ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్

ఢిల్లీ మెట్రోను నడిపే సంస్థ, మెట్రోల కన్సల్టెన్సీ సంస్థ

 

ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డిఎమ్‌ఆర్‌సి)
రకంకేంద్ర-రాష్ట్ర భాగస్వామ్యం
పరిశ్రమప్రజా రవాణా
స్థాపన3 మే 1995; 29 సంవత్సరాల క్రితం (1995-05-03)
న్యూ ఢిల్లీ
ప్రధాన కార్యాలయం
న్యూఢిల్లీ
,
భారతదేశం
సేవలుఢిల్లీ మెట్రో, మెట్రో రైళ్ళు, మోనోరైల్, హై స్పీడ్ రైలు కన్సల్టెన్సీ, అమలు
రెవెన్యూమూస:Up6,645 crore (US$830 million) (2023) [1]
మూస:Up 811 crore (US$100 million) (2023)
మూస:Up−1,569 crore (US$−200 million) (2023)
Total assetsDecrease 77,731 crore (US$9.7 billion) (2023)
Total equityDecrease23,359 crore (US$2.9 billion) (2023)
యజమానిభారత ప్రభుత్వం (50%)
ఢిల్లీ ప్రభుత్వం (50%)
ఉద్యోగుల సంఖ్య
13,996 (2023 మార్చి)

ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డిఎమ్‌ఆర్‌సి) అనేది ఢిల్లీ మెట్రో, నోయిడా మెట్రోలను నిర్వహించే కేంద్ర-రాష్ట్ర జాయింట్ వెంచర్ సంస్థ. [2] [3] ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ భారతదేశంలో, విదేశాలలో మెట్రో రైలు, మోనోరైలు, హై-స్పీడ్ రైలు ప్రాజెక్టుల ప్రణాళిక, అమలులో కూడా పాల్గొంటుంది.[4] ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ పని వివిధ భాగాలుగా విభజించారు. వీటిని మేనేజింగ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో డైరెక్టర్లు నియంత్రిస్తారు.

చరిత్ర

మార్చు

ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్‌ను 1995 మే 3 న స్థాపించారు. దీని మొదటి మేనేజింగ్ డైరెక్టర్‌గా E. శ్రీధరన్ పనిచేసారు.[5] సంస్థ తదుపరి మేనేజింగ్ డైరెక్టర్‌గా మంగూ సింగ్‌క 2011 డిసెంబరు 31 న బాధ్యతలు స్వీకరించాడు.

2010 లో తన 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, ఢిల్లీ మెట్రో మొదటిసారిగా 8 కోచ్‌ల రైలును ప్రవేశపెట్టింది. "ఢిల్లీ మెట్రో: ఎ డెకేడ్ ఆఫ్ డెడికేషన్, 10 ఇయర్స్ ఆఫ్ మెట్రో ఆపరేషన్స్" పేరుతో ఒక స్మారక సావనీర్ పుస్తకాన్ని కూడా విడుదల చేసింది. సంగీత దర్శకుడు వైభవ్ సక్సేనా స్వరపరిచిన ప్రత్యేకమైన 'మెట్రో సాంగ్-జిందగీ హై ఢిల్లీ మెట్రో' ను కూడా విడుదల చేసారు. మెట్రో స్టేషన్లుమ్ FM స్టేషన్లలో దీన్ని ప్లే చేసారు.[6][7][8][9]

విధానం, అవార్డులు

మార్చు

ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ నిర్మాణ ప్రదేశాల్లో భద్రతా హెల్మెట్‌లను ధరించడం తప్పనిసరి చేసింది. మెట్రో స్టేషన్లలో వర్షపు నీటి సంరక్షణ ద్వారా కార్బన్ క్రెడిట్లను సంపాదిస్తుంది. కార్మికుల కోసం HIV/AIDS కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.[10]

ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (AIMA) ప్రదానం చేసిన అత్యుత్తమ PSU ఆఫ్ ది ఇయర్ (2016) అవార్డును అందుకుంది. పట్టణ రవాణాలో ప్రపంచ స్థాయి సేవలను ప్రోత్సహించడం, ఉత్తమ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంటు పద్ధతులను అవలంబించడంలో "అత్యుత్తమ సహకారం" కోసం కూడా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అవార్డు పొందింది.

