V.R. Raja (Composer)
పీ. వీ. ఆర్. రాజా
శిల్పకళా వేదిక వద్ద స్వరకర్త పీ. వీ. ఆర్. రాజా
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంపెనుమత్స వెంకట రామరాజు
ఇతర పేర్లు
* షార్ట్ ఫిలిమ్స్ మాస్ట్రో
* లఘు చిత్రాల ఇళయరాజా
జననం (1985-06-01) 1985 జూన్ 1 (వయసు 39)
ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
సంగీత శైలిసినిమా
వృత్తిస్వరకర్త, రికార్డు నిర్మాత, పాటల రచయిత, సంగీత దర్శకుడు
వాయిద్యాలుగిటార్
క్రియాశీల కాలం2013–ప్రస్తుతం
వెబ్‌సైటుhttp://www.pvrraja.com

వ్యక్తిగత జీవితం

మార్చు

పి.వి.ఆర్. రాజా తండ్రి పెనుమత్స చంద్ర శేఖర్ రాజు, తల్లి పెనుమత్స సత్యవతి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము విజయనగరం జిల్లాలో 1985 జూన్ 1 లో జన్మించాడు. తండ్రి చంద్ర శేఖర్ రాజు పోలీస్ హెడ్ కానిస్టేబుల్ గా పని చేసాడు. రాజా అక్క ధనలక్ష్మి, చెల్లి శ్రీదేవి, తమ్ముడు మణికంఠ రాజు. మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో భరతనాట్యం, షాలోమ్స్ మ్యూజిక్ స్కూల్లో గిటారు నేర్చుకున్నాడు. 2005 లో డిగ్రీ పూర్తి చేసి, సినిమా అవకాశాల కోసం హైదరాబాదు చేరుకున్నాడు. హైదరాబాదులో హిందూ పబ్లిక్ స్కూల్, శ్రద్ధ సెంటర్ ఫర్ స్పెషల్ ఎడ్యుకేషన్, షాలోమ్ మ్యూజిక్ స్కూల్, సింఫనీ అకాడమీ ఆఫ్ మ్యూజిక్ మరియు సెయింట్ ఆల్ఫోన్సాస్ స్కూల్స్ లో రాజా సంగీత ఉపాధ్యాయుడిగా పనిచేసాడు.[7][8][9][10][11][12]

సినిమా జీవితం

మార్చు

పీ.వీ.ఆర్. రాజా హైదరాబాద్ వచ్చి సినిమాల్లో అనేక విభాగాలలో సహాయకుడిగా, సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ దగ్గర ఉంటూనే 2011 వరకు పాఠశాలల్లో సంగీత ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. ఎం.ఆర్. ప్రొడక్షన్స్ ఒక్క క్షణం లఘుచిత్రం రాజాకీ సంగీత దర్శకుడిగా వందవ చిత్రం. ఈటీవీ ఢీ విజేత మరియు కొరియోగ్రాఫర్ యశ్వంత్ మాస్టర్ చేసిన మొదటి వీడియో ఆల్బమ్ దిల్ అంత అదిరే కి రాజా సంగీత దర్శకత్వం చేసాడు. మది తెలుగు చలన చిత్రంతో వెండితెరకు సంగీత దర్శకుడిగా అరంగేట్రం చేసాడు.[11][13]

లఘు చిత్ర ప్రయాణం

మార్చు

దర్శకుడు పూరీ జగన్నాథ్ సొంత నిర్మాణ సంస్థ వైష్ణో అకాడమి నిర్మించిన ఆర్య 3 లఘు చిత్రంతో పీ వీ ఆర్ రాజా సంగీత దర్శకుడిగా అరంగేట్రం చేసాడు. నటుడు, రచయిత ఎల్. బి. శ్రీరామ్ స్వీయ నిర్మాణంలో చిత్రించిన పదికి పైగా లఘు చిత్రాలకు పైగా పివిఆర్ రాజా సంగీతం అందించాడు. నటి రోజా సెల్వమణి నిర్మించిన వన్ అవర్ షార్ట్ ఫిలింకి బాక్గ్రౌండ్ స్కోర్ అందించాడు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ఆత్మ రామ ఆనంద రమణ లఘు చిత్రానికి రాజా సంగీతం సమకూర్చాడు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్వయంగా నిర్వహించిన స్పార్క్ ఓటిటి కాంటెస్ట్ లో రాజా సంగీతం చేసిన మూడు చిత్రాలు టాప్ 5 లో అవార్డులు సొంతం చేసుకున్నాయి. 2017 లో తాను చేసిన లఘు చిత్రాలకి వరుసగా 7 సార్లు ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డులు సొంతం చేసుకున్నాడు. [14][15][16][17][12]

