విద్యా హక్కు చట్టం - 2009

ఉచిత విద్యా నిర్బంధ హక్కు చట్టం -2009 (RTE-2009) అనేది 4 ఆగస్టు 2009న రూపొందించబడిన భారత పార్లమెంటు చట్టం, ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A లో ఉంది. భారతదేశంలోని 6 నుండి 14 సంవత్సరాలు గల పిల్లకు ఉచిత నిర్బంధ విద్యను అందించడమే ఈ చట్టం ఉద్దేశ్యం. ఈ చట్టం 1 ఏప్రిల్ 2010న అమల్లోకి వచ్చినప్పటి నుండి విద్యను ప్రతి విద్యార్థికి ప్రాథమిక హక్కుగా అందించే 135 దేశాలలో భారతదేశం ఒకటిగా మారింది.[1]

విద్యా హక్కు చట్టం, 2009
ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించే చట్టం.
CitationAct No. 35 of 2009
Enacted byభారత పార్లమెంటు
Date assented to26 ఆగస్టు 2009
అమలు లోకి వచ్చిన తేదీ1 ఏప్రిల్ 2010
Related legislation
భారత రాజ్యాంగం 86వ సవరణ (2002)
స్థితి: తెలియదు

అధికారం

మార్చు

భారత రాజ్యాంగంలో విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉంది. కేంద్రం, రాష్ట్రాలు రెండూ ఈ చట్టంలో సవరణలు చేయవచ్చు. చట్టం అమలు కోసం కేంద్రం, రాష్ట్ర, స్థానిక సంస్థలకు నిర్దిష్ట బాధ్యతలను నిర్దేశిస్తుంది.

ఆమోదం

మార్చు

ఈ బిల్లును 2 జూలై 2009న మంత్రివర్గం ఆమోదించింది. రాజ్యసభ 20 జూలై 2009న బిల్లును ఆమోదించింది. లోక్‌సభ 4 ఆగస్టు 2009న ఆమోదించింది. 26 ఆగస్ట్ 2009న రాష్ట్రపతి ఆమోదం పొంది, చట్టంగా నోటిఫై చేయబడింది.[2]

ప్రస్తుతం భారతదేశంలోని రాష్ట్రాలు విద్యలో ఈ చట్టాన్ని అమలు చేస్తున్నాయి.

మూలాలు

మార్చు
  1. "Provisions of the Constitution of India having a bearing on Education". Department of Higher Education. Archived from the original on 1 February 2010. Retrieved 1 April 2010.
  2. "Right to Education". LawJi.in : one-stop destination for all law students. Archived from the original on 2018-09-27. Retrieved 2018-09-26.