ఇతర ప్రాజెక్టులు

మార్చు

కన్సల్టెన్సీ

మార్చు

ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషనులో, కన్సల్టెన్సీ సేవల కోసం వ్యాపార అభివృద్ధి విభాగం ఉంది.[11] ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్‌గా పనిచేసింది. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఏర్పాటుకు ముందు నిర్మించిన కోల్‌కతా మెట్రో, చెన్నై MRTS మినహా భారతదేశంలోని ప్రతి మెట్రో, మోనోరైల్ ప్రాజెక్ట్‌లకు ప్రాజెక్ట్ నివేదికలను (DPR) తయారు చేసింది.[12] ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ రాయ్‌పూర్, అమృత్‌సర్, నాగ్‌పూర్ వంటి ప్రదేశాలలో ప్రతిపాదిత వ్యవస్థల కోసం DPRలు, సాధ్యాసాధ్యాల నివేదికల తయారీ వంటి తేలికపాటి కన్సల్టెన్సీ కార్యకలాపాలను కూడా అందిస్తుంది.[13] ప్రతిపాదిత తిరువనంతపురం - మంగళూరు హై-స్పీడ్ ప్యాసింజర్ కారిడార్ కోసం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తుంది, దాని DPRని సిద్ధం చేసింది.

2012 సెప్టెంబరులో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్, జకార్తా మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్‌కు మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ కోసం మరో ఎనిమిది అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇది భారతదేశం వెలుపల ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషను చేపట్టిన మొదటి ప్రాజెక్టు.[14][15] JVలో తన ప్రధాన బాధ్యతలు "జకార్తా మెట్రో సంస్థాగత నిర్మాణం, సిబ్బంది నియామకం, శిక్షణా సౌకర్యాల అభివృద్ధి, కార్యకలాపాలను ప్రారంభించడానికి అవసరమైన వివిధ వర్గాల కోసం ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం" అని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ పేర్కొంది.[16]

2014 ఫిబ్రవరిలో కువైట్ నగరంలో ప్రతిపాదిత మెట్రో వ్యవస్థకు సలహాదారుగా వ్యవహరించడానికి కువైట్ ప్రభుత్వం ద్వారా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌ను ఆహ్వానించారు.[13]

ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ కొచ్చి మెట్రో, జైపూర్ మెట్రో, లక్నో మెట్రో, హైదరాబాద్ మెట్రో, పాట్నా మెట్రోల అమలు, లేదా నిర్మాణంలో పాలుపంచుకుంది.[17][18][19][20]

ఢిల్లీ మెట్రో రైల్ అకాడమీ

మార్చు

ఢిల్లీ మెట్రో రైల్ అకాడమీ (పూర్వపు డిఎమ్‌ఆర్‌సి ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్; ఒక పెద్ద అప్‌గ్రేడ్ తర్వాత 2019 సెప్టెంబరు 18 న DMRA గా పేరు మార్చారు) అనేది ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వారి ప్రత్యేక శిక్షణా సంస్థ. దీన్ని డిఎమ్‌ఆర్‌సి వారి శాస్త్రి పార్క్ డిపోలో 2002 జూలై 19 న ప్రారంభించారు.[21] దక్షిణాసియాలో ఇది ఏకైక మెట్రో రైలు శిక్షణా సంస్థ.[22] ఈ సంస్థ చరిత్రలో, 63,000 మంది తమ సిబ్బందికి శిక్షణ నివ్వడమే కాకుండా, భారతదేశం, విదేశాల లోని అనేక సంస్థల నుండి వచ్చిన 2,000 మంది సిబ్బందికి [23] ఇక్కడ శిక్షణ ఇచ్చింది. DMRA వారి అంతర్జాతీయ క్లయింట్‌లలో జకార్తా MRT, ఢాకా మెట్రో రైల్ ఉన్నాయి. అయితే దాని భారతీయ క్లయింట్‌లలో నమ్మ మెట్రో, కొచ్చి మెట్రో, చెన్నై మెట్రో, జైపూర్ మెట్రో, ముంబై మెట్రో, మరెన్నో మెట్రోలూ, ఇతర సంస్థలూ ఉన్నాయి.[21]

ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భాగస్వామ్యంతో ఢిల్లీ మెట్రో టెక్నాలజీలో ఒక సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాను అందిస్తుంది. కోర్సు ఎలక్ట్రికల్, సివిల్, ఆర్కిటెక్చర్, సిగ్నలింగ్, టెలికాం వంటి వివిధ స్ట్రీమ్‌లకు చెందిన 25 మంది ఎగ్జిక్యూటివ్‌లను ఉత్పత్తి చేస్తుంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ కూడా చెన్నై మెట్రో కోసం ఇలాంటి కోర్సును అందిస్తోంది.[24]