సాదించిన అవార్డులు

మార్చు

సంగీత పోటీలలో

మార్చు
  • - 2005 విజయనగరం జిల్లా స్థాయి యువజనోత్సవ పోటీలలో తృతీయ స్థానం.
  • - 2007 చెన్నైలో ఎ. ఆర్. రెహమాన్ నిర్వహించిన హూ.. లలల్లా .. మ్యూజిక్‌ బ్యాండ్‌ హంట్‌లో పాల్గొని షాలోమ్స్ బ్యాండ్  తరుపున టాప్‌ 18 లో నిలిచాడు.
  • - 2011 ప్రకాశం జిల్లా యువజనోత్సవ పోటీలలో ప్రథమ స్థానం సాధించాడు.
  • - 2011 హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి యువజనోత్సవ పోటీలలో సొంతంగా రాసి కంపోజ్‌ చేసుకున్న పాటకు లైట్‌ మ్యూజిక్‌ విభాగంలో రాష్ట్ర స్థాయి అవార్డు.
  • - 2011 ప్రతి ఏటా భారత ప్రభుత్వం నిర్వహించే జాతీయ స్థాయి యువజనోత్స పోటీలలో ఉమ్మడి సమైక్య ఆంధ్ర ప్రదేశ్‌ తరుపున ప్రథమ స్థానంలో నిలిచి, గిటారు విభాగంలో ఉదయపూర్‌ రాజస్థాన్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటిలకి ఎంపిక అయ్యాడు.
  • - 2013 హైదరాబాద్‌ టైమ్స్‌ ఫ్రెష్‌ పేస్‌ 2013 కంపిటిషన్స్‌లో ఫైనల్స్‌కి ఎంపిక అయ్యాడు.
  • - 2016 తెలుగు షార్ట్‌ ఫిలిమ్స్‌లో నిరంతర సంగీత సేవలకు గాను షార్ట్‌ ఫిలిం డైమండ్‌ అవార్డు (నవరత్నాలు)తో సత్కరించారు

షార్ట్‌ ఫిలిమ్స్‌లో

మార్చు
  • - 2016 లోటస్‌ ఫిలిమ్ అవార్డ్స్‌ ఉత్తమ సంగీత దర్శకుడు (ఇట్లు మీ లైలా)
  • - 2017 ఉదయ్ కిరణ్ సినీ అవార్డ్స్ ఉత్తమ సంగీత దర్శకుడు (ఊపిరిలో ఊపిరిగా)
  • - 2017 లోటస్ ఫిలిం అవార్డ్స్ ఉత్తమ సంగీత దర్శకుడు (ఆకాశమంత ప్రేమ)
  • - 2017 స్టార్ హంట్ ఉత్తమ సంగీత దర్శకుడు (ఇట్లు మీ లైలా)
  • - 2017 గాయత్రి సినీ అవార్డ్స్ ఉత్తమ సంగీత దర్శకుడు (హ్యాపీ ఎండింగ్)
  • - 2017 దృశ్య షార్ట్ స్టోరీస్ బిగ్ ఐడియాస్ ఉత్తమ సంగీత దర్శకుడు (లాస్ట్ కాల్)
  • - 2017 సఖి ఈవెంట్స్ వరుణ్ బజాజ్ అవార్డ్స్ ఉత్తమ సంగీత దర్శకుడు (ఊపిరిలో ఊపిరిగా)
  • - 2017 తానా ఇంటర్నేషనల్‌ తెలుగు షార్ట్‌ ఫిలిమ్ ఫెస్టివల్‌ ఉత్తమ సంగీత దర్శకుడు (ఇట్లు మీ లైలా)
  • - 2018 లోటస్‌ ఫిలిమ్ అవార్డ్స్‌ ఉత్తమ సంగీత దర్శకుడు (ఒక్క క్షణం)
  • - 2018 ఉదయ్ కిరణ్ సినీ అవార్డ్స్ ఉత్తమ సంగీత దర్శకుడు (ఒక్క క్షణం)
  • - 2018 స్టూడియో వన్ షార్ట్ ఫిలిం అవార్డ్స్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ నామినీ (ఒక్క క్షణం)
  • - 2020 సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు సైమా షార్ట్‌ ఫిలిమ్ అవార్డ్స్‌ బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ నామినీ (అంతరార్ధం)[12]

