ప్రవీణ్ పూడి
ప్రవీణ్ పూడి ఒక సినీ ఎడిటర్.[1] ఎడిటర్ గా అతని మొదటి సినిమా ఆకాశ రామన్న. 2011లో వచ్చిన పిల్ల జమీందార్ అతనికి మంచి బ్రేక్ నిచ్చింది. తర్వాత జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, మనం, సోగ్గాడే చిన్నినాయనా లాంటి అనేక హిట్ సినిమాలకు ఎడిటర్ గా పనిచేశాడు. ఒక తమిళ సినిమాకు కూడా పనిచేశాడు.
ప్రవీణ్ పూడి | |
---|---|
జననం | |
వృత్తి | ఎడిటర్ |
జీవిత భాగస్వామి | ప్రశాంతి |
పిల్లలు | జాగృతి, విన్మయి |
తల్లిదండ్రులు |
|
వ్యక్తిగత వివరాలు
మార్చుప్రవీణ్ సూర్యాపేట జిల్లా, హుజూర్ నగర్ లో పుట్టాడు. అతని తండ్రి ఏలూరు నుంచి వచ్చి అక్కడ స్థిరపడ్డాడు. ఆయనకు అక్కడ ఆటో మొబైల్ వర్క్ షాపు ఉండేది. తర్వాత కొద్ది రోజులకు వారి కుటుంబం హైదరాబాదుకు మారింది. హైదరాబాదులో అతని తండ్రి ఒక ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ వాహనాలు కొని కొన్ని సినీ సంస్థలకు లీజుకిచ్చేవాడు. కానీ ఆ వ్యాపారం కలిసి రాలేదు. అతని కుటుంబం ఆర్థిక సమస్యల్లో ఇరుక్కుంది. అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్న ప్రవీణ్ చదువు మధ్యలోనే ఆపేసి 1997 లో ప్రసాద్ ల్యాబ్ లో ఎడిటింగ్ విభాగంలో సహాయకుడిగా చేరాడు.
ఇతని తమ్ముడు ప్రదీప్ కూడా సినిమా రంగంలోనే ఉన్నాడు. వర్క్ ఫ్లో అనే పేరుతో సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ ను అందించే సంస్థను ప్రారంభించాడు. మనం, గోపాలా గోపాలా, జనతా గ్యారేజ్ లాంటి సినిమాలకు టైటిల్ ఎఫెక్ట్స్ అందించాడు.
కెరీర్
మార్చుఎడిటర్ కోటగిరి వెంకటేశ్వర రావు దగ్గర అప్రెంటీస్ గా రాజకుమారుడు, సమరసింహా రెడ్డి లాంటి సినిమాలకు పనిచేశాడు. తరువాత మార్తాండ్ కె. వెంకటేష్ దగ్గర కొన్ని రోజులు పనిచేశాడు. డిజిటల్ ఎడిటింగ్ రంగంలో మంచి అభివృద్ధి సాధిస్తుండటంతో అందులో ప్రావీణ్యం సంపాదించి కొద్ది రోజులు ఓ సంస్థలో ఉద్యోగిగా చేరి సినిమాలు, సీరియళ్ళు, కార్పొరేట్ ఫిల్ములు, వాణిజ్య ప్రకటనలు, డాక్యుమెంటరీలను ఎడిట్ చేశాడు. పవన్ కల్యాణ్ జానీ సినిమా కోసం సహాయకులు కావాలను కోరడంతో ఆయన దగ్గర చేరి జానీ సినిమాకు అసిస్టెంట్ ఎడిటర్ గా, గుడుంబా శంకర్, బంగారం, బాలు, అన్నవరం సినిమాలకు అసోసియేట్ ఎడిటర్ గా పనిచేశాడు. తరువాత శ్రీకర్ ప్రసాద్ దగ్గర శిష్యరికం చేశాడు. ఆయనతో కలిసి జల్సా సినిమాకు పనిచేశాడు.
తర్వాత తానే సొంతంగా ఎడిటర్ గా పనిచేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. కొద్ది రోజులు ఎదురు చూసిన తర్వాత ఆకాశరామన్న సినిమాతో ఎడిటర్ గా అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమా విడుదల ఆలస్యమైంది. ఎడిటర్ గా ప్రయత్నాలు కొనసాగిస్తూనే శ్రీకర్ ప్రసాద్ తో కలిసి ఖలేజా, ఇష్క్ సినిమాలకు కూడా పనిచేశాడు. తర్వాత గాయం-2, కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్రాజు సినిమాలకు ఎడిటర్ గా పనిచేశాడు. 2011లో వచ్చిన పిల్ల జమీందార్ అతనికి మంచి పేరు తెచ్చింది. జులాయి సినిమాకి కూడా ఎడిటర్ గా మంచి పేరు వచ్చింది.
సినిమాలు
మార్చు- ఆకాశ రామన్న
- గాయం-2
- కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం, అప్పల్రాజు
- పిల్లజమీందార్ (2011)
- జులాయి
- సన్నాఫ్ సత్యమూర్తి
- కాళిచరణ్ (2013)
- బూచమ్మ బూచోడు[2] (2014)
- అత్తారింటికి దారేది
- మనం
- మజ్ను
- సోగ్గాడే చిన్నినాయనా
- వినవయ్యా రామయ్యా (2015)
- భమ్ బోలేనాథ్ (2015)[3]
- చిత్రాంగద (2017)[4]
- దేవదాస్ (2018)[5]
- కర్త కర్మ క్రియ (2018)
- వెంకీ మామ (2019)
- ఒరేయ్ బుజ్జిగా (2020)
- వకీల్ సాబ్ (2021)
- అశ్మీ (2021)
- నేను లేని నా ప్రేమకథ (2021)
- మను చరిత్ర (2021)
- కమిట్మెంట్ (2022)
- టాప్ గేర్ (2022)
- హంట్ (2023)
- రామబాణం (2023)
- ది స్టోరి ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ (2023)
- ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ (2023)
- సిద్ధార్థ్ రాయ్ (2024)
- మనమే (2024)
పురస్కారాలు
మార్చు- నంది పురస్కారం - 2013 నంది పురస్కారాలు: ఉత్తమ ఎడిటర్ (కాళిచరణ్)[6][7][8][9]
మూలాలు
మార్చు- ↑ "పవన్ సావాసమే కాలేజీ!". eenadu.net. ఈనాడు. Archived from the original on 10 నవంబరు 2016. Retrieved 10 నవంబరు 2016.
- ↑ తెలుగు గ్రేట్ ఆంధ్ర, రివ్యూ (5 September 2014). "సినిమా రివ్యూ: బూచమ్మ బూచోడు". www.telugu.greatandhra.com. Retrieved 7 August 2020.
- ↑ ఐడల్ బ్రెయిన్, వేడుకలు (13 February 2015). "రానా విడుదల చేసిన 'భమ్ బోలేనాథ్' జీరో బడ్జెట్ ప్రమోషనల్ సాంగ్ వీడియో!". www.idlebrain.com. Archived from the original on 18 మార్చి 2015. Retrieved 24 February 2020.
- ↑ 123తెలుగు, సమీక్ష (10 March 2017). "చిత్రాంగద – అంజలి మాత్రమే ఆకట్టుకుంది!". www.123telugu.com. Retrieved 12 March 2020.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ సాక్షి, సినిమా (27 September 2018). "'దేవదాస్' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 29 March 2020. Retrieved 2 April 2020.
- ↑ "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 25 June 2020.
- ↑ మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
- ↑ సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
- ↑ నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.