విలియం పెల్ బార్టన్

సర్ విలియం పెల్ బార్టన్, కెసిఐఇ, సిఎస్ఐ (29 మే 1871-28 నవంబర్ 1956) బ్రిటీషు పాలనలో, భారత రాజకీయ సేవలో విశిష్టమైన కృషిని చేశాడు.[1][2] ఈయన బరోడా (1919), మైసూరు (1919-1925), హైదరాబాదు (1925-1930) మొదలైన సంస్థానాల్లో బ్రిటీషు రెసిడెంటుగా పనిచేశాడు. భారతదేశంలో బ్రిటిష్ పాలన రోజుల్లో నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ (వాయువ్య సరిహద్దు ప్రాంతం) తో పాటు, స్థానిక సంస్థానాలపై నిపుణుడిగా ప్రసిద్ధి చెందాడు.[1][2] రాజకీయ సేవలో ఉద్యోగ విరమణ తరువాత అతను సంస్థానాల చరిత్రకారుడిగా పనిచేశాడు. భారతదేశం, పాకిస్తాన్లకు సంబంధించిన విషయాలపై పత్రికలలో తరచుగా రచనలు చేశాడు.[1][2]

సర్ విలియం పెల్ బార్టన్
కెసిఐఇ , సిఎస్ఐ
దస్త్రం:Sir William Pell Barton.jpg
జననం(1871-05-29)1871 మే 29
మరణం1956 నవంబరు 28(1956-11-28) (వయసు 85)
జాతీయతబ్రిటీషు
విద్యబెడ్‌ఫర్డ్ మోడ్రన్ స్కూల్
విశ్వవిద్యాలయాలువోర్చెస్టర్ కళాశాల (ఆక్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం)
యూనివర్సిటీ కాలేజీ, లండన్

ప్రారంభ జీవితం

మార్చు

విలియం పెల్ బార్టన్ నార్తాంప్టన్‌కు చెందిన విలియం, సారా బార్టన్‌ల కుమారుడిగా 29 మే 1871న నార్తాంప్టన్‌లో జన్మించాడు.[1][3] అతను బెడ్‌ఫోర్డ్ మోడరన్ స్కూల్, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన వోర్చెస్టర్ కళాశాల, యూనివర్శిటీ కాలేజ్ లండన్లలో చదువుకున్నాడు.[1][4]

వృత్తి జీవితం

మార్చు

1893లో ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, ఇంగ్లాండ్ నుండి పంజాబ్కు బయలుదేరాడు.[1] అతను వాయువ్య సరిహద్దు ప్రాంతంలో అనేక జిల్లాలకు పాలనాధికారిగా ఉన్నాడు. ఆ తరువాత భారత రాజకీయ సేవకు బదిలీ అయ్యి, ప్రారంభంలో దిర్, స్వాత్, చిత్రాల్ సంస్థానాలలో రాజకీయ ఏజెంట్గా పనిచేశాడు.[1]

1911లో, బార్టన్ అప్పటి నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ చీఫ్ కమిషనర్ అయిన సర్ జార్జ్ రూస్-కెప్పెల్ కు కార్యదర్శిగా నియమించబడ్డాడు.[1] 1915 నాటికి ఆయన నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ యొక్క జ్యుడీషియల్ కమిషనర్గా ఉన్నాడు. 1919లో కొంతకాలం బరోడా సంస్థానంలో బ్రిటిష్ రెసిడెంట్‌గా ఉన్నాడు. ఆ తరువాత ఫ్రాంటియర్‌కు తిరిగి వచ్చి, అక్కడ ఆయన చిన్న ఆఫ్ఘన్ యుద్ధంలో రాజకీయ సేవలను చేపట్టాడు. వజీరిస్తాన్ ఫీల్డ్ ఫోర్స్‌లో ప్రధాన రాజకీయ ఏజెంటు అయ్యాడు.[1]

