విద్యానగర వీరులు
విజయనగర సామ్రాజ్యానికి రాజధానియైన విద్యానగరానికి చెందిన ఆనాటి వీరుల గురించి ఈ గ్రంథంలో వివరించారు. ఈ పుస్తకాన్ని శిరపు ఆంజనేయులు రచించారు.[1]
విజయనగర వీరులు | |
కృతికర్త: | శిరపు ఆంజనేయులు |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | చరిత్ర |
ప్రచురణ: | |
విడుదల: | 1928 |
రచన నేపథ్యం
మార్చుశిరపు ఆంజనేయులు రచించిన విద్యానగర వీరులు గ్రంథం 1928లో ముద్రితమైంది.[1]
వివరాలు
మార్చు13-16 శతాబ్దాల నడుమ నేటి ఆంధ్ర, కర్ణాటక, కొంతవరకూ తమిళనాడులోని ప్రాంతాలను పరిపాలించిన హైందవ సామ్రాజ్యం-విజయనగర సామ్రాజ్యం. ఆ విజయనగర సామ్రాజ్యానికి రాజధాని నేటి కర్ణాటకలోని హంపీ పట్టణం వద్ద నెలకొని వుండేది. అది నేటి లండన్ మహానగరాన్ని కూడా వైశాల్యంలో మించి, వ్యాపార వాణిజ్య వ్యవహారల్లో ప్రపంచంలోని ఎన్నో గొప్ప నగరాలను తలదన్నేలా ఉండేదని పోర్చుగీసు యాత్రికులు వెల్లడించారు. ఆ మహానగరం పేరు విద్యానగరమనీ, విజయనగరమనీ వ్యవహారంలో ఉన్నా విజయనగర సామ్రాజ్య స్థాపన వెనుకనున్న మహనీయుడు, శృంగేరీ పీఠాధిపతి విద్యారణ్య స్వామి పేరుమీదుగా విద్యానగరం అనే పెట్టారు.
విషయాలు
మార్చువిద్యానగరానికి చెందిన విజయనగర సామ్రాజ్య వీరుల గురించి ఈ గ్రంథాల్లో రాశారు. మొత్తం రెండు సంపుటాలుగా వెలువడ్ద ఈ రచనల్లో దాదాపుగా 20మంది మహావీరుల జీవన చిత్రాలు ఉన్నాయి. కొందరు అందరికీ సుపరిచితులైన తిమ్మరుసు, కృష్ణరాయలు వంటి వారు కాగా మరికొందరు అంతగా పరిచయం లేని వారు కావడం విశేషం.[1]