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్

మార్చు

అత్యధిక సంఖ్యలో తెలుగు లఘు చిత్రాలకి సంగీత స్వరకర్తగా పనిచేసినందుకు 2023 సంవత్సరంలో పివిఆర్ రాజా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించాడు.[2][18]

జాబితా

మార్చు
  1. విటమిన్ షి (2020)
  2. బ్లాక్ (2021)
  3. మది (2022)

డిస్కోగ్రఫీ

మార్చు

చలన చిత్రాలు

మార్చు
సంవత్సరం చిత్రం భాష ప్రస్తావనలు
2017 జంధ్యాల రాసిన ప్రేమకథ తెలుగు [19]
2018 మిట్టి బ్యాక్ టు ద రూట్స్ హిందీ
2020 సంశయం తెలుగు [20]
2020 విటమిన్ షి తెలుగు
2022 మది తెలుగు
2022 బ్లాక్ తెలుగు
2023 మరో ప్రపంచం తెలుగు

ఆల్బమ్ పాటలు

మార్చు
సంవత్సరం ఆల్బమ్/పాట శీర్షిక రికార్డ్ లేబుల్ భాష గమనికలు
2019 మాయ Carpediem Technology Systems Private Limited తెలుగు [21]
2020 డియరూ డార్లింగో Media6 (India)Pvt.Ltd. తెలుగు [22]
2021 విటమిన్ షి Times Music తెలుగు [23]
2021 వెన్నెల వచ్చే పదమని PVR Melodies Studio తెలుగు [24]
2022 నీతో నడిచిన Mango Music తెలుగు [25]
2022 కాప్చర్ Times Music తెలుగు [26]
2022 మది Aditya Music తెలుగు [27]
2023 కాల భైరవ అష్టకం Sony Music India సంస్కృతం [28]
2023 దోస్తీ Aditya Music తెలుగు [29]
2023 జై శ్రీరామ్ Sony Music India సంస్కృతం [30]

లఘు చిత్రాలు

మార్చు
సంవత్సరం చిత్ర శీర్షిక ప్లాట్ఫారమ్ భాష ప్రస్తావనలు
2014 ఆర్య 3 Filmy Time తెలుగు
2016 ఇట్లు మీ లైలా RunwayReel తెలుగు
2016 వన్ అవర్ TeluguOne తెలుగు
2017 ఒక్క క్షణం Subash Chandra తెలుగు
2017 ఊపిరిలో ఊపిరిగా iQlikchannel తెలుగు
2019 అంతరార్థం Subash Chandra తెలుగు
2019 మా బుజ్జక్క గ్రేట్ L B Sriram తెలుగు
2019 స్వచ్ఛ భారతీయుడు L B Sriram తెలుగు
2020 ఆత్మ రామ ఆనంద రమణ ఆహా (స్ట్రీమింగ్ సేవ) తెలుగు
2020 నువ్వు నేను ఈ క్షణం iQlikchannel తెలుగు
2020 రూట్స్ - మన మూలాలు L B Sriram తెలుగు

స్వతంత్ర చిత్రాలు

మార్చు
సంవత్సరం చిత్ర శీర్షిక ప్లాట్ఫారమ్ భాష ప్రస్తావనలు
2015 హ్యాపీ ఎండింగ్ RunwayReel తెలుగు
2015 అద్విక TeluguOne తెలుగు
2016 ఆకాశమంత ప్రేమ RunwayReel తెలుగు
2017 నా సీత మహాలక్ష్మి TeluguOne తెలుగు
2018 పుష్ప విలాపం iQlikchannel తెలుగు
2019 మాయ MX Player తెలుగు
2021 హ్యాపీ మారీడ్ లైఫ్ 50mm Productions కన్నడ
2021 చాయ్ కహాని MX Player తెలుగు
2022 కాప్చర్ MX Player తెలుగు

వెబ్ సిరీసులు

మార్చు
సంవత్సరం చిత్ర శీర్షిక ప్లాట్ఫారమ్ భాష ప్రస్తావనలు
2017 గీతా సుబ్రమణ్యం Wirally తెలుగు
2017 మైఖేల్ మదన్ కామరాజు Wirally తెలుగు