 
మైసూరు ప్యాలెస్

1920 నుండి 1925 మధ్య, బార్టన్ మైసూరు రాజ్యంలో బ్రిటిష్ రెసిడెంట్‌గా, కూర్గ్ ప్రాంతానికి చీఫ్ కమిషనర్‌గా పనిచేశాడు.[1][5] 1925లో ఆయన హైదరాబాదు రాజ్యంలో బ్రిటిష్ రెసిడెంట్‌గా నియమించబడ్డాడు. ఆ సమయంలో ఆయన రాచరిక సంస్థానాలతో మంచి సంబంధాలను ఏర్పరచుకున్నాడు. హైదరాబాదు రాజ్య ప్రధానమంత్రి సర్ అక్బర్ హైదరీతో కూడా మంచి సంబంధాలు ఏర్పరచుకున్నాడు.[1] "ఈ సామర్థ్యాలన్నింటిలో ఆయన నెమ్మదైన విధానం, సహజమైన దయ,, విచక్షణతో కూడిన తీర్పు, ధృడమైన ఉద్దేశ్యపూర్వకత ముడిపడి ఉన్నాయి" అని ది టైమ్స్ పత్రిక ఆయన సంస్మరణలో పేర్కొంది.[1]

బార్టన్, 1927లో ఆర్డర్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్ నైట్ కమాండర్ పురస్కారంతో సత్కరించబడ్డాడు.[2][6]

రచనలు

మార్చు

రాజకీయ సేవను విరమణ పొందిన తర్వాత ఆయన రాచరిక సంస్థానాల చరిత్రకారుడిగా పనిచేశాడు. భారత, పాకిస్తాన్ విషయాలపై పత్రికలలో తరచూ రచనలు చేశాడు.[1]

కుటుంబ జీవితం

మార్చు

బార్టన్, ఎవెలిన్ ఆగ్నెస్ హెరిజ్-స్మిత్ ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.[1] ఈయన 28 నవంబర్ 1956న సస్సెక్స్ లోని ఆర్డింగ్లీలోని తన ఇంటిలో మరణించాడు.[1]

ఈయన కుమార్తెలలో ఒకరైన ఎలిజబెత్ విడాల్ బార్టన్, ప్రముఖ చారిత్రక జీవితచరిత్రల రచయిత్రి.[7] ఈమె, సర్ రిచర్డ్ హామిల్టన్, 9 వ బారోనెట్‌ను వివాహం చేసుకున్నది.[7]

ఎంపిక చేసిన రచనలు

మార్చు
  • ది ప్రిన్ స్ ఆఫ్ ఇండియా. (ఆంగ్లం) ప్రచురణ నిస్స్బెట్ & కో, లండన్, 1934 [8]
  • ఇండియాస్ నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ (ఆంగ్లం). ప్రచురణ జాన్ ముర్రే , లండన్, 1939 [9]
  • ఇండియాస్ ఫేట్‌ఫుల్ అవర్ (ఆంగ్లం). ప్రచురణ జాన్ ముర్రే, లండన్, 1942 [10]

మూలాలు

మార్చు
  1. 1.00 1.01 1.02 1.03 1.04 1.05 1.06 1.07 1.08 1.09 1.10 1.11 1.12 1.13 1.14 Obituary, Sir W. Barton, The Times, 29 November 1956, p.15
  2. 2.0 2.1 2.2 2.3 "Barton, Sir William (Pell), (1871–28 Nov. 1956), late Indian Political Department". WHO'S WHO & WHO WAS WHO. 2007. doi:10.1093/ww/9780199540884.013.U234501. ISBN 978-0-19-954089-1.
  3. England Census, 1881
  4. Bedford Modern School of the Black and Red, by A.G. Underwood (1981)
  5. Truhart, Peter (January 2003). Asia & Pacific Oceania. De Gruyter. ISBN 9783110967463. Retrieved 29 June 2015.
  6. THE EDINBURGH GAZETTE, JANUARY 4, 1927, p. 5
  7. 7.0 7.1 "Sir Richard Hamilton, Bt". The Daily Telegraph. 3 October 2001. Retrieved 29 June 2015.
  8. The princes of India, with a chapter on Nepal. OCLC 2604747.
  9. India's north-west frontier. OCLC 2775044.
  10. India's fateful hour. OCLC 2290899.