విశాఖపట్నం ప్రజా గ్రంథాలయం

విశాఖపట్నంలోని ప్రజా గ్రంథాలయం

విశాఖపట్నం ప్రజా గ్రంథాలయం (విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీ) అనేది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విశాఖపట్నం నగరంలో ఉన్న ఒక ప్రజా గ్రంథాలయం.[1] ఇది సాధారణ ప్రజలకు ఉచిత గ్రంథాలయ సేవలు, పఠనానుకూలం, విశాల స్థలం, ఉచిత వై-ఫై, స్టడీ రూమ్ సేవలను అందిస్తుంది. సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ అనే సంస్థ కూడా ఈ భవనంలో ఉంది.

విశాఖపట్నం ప్రజా గ్రంథాలయం
A building entrance, flanked by trees, revealing a lighted doorway above a short flight of stairs, with people standing in front..
గ్రంథాలయ ప్రవేశం
దేశముభారతదేశం
తరహాప్రజా గ్రంథాలయం
ప్రదేశముద్వారకానగర్, విశాఖపట్నం
భౌగోళికాంశాలు17°43′46″N 83°18′26″E / 17.729453°N 83.307085°E / 17.729453; 83.307085
గ్రంధ సంగ్రహం / సేకరణ
గ్రంధాల సంఖ్య54000 పుస్తకాలు
ప్రాప్యత, వినియోగం
పనిచేసే ప్రజలు12 లక్షలమంది
ఇతర విషయాలు
సంచాలకుడుడాక్టర్ ఎస్. విజయ కుమార్ (ఛైర్మన్)
వెబ్‌సైటుhttp://www.visakhapatnampubliclibrary.org/

చరిత్ర మార్చు

ఇది 1996లో ఏర్పాటు చేయబడింది. దీని నిర్మాణం కోసం 2,000 square yards (1,700 m2) భూమిని అప్పటి విశాఖపట్నం మేయర్ సబ్బం హరి అందించాడు. 1999 అక్టోబరు 23న ఈ భవనానికి శంకుస్థాపన చేశారు. 2003 డిసెంబరు 3న అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ సుర్జిత్ సింగ్ బర్నాలా ఈ గ్రంథాలయాన్ని ప్రారంభించాడు. 2004 జూలై 15 నుండి కార్యకలాపాలు ప్రారంభించబడ్డాయి.[2]

ఈ గ్రంథాలయం విశాఖ మహానగరపాలక సంస్థ ఆధీనంలో ఉంది. ఈ గ్రంథాలయ వ్యవహారాలను నిర్దేశించడానికి ప్రముఖ పౌరులతో విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీ సొసైటీ అనే ట్రస్ట్ ఏర్పాటు చేయబడింది. 2019 నాటికి ఛైర్మన్ గా డాక్టర్ ఎస్. విజయ కుమార్, కార్యదర్శిగా డిఎస్. వర్మ ఉన్నాడు.[2]

మూలాలు మార్చు

  1. "Visakhapatnam Public Library sports a new look". The Hindu. 16 February 2019. Retrieved 19 January 2024.
  2. 2.0 2.1 "Genesis and Growth". Visaphapatnam Public Library. Archived from the original on 8 జూన్ 2019. Retrieved 8 June 2019.