వివక్తత
ఒక జనాభాలో కొన్ని బాహ్య లేక అంతర్గతకారకాల సహయంతో స్వజాతిస్ధ ప్రజననాన్ని నిరోధించి దాన్ని రెండు లేక మూడు సమూహలుగా విడగొట్టు ప్రక్రియను వివక్తత అని నిర్వచించవచ్చును. ఒక జాతి జీవుల మధ్య స్వేచ్ఛాయుత స్వజాతిస్థప్రజననాన్ని నిరోధించి జన్యుప్రవాహన్ని అడ్డుకునే ఏ కారకమైనా వివక్తతను ప్రోత్సహిస్తుంది. ఒక జంతువుల లేక మొక్కల కుటుంబంలోని జీవులు ప్రత్యుత్పత్తి సంబంధిత వివక్తత చెందటానికి ,ప్రదేశము,దూరము శీతోష్ణస్థితితో పాటు,జైవిక కారకాలు కూడ,సమంగా బాధ్యత వహిస్తాయనీ, ఆ జనాభాలోని సభ్యులను వివక్తతకు గురి చేయటంలో ప్రధాన పాత్ర వహిస్తాయని గుర్తించినారు.
వివక్తతా విధానాలు(Isolating mechanism)
మార్చు- ప్రాదేశిక వివక్తత లేక సుదూర వివక్తత (Spatial Isolation or Isolation by Distance)
- భౌగోళిక వివక్తత (Geographical Isolation)
- శీతోష్ణస్థితి సంబంధ వివక్తత (Climatic Isolation)
- జీవ సంబంధ వివక్తత (Biotic Isolation)
ప్రత్యుత్పత్తి వివక్తత విధానాలు (Reproductive Isolation mechanisms)
మార్చుఇవి రెండు రకాలు.
- సంపర్క పూర్వ లేక సంయుక్తబీజ పూర్వ వివక్తతా విధానాలు (Premating or Prezygotic Isolating mechanisms :
- ఆవరణ సంబంధ వివక్తత (Ecologic Isolation)
- ప్రవర్తన సంబంధ వివక్తత (Ethologic Isolation)
- ఋతు సంబంధ వివక్తత (Seasonal Isolation)
- యాంత్రిక సంబంధ వివక్తత (Mechanical Isolation)
- సంపర్కానంతర లేక సంయుక్త బీజానంతర వివక్తతా విధానాలు(Post Mating or Post Zygotic Isolating mechanisms :
- బీజ కణాల మృతి (Gametic Mortality)
- సంయుక్త బీజాల మృతి (Zygotic Mortality)
- సంకరాలు జీవించ లేకపోవటం (Hybrid inviability)
- సంకరాల వంధ్యత్వం (Hybrid Sterility)
- హైబ్రిడ్ బ్రేక్ డ్ న్ (Hybrid breakdown)