అక్బర్ హైదరీ

భారత రాజకీయ నాయకుడు

సర్ మహమ్మద్ అక్బర్ నజర్ అలీ హైదరీ, సద్ర్ ఉల్-మహమ్,[1] ప్రివీ కౌన్సిల్ (నవంబరు 8, 1869 – నవంబరు 1941)[2] భారతీయ రాజకీయ నాయకుడు. ఈయన 1937, మార్చి 18 నుండి 1941 సెప్టెంబరు వరకు హైదరాబాదు రాజ్యానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు.[3]

అక్బర్ హైదరీ
అక్బర్ హైదరీ



వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
జీవిత భాగస్వామి అమీనా తయ్యబ్జీ
సంతానం మహమ్మద్ సలేహ్ అక్బర్ హైదరీ
వృత్తి రాజకీయనాయకుడు

వ్యక్తిగత జీవితం

మార్చు

హైదరీ, 1869, నవంబరు 8న ఒక సులేమానీ బోరా ముస్లిం కుటుంబంలో జన్మించాడు. ఈయన తండ్రి సేఠ్ నజర్ అలీ హైదరీ, బొంబాయికి చెందిన వ్యాపారవేత్త.[4]

హైదరాబాదు రాజ్యానికి వచ్చే ముందు హైదరీ ఇండియన్ ఆడిట్, అకౌంటెన్సీ సర్వీసులో పనిచేశాడు. హైదరాబాదు రాజ్యంలో తొలుత ఆర్ధికశాఖమంత్రిగా చేరి, ఆ తర్వాత ప్రధానమంత్రి అయ్యాడు. ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. అజంతా గుహల పునరుద్ధరనకు ప్రధాన కారకుడు.[5]

ఈయన 1930 నవంబరు నుండి 1931 జనవరి వరకు జరిగిన తొలి రౌండు టేబులు సమావేశంలో హైదరాబాదు రాజ్యానికి ప్రాతినిధ్యం వహించాడు.1936 జనవరిలో హైదరీ యునైటెడ్ కింగ్డం ప్రివీ కౌన్సిలుకు సభ్యుడగా నియమించబడ్డాడు.[6] 1941లో వైస్రాయి ఎగ్జిక్యూటివ్ కౌన్సిలుకు సభ్యుడిగా నియమితుడయ్యాడు. అస్సాం రాష్ట్రానికి తొలి భారతీయ గవర్నరైన మహమ్మద్ సలేహ్ అక్బర్ హైదరీ ఈయన కుమారుడు.[7]

గౌరవ సత్కారాలు

మార్చు

1928 జన్మదిన సత్కారాల్లో బ్రిటీషు ప్రభుత్వం ఈయనను నైట్‌గా ప్రకటించింది.[1][5] అధికారికంగా ఈయన్ను లార్డ్ ఇర్విన్ 1929 డిసెంబరు 17న హైదరాబాదులో జరిగిన ఉత్సవంలో నైట్‌ను చేశాడు.[8]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 Edinburgh Gazette, 8 June 1928[permanent dead link]
  2. "Mohammed Akbar Nazar Ali Hydari (1869 - c.1941)". Geni.com. 2011-09-30. Archived from the original on 2016-01-26. Retrieved 2013-07-05.
  3. Hyderabad, Princely States of India, WorldStatesmen.org
  4. "Golconde" (PDF). motherandsriaurobindo.in. Archived from the original (PDF) on 6 మే 2017. Retrieved 6 May 2017.
  5. 5.0 5.1 Gunther, John. Inside Asia - 1942 War Edition. READ BOOKS, 2007, pp. 471-472
  6. Edinburgh Gazette, 7 January 1936[permanent dead link]
  7. Sulaymani Bohra: South Asia Archived 2016-03-03 at the Wayback Machine, accessed July 5, 2010
  8. Edinburgh Gazette, 11 February 1930[permanent dead link]

బయటి లింకులు

మార్చు