అనాటమీ: మొక్కలు, జంతువులు లేదా మానవ అంతర్నిర్మాణ శాస్త్రం.
ఎకాలజీ: మొక్కలు, జంతువులకు వాటి పరిసరాలతో ఉండే సంబంధాల గురించి వివరించే అధ్యయన శాస్త్రం.
ఆర్థిక వృక్షశాస్త్రం (ఎకనమిక్ బోటనీ): మానవులకు ఆర్థికంగా ఉపయోగపడే మొక్కల అధ్యయనాన్ని ఎకనమిక్ బోటనీ అంటారు. ధాన్యాలు, పప్పులు, నూనెగింజల పంటలు, ఫలాలు, కూరగాయల వంటి వాటి అధ్యయన శాస్త్రం.
ఎంబ్రియాలజీ: పిండాభివృద్ధి శాస్త్రం
జెనిటిక్స్: జన్యువుల లక్షణాల అధ్యయన శాస్త్రం.
పేలినాలజీ: పుష్పించే మొక్కల పరాగ రేణువుల అధ్యయనం.
పేలియోబోటనీ: వృక్షశిలాజాల అధ్యయన శాస్త్రం.
టాక్సానమీ: మొక్కలు, జంతువుల గుర్తింపు, వాటి వర్గీకరణ వంటి వాటి అధ్యయన శాస్త్రం.
మైకాలజీ: వివిధ రకాల ఫంగస్‌ల అధ్యయన శాస్త్రం.
పాథాలజీ: మొక్కలు, జంతువుల వ్యాధుల అధ్యయన శాస్త్రం.
ఫైకాలజీ: ఆల్గేల అధ్యయనం. దీన్నే ఆల్గాలజీ అంటారు.
బ్రయాలజీ: బ్రయోఫైట్స్ అనే మొక్కల అధ్యయనం (ఉదా: లివర్‌వార్ట్స్, మాస్).
టెరిడాలజీ: ఫెర్న్స్ వంటి టెరిడోఫైట్ మొక్కల అధ్యయన శాస్త్రం.
జువాలజీ: ఏకకణ జీవి అమీబా నుంచి మానవుని వరకు అన్ని జంతువుల అధ్యయన శాస్త్రం.
హిస్టాలజీ: కణజాలాల శాస్త్రం.
ఎండోక్రైనాలజీ: అంతస్స్రావక వ్యవస్థ అధ్యయనం (జంతువుల్లో విడుదలయ్యే హార్మోన్ల అధ్యయనం).
ఎంటమాలజీ: కీటకాల అధ్యయన శాస్త్రం.
పేలియోజువాలజీ: జంతు శిలాజాల అధ్యయన శాస్త్రం.
ఆర్నిథాలజీ: పక్షుల అధ్యయన శాస్త్రం.
హెల్మింథాలజీ: పరాన్నజీవ పురుగుల అధ్యయన శాస్త్రం.
లెపిడోటెరాలజీ: సీతాకోకచిలుకలు, మాత్‌ల అధ్యయన శాస్త్రం.
లిమ్నాలజీ: సరస్సుల్లో నివసించే జంతువుల అధ్యయన శాస్త్రం.
మయాలజీ: కండరాల అధ్యయన శాస్త్రం.
ఓఫియాలజీ: పాముల అధ్యయన శాస్త్రం.
మైక్రోబయాలజీ: సూక్ష్మజీవుల అధ్యయన శాస్త్రం.
బాక్టీరియాలజీ: బాక్టీరియా అనే సూక్ష్మజీవుల అధ్యయన శాస్త్రం.
వైరాలజీ: వైరస్‌ల అధ్యయన శాస్త్రం.
ఆగ్రోస్టాలజీ: గడ్డి అధ్యయన శాస్త్రం.
హైడ్రాలజీ: భూగర్భ జలాల అధ్యయన శాస్త్రం.
హైడ్రోపోనిక్స్: (నేల సహాయం లేకుండా) మొక్కలను నీటిలోనే పెంచటాన్ని అధ్యయనం చేసే శాస్త్రం.