వినవయ్యా రామయ్యా

వినవయ్యా రామయ్యా 2015లో విడుదలైన తెలుగు సినిమా.[1]సరస్వతి ఫిలిమ్స్ బ్యానర్ పై సింధుర పువ్వు కృష్ణారెడ్డి నిర్మించిన ఈ సినిమాకు జి.రాంప్రసాద్ దర్శకత్వం వహించాడు.[2] నాగ అన్వేష్, కృతిక, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, ఆలీ, నరేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జూన్ 19, 2015న విడుదలైంది.

వినవయ్యా రామయ్యా
దర్శకత్వంజి.రాంప్రసాద్
రచనజి.రాంప్రసాద్
నిర్మాతసింధుర పువ్వు కృష్ణారెడ్డి
నటవర్గం
ఛాయాగ్రహణంరసూల్ ఎల్లోర్
కూర్పుప్రవీణ్ పూడి
సంగీతంఅనూప్
నిర్మాణ
సంస్థ
సరస్వతి ఫిలిమ్స్
విడుదల తేదీలు
2015 జూన్ 19 (2015-06-19)
నిడివి
120 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

కథసవరించు

వీరయ్య పాలెం అనేగ్రామంలో చంటి (నాగ అన్వేష్) తన ఎదురింట్లో ఉండే జానకి (కృతిక) అంటే ఎంతో ఇష్టం. జానకి తండ్రి చౌదరి (ప్రకాష్ రాజ్) ఆ ఊరికే పెద్దమనిషి. చౌదరి, జానకికి ఓ పెద్ద జమీందారునిచ్చి పెళ్ళి చెయ్యాలని ఓ సంబంధం కుదురుస్తాడు. ఈ విషయం తెలుసుకున్న చంటి, జానకికి తన ప్రేమ విషయాన్ని చెప్పగా, తనకలాంటి ఆలోచనలు లేవని తేల్చి చెప్పేస్తుంది. చంటి ప్రేమను దక్కించుకునేందుకు ఏమి చేశాడు? వీరిద్దరి ప్రేమ చివరకు ఏమైంది? అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులుసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

  • బ్యానర్: సరస్వతి ఫిలిమ్స్
  • నిర్మాత: సింధుర పువ్వు కృష్ణారెడ్డి [4]
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జి.రాంప్రసాద్
  • సంగీతం: అనూప్
  • సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్
  • ఎడిటర్: ప్రవీణ్ పూడి

మూలాలుసవరించు

  1. Sakshi (5 November 2014). "అందమైన ప్రేమ". Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.
  2. Sakshi (24 May 2015). "అప్పుడు బాలనటుడు..! ఇప్పుడు హీరో!". Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.
  3. Eenadu (17 September 2021). "వీళ్లని గుర్తుపట్టారా..?". Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.
  4. Sakshi (22 June 2015). "'మా సినిమాపై దుష్ప్రచారం తగదు'". Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.