విటమిన్ డి

(విటమిన్ D నుండి దారిమార్పు చెందింది)

విటమిన్ D3 చర్మానికి సూర్యరశ్మి (ముఖ్యముగా అతినీలలోహిత కిరణాలు) సోకినపుడు తయారుచేయబడుతుంది. విటమిన్ డి లోపం వల్ల రికెట్స్ అనే వ్యాధి వస్తుంది.

కొలెకాల్సిఫెరాల్(D3)
కొలెకాల్సిఫెరాల్(D3)
ఎర్గోకాల్సిఫెరాల్(D2).

విటమిన్-డి అనేది ముఖ్యంగా మనకు సూర్యరశ్మిలో అనగా ఎక్కువగా ఎండ ఉండే సమయంలో దాదాపు మధ్యాహ్నం 12 గంటల నుండి మూడు లేదా నాలుగు గంటల వరకు ఎక్కువగా విటమిన్ డి అనేది మనకు లభిస్తుంది

గర్భిణీలు - విటమిన్ డి ఆవశ్యకత

మార్చు

తమకు పుట్టబోయే పిల్లలు కండలు పెంచాలనుకొనే తల్లులు గర్భవతులుగా ఉన్నప్పుడు విటమిన్ డి పుష్కలంగా తీసుకొంటే పుట్టబోయే పిల్లల కండరాలు శక్తిమంతంగా ఉంటాయట. వారి మజిల్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయని, నాలుగేళ్ల వయసు నుంచే వారి పట్టులో బిగువు ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ పరిశోధకులు తేల్చారు.ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా ఆరు పలకల దేహాలకు ప్రాచుర్యం ఎక్కువవుతున్న నేపథ్యంలో ఈ పరిశోధన ఆసక్తికరంగా మారింది. అబ్బాయిల సిక్స్‌ప్యాక్‌ను తీర్చిదిద్దే శక్తి తల్లులకే ఉందని ఈ పరిశోధన తేల్చింది. కేవలం కండలు పెంచడానికే కాదు, కాబోయే అమ్మలు విటమిన్ డి ఎక్కువగా తీసుకొంటే పిల్లల్లో శారీరక సత్తా పెరిగే అవకాశం ఉంటుందని పరిశోధకులు వివరించారు. చర్మానికి సూర్యకాంతి తగిలినప్పుడు శరీరంలో విటమిన్ డి జనిస్తుంది. చేపలను తినడం ద్వారా కూడా గర్భిణీలు విటమిన్ డి ని వృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఎంత అవసరమో అంత తీసుకుంటే పర్వాలేదు. కానీ, కొంతమంది విటమిన్ టాబ్లెట్స్ ఎక్కువ వాడి ప్రాణాల మీదకి Hypervitaminosis D తెచ్చుకుంటున్నారు. ఎంతో ఉపయోగకరమైన.. విటమిన్ D అవసరం మేరకే తీసుకోవాలి. Vitamin D ఎక్కువ తీసుకోవటం వాళ్ళ ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే అని BMJ Case Reports లో ప్రచురితమైన తాజా కథనం హెచ్చరిస్తోంది. విటమిన్ D వారానికి ఒకటి మాత్రమే తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.[1][2]

అవలోకనం

మార్చు

విటమిన్ డి మన శరీరానికి చాలా ముఖ్యం. సూర్యకాంతి నుండి మనుషుల శరీరానికి తగినంత మొత్తంలో విటమిన్ డి లభించినప్పటికీ కొన్నిసార్లు తగిన మొత్తంలో  విటమిన్స్ డి శరీరానికి  అందక పోవచ్చు. మన శరీరంలో కాల్షియం గ్రహించడంలో సహాయపడి, ఎముకలు, కండరాలు, నరాలను ఆరోగ్యంగా ఉంచడానికి విటమిన్ డి అవసరం. విటమిన్ డి  మన కండరాలు, నరాలు, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుంది.

విటమిన్ డి లోపం ప్రధానంగా  ఎముకలు,కండరాలతో సమస్యలను కలిగిస్తుంది. మానవ  శరీరంలో  ఎముక అభివృద్ధి, నిర్వహణ కోసం ఉపయోగించే ఒక ముఖ్యమైన విటమిన్. విటమిన్ డి  నాడీ వ్యవస్థ, కండరాల వ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థలో సహాయ పడుతుంది. విటమిన్ డి ముఖ్యమైనది గా వైద్యులు పేర్కొంటారు. శరీరం ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన అనేక విటమిన్లలో విటమిన్ డి ఒకటి. మనిషి లో రక్తం, ఎముకలలో కాల్షియం సమతుల్యతను నిర్వహించడం, ఎముకల నిర్మాణంలో, నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మానవ శరీరం లో ఎముకల నిర్మాణానానికి, ఆరోగ్యకరమైన కణజాలాలకు మద్దతు ఇవ్వడానికి కాల్షియం, భాస్వరం ఉపయోగించగలదు. దీర్ఘకాలిక / లేదా తీవ్రమైన విటమిన్ డి లోపంతో, ప్రేగుల ద్వారా కాల్షియం, భాస్వరం శోషణ తగ్గడం హైపోకాల్సెమియా ( రక్తంలో తక్కువ కాల్షియం స్థాయిలు) కు దారితీస్తుంది. ఫలితంగా  సెకండరీ హైపర్పారాథైరాయిడిజానికి దారితీస్తుంది (రక్తంలో కాల్షియం స్థాయిలను సాధారణంగా ఉంచడానికి ప్రయత్నించే అతి చురుకైన పారాథైరాయిడ్ గ్రంథులు). హైపోకాల్సెమియా, హైపర్పారాథైరాయిడిజం రెండూ తీవ్రంగా ఉంటే, కండరాల బలహీనత, తిమ్మిరి, అలసట, నిరాశతో సహా లక్షణాలను  మనిషులు  కలిగిఉంటారు .