మూలాలు

మార్చు
  1. "Happy birthday PVR Raja: From Vizianagaram to musical stardom, journey of the musician". timesofindia.indiatimes.com. Times Of India. Retrieved 1 June 2023.
  2. 2.0 2.1 "Trailblazing talent". newindianexpress.com. The New Indian Express. Retrieved 25 July 2023.
  3. "Adding life to director's vision through music". pynr.in. The Pioneer. Retrieved 20 February 2023.
  4. "PVR Raja: Meet the popular short film composer who's making a mark in Telugu cinema". ottplay.com. OTTplay. Retrieved 10 February 2023.
  5. "Hitting a high note: Telugu music composer PVR Raja to compose 100 songs in 15 Indian languages". newindianexpress.com. The New Indian Express. Retrieved 5 March 2023.
  6. "Black". filmyfocus.com. Filmy Focus. Retrieved 30 December 2023.
  7. "PVR Raja: షార్ట్ ఫిలిమ్స్ లో ఆస్కార్ అవార్డే లక్ష్యం". sakshi.com. Sakshi. Retrieved 6 July 2022.
  8. "Music Director PVR Raja : లఘుచిత్రాల ఇళయరాజా.. ఈ పీవీఆర్ రాజా". etvbharat.com. Etv Bharat. Retrieved 1 February 2022.
  9. "మ్యూజిక్ కోసం మేకప్ మన్ గా చేశా". v6velugu.com. V6 Velugu. Retrieved 8 December 2021.
  10. "'మరో ప్రపంచం'తో వస్తోన్న ఉత్తరాంధ్ర సంగీత దర్శకుడు పీవీఆర్ రాజా". telugu.samayam.com. Times Of India Samayam Telugu. Retrieved 11 February 2023.
  11. 11.0 11.1 "STRIKING THE RIGHT CHORDS". humansofhyderabad.co.in. Humans Of Hyderabad. Retrieved 21 October 2023.
  12. 12.0 12.1 12.2 "Introducing Music PVR Raja మ్యూజిక్ డైరెక్టర్ పివిఆర్ రాజా పరిచయం". zindhagi.com. Retrieved 25 December 2021.
  13. "#BehindTheCamera: Music director PVR Raja". timesofindia.indiatimes.com. Times Of India. Retrieved 28 December 2021.
  14. "Music director PVR Raja completes a decade in the industry". timesofindia.indiatimes.com. Times Of India. Retrieved 5 August 2022.
  15. "Music is way of life for this Hyderabad-based multi-talented musician". telanganatoday.com. Telangana Today. Retrieved 20 December 2021.
  16. "From introvert to International Book of Records". thehansindia.com. Hans India. Retrieved 22 January 2022.
  17. "'షార్ట్ ఫిలిమ్స్ మేస్ట్రో' పీవీఆర్ రాజా". navatelangana.com. Retrieved 14 August 2022.
  18. "Music composed by an individual for maximum short Telugu films". indiabookofrecords.in. India Book Of Records. Retrieved 19 August 2023.
  19. "Jandhyala Rasina Prema Katha". indiancine.ma. Retrieved 24 November 2017.
  20. "ప్రేమను కొత్త కోణంతో.. ఎన్నారైలంతా సంశయం". filmibeat.com. Filmibeat Telugu. 29 June 2019. Retrieved 29 June 2019.
  21. "Maaya". spotify.com. Spotify. Retrieved 12 June 2019.
  22. "Dearuu Darlinguuu..." spotify.com. Spotify. Retrieved 28 April 2020.
  23. "Vitamin She". spotify.com. Spotify. Retrieved 18 February 2021.
  24. "Vennela Vacche Padhamani Original Telugu Soundtrack". open.spotify.com. Spotify. Retrieved 1 June 2021.
  25. "Neetho Nadichina". spotify.com. Spotify. Retrieved 5 September 2022.
  26. "Capture". spotify.com. Spotify. Retrieved 9 September 2022.
  27. "Madhi". spotify.com. Spotify. Retrieved 18 November 2022.
  28. "Kaala Bhairava Ashtakam". spotify.com. 2023 Sony Music Entertainment India Pvt. Ltd. Retrieved 16 February 2023.
  29. "Dosthi". spotify.com. Spotify. Retrieved 21 July 2019.
  30. "Jai Shri Ram - Single". music.apple.com. Apple Music. Retrieved 13 October 2023.

బయటి లింకులు

మార్చు
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
 
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.