విభీషణుడు

రావణాసురుని తమ్ముడు

విభీషణుడు హిందూ పవిత్ర గ్రంథమైన రామాయణంలో ఒక ముఖ్య పాత్ర. రావణాసురునికి తమ్ముడు. విశ్రవసు కైకసియందు పుట్టిన మూడవ కుమారుడు. సీతను రావణాసురుడు అపహరించిన తర్వాత ఆమెను మళ్ళీ రామునికి అప్పగించమని అన్న రావణునికి పలు విధాల చెప్పిచూశాడు. రావణుడు అతని సలహాను పాటించకపోగా అవమానిస్తాడు. విభీషణుడు వెళ్ళి రాముని శరణు వేడుతాడు. రామ రావణ యుద్ధంలో రాముడికి రావణుడి ఆయువు పట్టు చెప్పి అన్న మరణానికి కారణం అయ్యాడు. రావణుడి తర్వాత లంకా సామ్రాజ్యానికి రాజు అయ్యాడు. ఈయన చిరంజీవి.[1]

రాముడ్ని శరణు వేడుతున్న విభీషణుడు

శ్రీరంగం మార్చు

శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయ పురాణంలో విభీషణుడి ప్రస్తావన ఉంది.ఈ పురాణం ప్రకారం శ్రీరాముని పట్టాభిషేక సమయంలో అక్కడికి వచ్చిన విభీషణుడికి విమాన విగ్రహం లభిస్తుంది. దాన్ని తీసుకుని తన లంకా సామ్రాజ్యంలో ప్రతిష్ఠించుకోవాలనుకుంటాడు. దారి మధ్యలో విశ్రాంతి కోసం ఆ విగ్రహాన్ని కావేరి నది గట్టున ఉంచి పూజలు నిర్వహిస్తాడు. కానీ దాన్ని లేపి తీసుకెళ్ళడానికి సాధ్యపడదు. అప్పుడు మహావిష్ణువు విభీషణుడికి కలలో కనబడి తాను ఆ ప్రదేశంలోనే కొలువై ఉంటానని చెప్పాడు. అప్పటి నుంచి ఆ ప్రదేశం శ్రీరంగంగా వ్యవహరించబడుతోంది.[2]

మూలాలు మార్చు

  1. "Demon king Ravana's brother Vibhishana is immortal – Here's why". zeenews.india.com. Zee News. Archived from the original on 1 నవంబరు 2016. Retrieved 18 October 2016.
  2. M., Rajagopalan (1993). 15 Vaishnava Temples of Tamil Nadu. Chennai, India: Govindaswamy Printers. pp. 66–75.