ఇవి కూడా చూడండి

మార్చు
  • ఢిల్లీ మెట్రో
  • నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్
  • భారతదేశంలో వేగవంతమైన రవాణా

మూలాలు

మార్చు
  1. "DMRC Annual Report 2022-23" (PDF).
  2. "DMRC to join the global club of metro networks having a span of over 300 km". The Times of India. 29 October 2018. Archived from the original on 31 October 2018. Retrieved 29 October 2018.
  3. "Delhi Metro is now officially on Twitter Follow them @officialDMRC". 20 December 2018. Archived from the original on 20 December 2018. Retrieved 20 December 2018.
  4. "Delhi Metro Rail Corporation Ltd. – ABOUT US". Delhimetrorail.com. Archived from the original on 3 December 2016. Retrieved 19 October 2017.
  5. "Structure of Delhi Metro". DMRC. Archived from the original on 16 September 2010. Retrieved 17 September 2009.
  6. Dayal, Anuj. "To mark the 10th anniversary of operations, Delhi metro to induct the first eight coach train tomorrow; celebrations to continue for a week". delhi metro official site. DMRC. Archived from the original on 12 January 2020. Retrieved 24 April 2020.
  7. Staff Reporter (23 December 2012). "Metro to celebrate 10 years with eight-coach car". The Hindu. the hindu. Archived from the original on 26 April 2023. Retrieved 24 April 2020.
  8. metro, delhi. "Delhi Metro Official Anthem". youtube. delhi metro. Archived from the original on 2020-05-02. Retrieved 24 April 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  9. tyagi, avantika (31 January 2015). "blending music to create heady re(mix)". the times of india. No. TC NEXT. Times Of India. TOI. Retrieved 24 April 2020.
  10. "Delhi to Jakarta: how to do a metro". Financial Times. Archived from the original on 21 December 2012. Retrieved 19 October 2017.
  11. "Set up sister firm for consultancy: MoUD to Delhi Metro". The Indian Express. 29 January 2013. Retrieved 31 January 2013.
  12. "city anchor: Delhi on track, now Metro offers expertise to Jakarta – Indian Express". Indianexpress.com. 24 September 2012. Retrieved 19 October 2017.
  13. 13.0 13.1 "Come, be our consultant: Kuwait to Delhi Metro". Indianexpress.com. 6 February 2014. Archived from the original on 19 October 2017. Retrieved 19 October 2017.
  14. "Delhi Metro bags contract in Indonesia". Business Standard India. Business Standard. Press Trust of India. 23 September 2012. Retrieved 19 October 2017.
  15. "Delhi Metro Rail Corporation goes global with Indonesian Metro job". Indiatoday.intoday.in. Archived from the original on 4 March 2017. Retrieved 19 October 2017.
  16. "Delhi metro bags crucial role in Jakarta project | the Asian Age". Archived from the original on 2 November 2012. Retrieved 25 September 2012.
  17. "Hyd metro phase 1 DPR" (PDF). Archived from the original (PDF) on 30 November 2022. Retrieved 16 September 2022.
  18. "Complete tracks by June 30, govt tells DMRC - Times of India". Archived from the original on 3 January 2013.
  19. "DMRC named interim consultant for Lucknow Metro project". Business Standard India. Business Standard. 10 September 2013. Archived from the original on 19 October 2017. Retrieved 19 October 2017.
  20. "Delhi Metro Rail Corporation Ltd. – Latest Tender". Delhimetrorail.com. Archived from the original on 20 November 2015. Retrieved 19 October 2017.
  21. 21.0 21.1 "Delhi Metro Rail Academy - Brochure" (PDF). dmra.delhimetrorail.com. Delhi Metro Rail Academy. Retrieved 16 November 2023.
  22. "Metro training school gets ISO certification". Deccan Herald. 2 August 2009. Archived from the original on 21 July 2022. Retrieved 20 December 2020.
  23. "Delhi Metro Training Institute now DMRA". Times of India. New Delhi. 19 September 2019. Retrieved 16 November 2023.
  24. "Shortage of experts plagues Kochi Metro - Times of India". Archived from the original on 16 February 2013.