రక్తంలో కాల్షియం స్థాయిలను సమతుల్యం చేయడానికి  (ద్వితీయ హైపర్పారాథైరాయిడిజం ద్వారా), శరీరం లో  ఎముకల నుండి కాల్షియం తీసుకుంటుంది, తద్వారా  వేగవంతమైన ఎముక డీమినరలైజేషన్కు (ఎముక సంస్కరించగలిగే దానికంటే వేగంగా విచ్ఛిన్నమైనప్పుడు) దారితీస్తుంది. పెద్దవారిలో ఆస్టియోమలాసియా (మృదువైన ఎముకలు), పిల్లలలో రికెట్స్కు దారితీస్తుంది. ఆస్టియోమలాసియా, ఎముకల వ్యాధి  ఎముక పగుళ్లు వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. రికెట్స్ ఆస్టియోమలాసియా మాదిరిగానే ఉంటుంది, ఇది పిల్లలను మాత్రమే ప్రభావితం చేస్తుంది. పిల్లల ఎముకలు ఇంకా పెరుగుతున్నందున, డీమినరలైజేషన్ ఎముకలు వంగిపోవడం లేదా వంగిపోవడానికి కారణమవుతుంది.

విటమిన్ డి లోపం  ప్రపంచ సమస్య. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1 బిలియన్ మందికి విటమిన్ డి లోపం ఉంది, జనాభాలో 50% మందికి విటమిన్ డి లోపం ఉంది. ఆమెరికా దేశంలో సుమారు 35% పెద్దలకు విటమిన్ డి లోపం తో ఉన్నారని పేర్కొంటారు[3].

ప్రయోజనం-లభించే పదార్థాలు

మార్చు

మనుషుల రోజువారి ఆహారంలో తగినంత విటమిన్ డి ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆరోగ్యకరమైన కణాలను పెంచడానికి, అనారోగ్యాన్ని నివారించడానికి , రోగనిరోధక వ్యవస్థను పెంచటానికి, ఎముకలు బలంగా ఉండటానికి కాల్షియం శోషణలో సహాయపడుతుంది. ముఖ్యంగా పిల్లలలో ఎముకల వ్యాధిని నివారించడంలో తోడ్పడుతుంది. పెద్దలలో బోలు ఎముకల వ్యాధి నుండి రక్షిస్తుంది. మన శరీరంలో ఉండే మొత్తం విటమిన్ డిలో కేవలం 10% ఆహారం ద్వారా మాత్రమే అందుతుంది. విటమిన్ డి లభించే పదార్థాలలో పుట్టగొడుగులు, సముద్రంలో లభించే పదార్థాలలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. చేపల రకాన్ని బట్టి విటమిన్ డి కంటెంట్ మారుతుంది. అందులో ట్యూనా చేప, మాకేరెల్, రొయ్యలు,సార్డినెస్, అంకోవిస్, వీటన్నింటిలో ఒమేగా -3 ఎక్కువగా ఉంటాయి. కాడ్ లివర్ ఆయిల్ ఒక సప్లిమెంట్. విటమిన్ డి లోపానికి చికిత్స చేయడానికి చాలా సంవత్సరాలుగా ఉపయోగించబడుతోంది. రికెట్స్, సోరియాసిస్ , క్షయవ్యాధి చికిత్సలో దీనిని ఉపయోగిస్తున్నారు. ఈ నూనెలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. గుడ్డు సొనలు (పచ్చసొన విటమిన్ డితో కూడి ప్రధాన భాగం.) ఒక గుడ్డులో దాదాపు 200 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. అయితే రోజూ తినకూడదు. సోయా పాలు సాధారణ ఆవు పాలతో సమానమైన ప్రోటీన్‌ను కలిగి ఉంటుంది. ఇందులో అధిక విటమిన్ డి, విటమిన్ సి, ఐరన్ ఉన్నాయి[4].

వైద్యుల సలహా, సూచనల మేరకు విటమిన్ డి ని ప్రజలు తగిన మోతాదులో తీసుకంటే, విటమిన్ డి లోపం వల్ల వచ్చే బాధలను కొంత మేరకు నివారణ చేయవచ్చును.

మూలాలు

మార్చు
  1. http://telugutaruni.weebly.com/23/post/2014/01/17.html
  2. Raghavendra (2022-07-13). "అతిగా విటమిన్ D తీసుకుంటే ఏమవుతుంది?". AP GAP (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-07-13.[permanent dead link]
  3. "7 Nutritious Foods That Are High in Vitamin D". https://www.healthline.com/. Retrieved 23 July 2024. {{cite web}}: External link in |website= (help)
  4. "7 Healthy Foods That Are High in Vitamin D". Healthline (in ఇంగ్లీష్). 2019-12-19. Retrieved 2024-07-23.