విరాట పర్వము

(విరాట పర్వం నుండి దారిమార్పు చెందింది)

విరాట పర్వము, మహాభారతం ఇతిహాసంలోని నాలుగవభాగము. సంస్కృతమూలం వ్యాసుడు రచించాడు. ఆంధ్ర మహాభారతంలో తిక్కన రచన ఈ పర్వంనుండి ఆరంభమౌతుంది. సభాపర్వంలో భంగపడిన పాండవులు జూద నియమానుసారం పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం తరువాత అజ్ఞాతవాసం చేయడం ఈ పర్వంలో ముఖ్య కథాంశం.

దస్త్రం:Mahabharata02ramauoft 0022 37.jpg
మహాభారతంలో నాల్గవ పర్వము. ఇందులో 12 సంవత్సరాల వనవాసం అనంతరం ఒక అజ్ఞాత వాసంలో భాగంగా విరాట రాజు కొలువులో పాండవులు వివిధ ఉద్యోగాలలో చేరుట.

కథా సంగ్రహం మార్చు

సభాపర్వంలో భంగపడిన పాండవులు జూద నియమానుసారం పన్నెండేండ్ల అరణ్యవాసం చేసిన తరువాత తర్వాత, ఒక సంవత్సరం అజ్ఞాతవాసదీక్ష చేయుట కొరకు మారు పేర్లతో విరాట నగరం ప్రవేశించి, విరాట రాజు కొలువులో ఉద్యోగాలు సంపాదించి కుదురుకుంటారు. అక్కడ ధర్మరాజు విరాట రాజు  కొలువులోకి "కంకుడు" అనే మారుపేరుతో ప్రవేశించాడు. భీముదు " బల్లవ" పేరుతో ప్రవేశించాడు. అర్జునుడు "బృహన్నల" పేరుతో కొలువులోకి ప్రవేశించాడు. ఇక నకులుడు "గ్రంథిక" పేరుతో కొలువు లోకి వచ్చాడు. సహదేవుడు తన పేరును " తంతిపాలుడు" గా చెప్పుకున్నాడు. ద్రౌపది తన పేరును "సైరంధ్రి"గా చెప్పుకున్నది. ఇంకొన్ని రోజులలో అజ్ఞాతవాసం ముగుస్తుందనగా కీచకుని వలన రాణికి పరిచారికగా ఉన్న ద్రౌపదికి ఆపద రాగా, భీముడు అతిచాకచక్యంతో గంధర్వులన్న భ్రాంతి కలిగిస్తూ అతనిని, అతని తమ్ములను సంహస్తాడు. దుర్యోధనుడు కుతంత్రంతో పాండవులను బయల్పరచాలని దక్షిణ, ఉత్తర గోగ్రహణాలకు పన్నాగం పన్నుతాడు. అప్పటికే పాండవులు అజ్ఞాతవాసం పూర్తి చేసుకున్నవారై, అర్జునుడు మినహా తక్కిన పాండవులు విరాటునికి బాసటగా వెళ్ళి సుశర్మను ఓడిస్తే, బృహన్నలగా ఉన్న అర్జునుడు ఉత్తరునికి రథసారథిగా వెళ్ళి ఆ పై గాండీవధారియై తన నిజరూపాన్ని ప్రకటించి భీష్మ, ద్రోణ, కర్ణ, సుయోధన, ఆశ్వత్థామాది యోధులను ఒక్కడే ఎదుర్కొని వారలను జయించి గోవులను మరలుస్తాడు. ఉత్తరాభిమన్యుల వివాహంతో మంగళదాయకంగా విరాట పర్వం ముగుస్తుంది.[1]

సంస్కృత మహాభారత విషయాలు మార్చు

మహా భారతంలోని మొత్తం ౧౦౦ ఉపపర్వాలలో ౪ ఉప పర్వాలు విరాట పర్వంలో ఉన్నాయి. కాని తెలుగు మహా భారతంలో ఉప పర్వాల నియమాన్ని పాటించలేదు.

సంస్కృత మూలంలో ఉన్న ఉపపర్వాలు:

  1. వైరాటం
  2. కీచక వధ
  3. గోగ్రహణం
  4. అభిమన్యుని వివాహం

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "Mahabharatam | Mahabharata | Mahabharat | Mahabharata Pravachanam | Kavitraya Bharatam | Nannaya, Tikkana, Errana | Vyasa Bharatam | Telugu Bharatam | Telugu | Download Bharatam | Bharatam | Pandavas | Avadhanam | Samprathi Surendranath | Telugu Books | P V Ramana । మహాభారతం । భారతం । మహాభారత ప్రవచనం । కవిత్రయ భారతం । వ్యాస భారతం । నన్నయ, తిక్కన, ఎఱ్ఱన । తెలుగు భారతం । తెలుగు సాహిత్యం । పాండవులు । అవధానం । సాంప్రతి సురేంద్రనాథ్ | పి.వి.రమణ". www.mahabharatapravachanam.org. Archived from the original on 2021-04-11. Retrieved 2021-04-11.

బయటి లింకులు మార్చు

 
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: