విధి 1968లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. 1967లో విడుదలైన తక్‌దీర్ అనే హిందీ సినిమా దీనికి మూలం.

విధి
(1968 తెలుగు సినిమా)

సినిమాపోస్టర్
దర్శకత్వం ఎ.సలామ్
నిర్మాణం తారాచంద్ బర్జాత్యా
తారాగణం భరత్ భూషణ్,
శాలిని,
కమల్ కపూర్,
ఫరీదా జలాల్,
జలాల్ ఆగా
సంగీతం లక్ష్మీకాంత్-ప్యారేలాల్
నేపథ్య గానం పి.బి.శ్రీనివాస్,
ఎస్.జానకి,
కె. జె. ఏసుదాసు,
పి.సుశీల,
పిఠాపురం నాగేశ్వరరావు
గీతరచన శ్రీశ్రీ
నిర్మాణ సంస్థ రాజశ్రీ పిక్చర్స్
భాష తెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు

పాటలు

మార్చు
పాటల వివరాలు[1]
క్ర.సం. పాట సంగీతం రచన గాయినీగాయకులు
1 సమయం ప్రశాంత రాత్రి నీ పూలపాటలాగే మధురం ఈ రేయి లక్ష్మీకాంత్-ప్యారేలాల్ శ్రీశ్రీ పి.బి.శ్రీనివాస్,
ఎస్.జానకి,
కె. జె. ఏసుదాసు
2 ఆ సముద్రం మాటున గుఱ్ఱాలున్న బజారున ఏదైనా కొని రాలేరా? లక్ష్మీకాంత్-ప్యారేలాల్ శ్రీశ్రీ పి.సుశీల
బృందం
3 శిలయైననూ ఫలమైననూ దేవుని సంతకమే కలయైననూ నిజమైననూ నరజాతి జాతకమే లక్ష్మీకాంత్-ప్యారేలాల్ శ్రీశ్రీ పి.బి.శ్రీనివాస్
4 ఆడెనే వసంతలోకం పాడెనే ఆశతీర పంచుకుందాం పంటలే లక్ష్మీకాంత్-ప్యారేలాల్ శ్రీశ్రీ ఎస్.జానకి
బృందం
5 రండీ జడవద్దూ ఓ కలవాళ్ళూ పేదోళ్ళూ ఇక పెళ్ళంటే జడవద్దు లక్ష్మీకాంత్-ప్యారేలాల్ శ్రీశ్రీ పిఠాపురం నాగేశ్వరరావు
6 మతిపోయె నీకై చెలీ ఓ చెలీ తపించెనె యెంచి నిన్నే ఓ చెలీ లక్ష్మీకాంత్-ప్యారేలాల్ శ్రీశ్రీ పి.బి.శ్రీనివాస్

గోపాల్ సంగీత విద్వాంసుడు. అనుకూలవతియైన భార్య, రత్నాల్లాంటి ముగ్గురు పిల్లలతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఐతే ఋణ బాధ ఎక్కువై ఋణవిముక్తి కోసం ఓడలో ఉద్యోగానికి చేరుతాడు. తాను అనుకొన్నదొకటి అయినది ఇంకొకటి. మొదటి ప్రయాణంలోనే భీకరమైన తుఫానులో చిక్కుకుని ఓడ మునిగి పోతుంది. గోపాల్ శవం కనిపించలేదనే వార్త యింటికి వస్తుంది. దారిద్ర్యంలో ఉన్న ఆ కుటుంబం తిండితిప్పలు లేక అనేక బాధలు పడుతుంది. పిల్లలుపడే నరకయాతనను చూస్తూ తల్లి హృదయం పరితపిస్తుంది. మృత్యువాత నుండి పిల్లల్ని రక్షించడానికి తల్లి నిస్సహాయ స్థితిలో ఒక ధనవంతుడైన గని యజమానిని పెళ్ళి చేసుకుంటుంది. గోపాల్ పగిలిన ఓడ నుండి ఆఫ్రికా తీరం చేరుకుంటాడు. మతి భ్రమించిన గోపాల్‌కు తాను సృష్టించిన భావగర్భితమైన, మధురమైన సంగీతం వినిపిస్తుంది. పాత స్మృతులు గుర్తుకువచ్చి స్వదేశానికి తిరిగి వస్తాడు. తన గ్రామం మారిపోయింది. తెలిసిన వారు గోపాల్‌ను గుర్తించలేక పోతారు. భార్య యితరుల ఆధీనంలో ఉంది. పిల్లలు పెద్దవారయ్యారు.ప్రశాంతంగా ఉన్న వారి జీవితాలను భగ్నం చేయడం ఉచితం కాదని అతని ఆత్మ ఘోషిస్తుంది. దానితో అతడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు. కానీ విధి మళ్ళీ అతడిని అజ్ఞాతం నుండి బయటకు లాగుతుంది. ఈ కల్లోలంలో ఎవరు ఆహుతయ్యారు అనేది చిత్రం తరువాయి భాగం.[1]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 శ్రీశ్రీ (1968). Vidhi (1968)-Song_Booklet (1 ed.). బాంబే: రాజశ్రీ పిక్చర్స్. p. 8. Retrieved 25 July 2022.