విరామస్థానం
విరామస్థానమును నిర్ణీత స్థానం, సమాతస్థితి స్థానం అని కూడా అంటారు. ఆవర్తనా చలనంలో ఉన్న వస్తువు, ముందుకి, వెనకకి ఒకే పథంలో, చలిస్తూ ఉంటే, దాని చలనాన్ని డోలాయమాన చలనం లేదా కంపన చలనం అంటారు. ఉదాహరణకు గోడ గడియారంలోని లోలకపు చలనాన్ని తీసుకున్నట్లయితే, దాని నిశ్చల స్థానం కుడి, ఎడమ స్థాన భ్రంశాలకి మధ్యగా ఉంటుంది. లోలకానికి ఇది ఒక నిర్ణీత స్థానం, దీనినే విరామస్థానం లేదా సమాతస్థితి స్థానం అంటారు. వస్తువు తన డోలనాలని ఆపితే, అది ఈ విరామస్థానమునకు వచ్చి ఆగుతుంది.
ఇవి కూడా చూడండి
మార్చుబయటి లింకులు
మార్చుఈ వ్యాసం శాస్త్ర సాంకేతిక విషయానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |