విశాఖపట్నం మెట్రో

విశాఖపట్నం మెట్రో భారతీయ నగరం విశాఖపట్నంలో రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం ప్రతిపాదన ఉంది. ఈ వ్యవస్థను ట్రాఫిక్ రద్దీ తగ్గించడానికి అలాగే ఆంధ్ర ప్రదేశ్ యొక్క అతిపెద్ద నగరం కావున ప్రతిపాదించబడింది. [1] మెట్రో రైలు ప్రాజెక్టు ద్వారా వీధుల్లో అస్తవ్యస్తమైన ట్రాఫిక్ పరిస్థితి నిర్బంధించడానికి జివిఎంసి ద్వారా ప్రణాళిక కూడా చేయబడింది. ప్రతిపాదన ఫిబ్రవరి 2014 లో జివిఎంసి వారు సమర్పించారు తరువాత, అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ శాఖ సాధ్యత అధ్యయనాలు, డిపిఆర్ ముందుకు వెళ్ళేందుకోసం సూత్రప్రాయంగా ఆమోదం లభించింది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జివిఎంసి) 25 జూన్ న ట్రాఫిక్ సాంద్రత ఆధారంగా ఒక 25 కిమీ పొడవున కోసం ఒక డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయుటకు ప్రపంచవ్యాప్త టెండర్లకు పిలుపునివ్వడం జరిగింది. వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక తయారు కోసం, రైట్స్ నుండి, సిస్‌ట్రా సమూహం, ఆర్‌వీఅసోసియేట్స్; ఢిల్లీకి చెందిన లీ అసోసియేట్స్ సౌత్ ఆసియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధారిత ఎస్‌ఆర్‌ఈఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ లిమిటెడ్, హైదరాబాద్, యుఎస్- ఆధారిత ఏఈసిఒఎం కన్సల్‌టెంట్స్ నుండి జివిఎంసి బిడ్లను పొందడం జరిగింది. కానీ తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ ఏడుగురు సభ్యుల కమిటీ పరిశీలన కిందకు వెళ్ళింది, టెండర్ విధానాన్ని రద్దు చేయవలసి వచ్చింది.[2] విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టు మూడు కారిడార్లకు సంబంధించిన సర్వే పనులు పూర్తి స్వింగ్ లో ఉన్నాయి. డిఎం ఆర్‌సి, మార్చి 2015 నాటికి తన నివేదికను సమర్పించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంది. మొత్తం 30 కి.మీ. సాగిన రైలు మార్గము మొదటి ఫేజ్‌లో చేయబడుతుంది.

విశాఖపట్నం మెట్రో రైల్
Visakhapatnam Metro Rail
ముఖ్య వివరాలు
స్థానిక ప్రదేశంవిశాఖపట్నం , ఆంధ్ర ప్రదేశ్ , భారతదేశం
ట్రాన్సిట్ రకంరాపిడ్ ట్రాన్సిట్
లైన్ల సంఖ్య3 (అంచనా)
స్టేషన్ల సంఖ్య42 (అంచనా)
కార్యాచరణ ప్రారంభమయ్యేది2018 (అంచనా)
సాంకేతిక అంశాలు
వ్యవస్థ పొడవు42 కి.మీ.(అంచనా)

మొదటి దశ కారిడార్లు

మార్చు
  • 1 గురుద్వారా జంక్షన్ - పాత పోస్ట్ ఆఫీస్
  • 2 తాటిచెట్లపాలెం - ఈస్ట్ పాయింట్ కాలనీ
  • 3 ఎన్‌ఏడి జంక్షన్ - మధురవాడ

చరిత్ర

మార్చు

విశాఖపట్నం మెట్రో రైల్ వ్యవస్థ ట్రాఫిక్ రద్దీ తగ్గించడం, కాలుష్యాన్ని తగ్గించేందుకు ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ప్రతిపాదించబడింది. ఈ. శ్రీధరన్, మెట్రో మాన్, ఆంధ్ర ప్రదేశ్ మెట్రో రైలు ప్రాజెక్టులు సలహాదారు, 21 జనవరిలో మెట్రో రైల్ కారిడార్లలో ప్రతిపాదిత నగరంలో పలు ప్రాంతాల్లో సందర్శించారు. ఆయన రోడ్లు యొక్క వెడల్పు, ట్రాఫిక్ సాంద్రత వంటి అంశాలను వివిధ శాఖల అధికారులతో చర్చలు జరిపారు. ఆయన సర్వే ప్రక్రియ పరిశీలించారు, ఒక నెలలో సర్వే త్వరితంగా పూర్తి చేసేటట్లు మరో రెండు నెలల్లో డిపిఆర్‌లు సిద్ధం అయ్యేవిధంగా సిబ్బందికి సూచించారు.. ప్రస్తుతం, మూడు జట్లు సిబ్బంది నైసర్గిక, ట్రాఫిక్ సర్వేలు కోసం కృషి చేస్తున్నారు.

మెట్రో రైల్ నగరం యొక్క మూడు కారిడార్లు 37 కి..మీ.తో పాటు, రైల్వే స్టేషన్, అల్లిపురం, జగదంబ జంక్షన్, పాత పోస్ట్ ఆఫీస్, జివిఎంసి, సిరిపురం, ఆంధ్ర విశ్వవిద్యాలయంల మీదుగా ఎన్‌ఏడి నుండి మధురవాడకు, పాత పోస్ట్ ఆఫీస్ వరకు, పార్క్ హోటల్ జంక్షన్ వరకు ప్రతిపాదించబడింది

మిస్టర్ శ్రీధరన్ ఇతర రంగాలతో పాటుగా ద్వారకానగర్, రైల్వే స్టేషన్, జగదంబ జంక్షన్, పూర్ణా మార్కెట్, టౌన్ కొత్తరోడ్, ఎన్‌ఏడి ప్రదేశములను కూడా సందర్శించారు. ఆయన ఎడిఆర్‌ఎం, రైల్వే ట్రాఫిక్ సీనియర్ డివిజనల్ ఇంజనీర్, ప్రయాణికులు మొదలైన వారితో నేల మీదకు దిగి భూమిమీద మాట్లాడారు. జివిఎంసి, చీఫ్ సిటీ ప్లానర్ నుండి విస్తరించాల్సిన రహదారుల సమాచారాన్ని పొందారు.

డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్

మార్చు

సాధ్యత అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేసేందుకు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డిఎంఆర్‌సి) ను నియమించారు, అది ఒక వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్) ఇవ్వమని కోరారు. డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డిపిఆర్) సిద్ధంగా ఉంది, శ్రీ ధరన్ ద్వారా ఢిల్లీలో ముఖ్యమంత్రి శ్రీ చంద్ర బాబు నాయుడుకు సమర్పించబడుతుంది. [3] వైజాగ్ మెట్రో ప్రాజెక్ట్ కోసం డిఎంఆర్‌సి రెండు ప్రత్యేక డిపిఆర్‌లు 34.45 కి.మీ.మార్గం పొడవు ఒకటి, మధురవాడ నుండి లైన్ 1 న గాజువాక వరకు పొడిగింపు 45.5 కి.మీ.మార్గం పొడవు మరొకటి సిద్ధం చేసింది. [4] మొత్తంగా ఉన్న మెట్రో రైల్ 45 కి.మీ.మార్గం పొడవుతో మూడు కారిడార్లలో ప్రతిపాదించబడింది. పొడవైన కారిడార్, 31.2 కి.మీ.మార్గం పొడవుతో నడుస్తుంది. ఇది మధురవాడ నుండి గాజువాకకు ప్రతిపాదించారు. ప్రారంభంలో అయితే కారిడార్ మధురవాడ నుండి ఎన్‌ఎడికు ప్రతిపాదించబడింది, తరువాత మరొక 8.2 45 కి.మీ.మార్గం జోడించడం ద్వారా గాజువాక వరకు చేర్చారు. ఇతర కారిడార్లు గురుద్వారా జంక్షన్ నుండి వన్ టౌన్ (5.5 కి.మీ.), యూనివర్సిటీ రోడ్‌ ద్వారా తాటిచెట్లపాలెం నుండి పార్క్ హోటల్ (7 కి.మీ.) వరకు ఉన్నాయి. డిపిఆర్ ఛార్జీలు 0 కి.మీ. వద్ద నుండి 5 కి.మీ. దూరంలో రూ .10/-, 5 నుండి 10 కి.మీ. వరకురూ రూ.20/-, 10 కి.మీ. దాటిన తరువాత రూ .30/- లుగా నిర్ణయించడానికి ప్రతిపాదించింది.

డిపిఆర్‌ ప్రకారం, మొత్తం దూరం 42.55 కి.మీ. - ఎన్‌ఎడి జంక్షన్ నుండి కొమ్మాడి జంక్షన్ (మధురవాడ) వరకు, 22.8 కిలోమీటర్ల దూరం కోసం, గురుద్వారా నుండి పాత పోస్ట్ ఆఫీస్ వరకు, తాటిచెట్లపాలెం నుండి చిన్న వాల్తేరు వరకు, 5.26 కిలోమీటర్ల దూరం కోసం, ఎన్‌ఎడి జంక్షన్ నుండి గాజువాక వరకు, 8.1 కిలోమీటర్ల దూరం కోసం నాలుగు కారిడార్లులో అమలు పరచుతారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డిపిఆర్) ద్వారా రూ. 13.488 కోట్ల వ్యయంతో విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు అమలు అవుతుంది. ఇది నాలుగు సంవత్సరాల కాలంలో పూర్తవుతుందని భావిస్తున్నారు.[5]

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆహ్వానించిన టెండర్లకు స్పందనగా ఒకే ఫైనాన్షియల్ బిడ్డు దాఖలవడంతో 2019 డిసెంబరు 30 న ప్రభుత్వం ఆ టెండరును రద్దు చేసింది. కొత్తగా డీపీఆర్‌ను తయారు చెయ్యాలని నిశ్చయించి, కొత్త కన్సల్టెంటును నియమించింది.[6]

ప్రణాళిక

మార్చు

భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అజ్మీర్ అలహాబాద్ పాటు యునైటెడ్ స్టేట్స్ సహకారంతో విశాఖపట్నం ఒక స్మార్ట్ నగరంగా తయారు అవుతుంది, విశాఖపట్నంలో మెట్రో రైలు కోసం ప్రణాళికలు తయారు చేస్తున్నరు అని తన అమెరికా పర్యటనలో ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు కూడా విశాఖపట్నం మెట్రో ముందుకు జరిపేందుకు సలహాదారుగా మాజీ డిఎంఆర్‌సి చీఫ్ శ్రీధరన్‌ను నియమించారు.[7]

(ప్రణాళికాబద్ధమైన) కారిడార్లు

మార్చు

డిఎంఆర్‌సి తయారుచేసిన వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్) ప్రకారం, విశాఖపట్నం మెట్రో, పూర్తి చేసినప్పుడు, ఈ క్రింది లైన్లు, స్టేషన్లు కలిగి ఉంటాయి. [8]

లైన్ టెర్మినల్ ప్రారంభ తేదీ పొడవు
(కి.మీ.)
స్టేషన్ల సంఖ్య మధ్యంతర స్టేషన్లు పొడిగింపు ఇంటర్‌చేంజ్
లైన్ 1 మధురవాడ ఎన్‌ఏడి జంక్షన్ - 22.28 కి.మీ. 19 కొమ్మాడి జంక్షన్, హనుమంతవాక జంక్షన్, మద్దిలపాలెం, గురుద్వారా జంక్షన్, అక్కయ్యపాలెం, కంచరపాలెం, మురళీనగర్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, తాటిచెట్లపాలెం మధురవాడ నుండి గాజువాక వరకు లైన్ 2 గురుద్వారా జంక్షన్ దగ్గర, లైన్ 3 తాటిచెట్లపాలెం దగ్గర
లైన్ 2 గురుద్వారా జంక్షన్ పాత పోస్ట్ అఫీసు - 5.2 కి.మీ. 7 బివికె కాలేజీ, ఆర్టిసి కాంప్లెక్స్, డాబాగార్డెన్స్ , సరస్వతి సర్కిల్, పూర్ణా మార్కెట్ లేదు లైన్ 1 గురుద్వారా జంక్షన్ దగ్గర, లైన్ 3 ఆర్టిసి కాంప్లెక్స్ దగ్గర
లైన్ 3 తాటిచెట్లపాలెం చిన వాల్తేరు - 6.9 కి.మీ. 9 న్యూ రైల్వే కాలనీ, రైల్వే స్టేషన్, అల్లిపురం జంక్షన్, ఆర్టిసి కాంప్లెక్స్, సిరిపురం జంక్షన్, ఆంధ్ర విశ్వవిద్యాలయం లేదు లైన్ 1 తాటిచెట్లపాలెం దగ్గర, లైన్ 2 ఆర్టిసి కాంప్లెక్స్ దగ్గర

స్టేషన్లు

మార్చు
లైన్ 1 లైన్ 2 లైన్ 3
కొమ్మాది
మధురవాడ
శిల్పారామం- పి.ఎం.పాలెం
ఎసిఎ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం
ఎండాడ
ఐజి జూపార్క్
ఆదర్శ్‌నగర్
హనుమంతువాక
వెంకోజీపాలెం
ఇసుకతోట
మద్దిలపాలెం
గురుద్వారా గురుద్వారా
అక్కయ్యపాలెం బివికె కాలేజీ
తాటిచెట్లపాలెం ద్వారక బస్ కాంప్లెక్స్ తాటిచెట్లపాలెం
కంచరపాలెం డాబాగార్డెన్స్ రైల్వే న్యూ కాలనీ
మురళీనగర్ సరస్వతి పార్క్ సర్కిల్ రైల్వే స్టేషను
జిఎస్‌ఐ పూర్ణ మార్కెట్ అల్లిపురం జంక్షన్
ఎన్‌ఏడి జంక్షన్ పాత పోస్ట్ ఆఫీస్ ద్వారక బస్ కాంప్లెక్స్
విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం సంపత్ వినాయక ఆలయం
షీలా నగర్ సిరిపురం జంక్షన్
బిహెచ్‌పివి ఆంధ్ర విశ్వవిద్యాలయం
ఆటోనగర్ చిన్న వాల్తేరు (ఈస్ట్ పాయింట్)
గాజువాక

మూలాలు

మార్చు
  1. http://timesofindia.indiatimes.com/city/visakhapatnam/Vizag-on-track-for-metro-rail-project/articleshow/30960771.cms
  2. http://www.deccanchronicle.com/140912/nation-current-affairs/article/dmrc-prepare-report-vizag-metro-rail-project
  3. "Metro DPR ready". The Hindu. Retrieved 8 September 2015.
  4. "Govt mulls adding Gajuwaka to Vizag Metro Rail project". The Times of India. 28 August 2015. Retrieved 8 September 2015.
  5. http://timesofindia.indiatimes.com/city/visakhapatnam/DMRC-to-build-Vizag-metro-rail-project/articleshow/48940899.cms
  6. ఈనాడు (2019-12-30). "విశాఖ మెట్రో ఫైనాన్షియల్‌ బిడ్ రద్దు - EENADU". www.eenadu.net. Archived from the original on 2019-12-30. Retrieved 2019-12-30.
  7. http://www.thehindu.com/news/national/andhra-pradesh/metro-rail-projects-for-vizag-vijayawada-approved/article6272969.ece
  8. "First phase of Vizag metro rail to be ready by end of 2018". The Times of India. 5 September 2015. Retrieved 8 September 2015.