పులస్త్యుడు. ఇతనికి భార్యలు నలువురు. అందు మొదటిభార్య తృణబిందువు కూఁతురు అగు ఇలబిల. ఆపెయందు కుబేరుఁడు పుట్టెను. రెండవభార్య సుమాలి కూఁతురు అగు కైకసి. ఆమెయందు రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు జన్మించారు. మూడవ భార్య కైకసిచెల్లెలు అగు పుష్పోత్కట. దానియందు మహోదరమహాపార్శ్వాదులు జన్మించారు. నాల్గవభార్య కైకసి రెండవచెల్లెలు అగు రాక. ఆమె ఖర దూషణ త్రిశిరులను కన్నది.

మూలాలు మార్చు

  • పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879