విరూపాక్ష విద్యారణ్య స్వామి

విరూపాక్ష విద్యారణ్య స్వామి ఒక ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఈయన చారిత్రక విజయనగర సామ్రాజ్య రాజధాని హంపి పీఠాధిపతి. ఈయన బెంగుళూరులో జన్మించారు. ఈయన హంపి పీఠం వైభవమంతా అంతరించే సమయంలో హంపి పీఠాధిపత్యాన్ని అధిరోహించారు. ఈయన హిందూ ధర్మ రక్షణ కోసం పాటుపడుతున్నారు. ఈయన నూతన దేవాలయాల నిర్మాణ సమయంలో లేదా దేవాలయాల సందర్శన సమయంలో ఆధ్యాత్మిక సందేశాలు ఇవ్వటం, హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటిచెప్పడం, దేవాలయాల యొక్క గొప్పతనాన్ని చాటిచెప్పడం, దాని వలన మునుపు కలిగిన ప్రయోజనాలను వివరించటం, హిందూ ధర్మాన్ని పాటించకపోవడం వలన ప్రజలు ఏవిధంగా నష్టపోతున్నారో తెలియచెప్పటం వంటి అనేక అంశాలను ఆలయ ప్రాంగణంలో ఈయన వివరిస్తారు.

దేవాలయాల నిర్మాణ సమయంలో హోమం నిర్వహించడం, యంత్ర స్థాపన చేయడం, ధ్వజస్తంభ స్థాపన చేయడం, విగ్రహ స్థాపన చేయడం, బలిపీఠం స్థాపన చేయడం, కలశ స్థాపన చేయడం, విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ట చేయడం వంటి ప్రముఖ పనులను ఈయన నిర్వహిస్తారు.

కుటుంబ నేపథ్యం మార్చు

వీరి నాన్నగారు కర్నూలుకి, అమ్మగారు బెంగుళూరుకి చెందినవారు, ఈ దంపతులకు ఈయన బెంగుళూరులో జన్మించారు.

ఇవి కూడా చూడండి మార్చు

బయటి లింకులు మార్చు

మూలాలు మార్చు