నూనె విశిష్ణ గురుత్వం

(విశిష్ణ గురుత్వము నుండి దారిమార్పు చెందింది)

ఈ పరీక్షా విధానాన్ని నూనెగింజల నుండి నూనెతీయు మిల్లులలో,అలాగే అయిల్ కేకు(oil cakes)లనుండి నూనె తీయు సాల్వెంటు ప్లాంటు పరిశ్రమల్లోని ప్రయోగశాలల్లో నిర్వహిస్తారు

నూనె విశిష్ట గురుత్వము (specific gravity ను విశిష్టగురుత్వ బాటిల్ (specific gravity bottle) ను ఉపయోగించి నిర్ణయించడం జరుగుతుంది. హైడ్రొస్టాటిక్ బాలెన్సును కూడా ఉపయోగించి నిర్ణయించ వచ్చును. ఒక నిర్దిష్ట ఘనపరిమాణము (volume) వున్న నూనె ద్రవ్యభారానికి, అంతే ఘనపరిమానమున్న నీటి ద్రవ్యభారానికి గల నిష్పత్తినే నూనె విశిష్ట గురుత్వం అంటారు[1]

నూనె విశిష్టగురుత్వం నిర్ణయించుట[2]

మార్చు
 
విశిష్ట గురుత్వబుడ్డి/సాంద్రత బుడ్డి

ఇక్కడ విశిష్ట గురుత్వ బాటిలును ఉపయోగించి నూనె /కొవ్వు యొక్క విశిష్ట గురుత్వాన్ని నిర్ణయించడం వివరించడం జరిగింది. సాధారణంగా నూనెల విశిష్టగురుత్వాన్ని 300C/300C వద్ద నిర్ణయించెదరు. అనగా నూనె, నీటి ఉష్ణోగ్రతలు 300C వుండగా విశిష్టగురుత్వం నిర్ణయించడం. అయితే కొవ్వులు ఈ ఉష్ణోగ్రత వద్ద ఘన లేదా అర్దఘనరూపంలో వుండును.అందుచే వీటి విశిష్టగురుత్వాన్ని 950C/300C వద్ద లెక్కించెదరు. అనగా కొవ్వు ఉష్ణోగ్రత 950Cవద్ద, నీటి ఉష్ణోగ్రత 300C వద్ద వుండగా నిర్ణయించడం.

పరికరాలు

మార్చు

1. స్పెసిఫిక్ గ్రావిటి బాటిల్‍: 50 మి.లీ.ఘనపరిమాణం వుండాలి. నునుపైన లోపలి మూతి అంచులను కలిగి వుండాలి. బిరడా (stopper) పొడవుగా వుండి మధ్యలో సన్నని రంధ్రం కలిగి వుండాలి.[3]

2. వాటరు బాత్: 300C, మరియు950C ల వద్ద ఉష్ణోగ్రతను కావల్సిన మేరకు నియంత్రణలో వుంచులా అమరిక ఉంది.

3. గాజు థర్మామిటరు: ఇది 0-1100C ఉష్ణోగ్రతను కొలవ గలిగినది, 0.1, 0.20C లను కూడా చూపగలిగే విధంగా విభజన రేఖలుండాలి.

4. ఎనలైటికల్ బాలెన్సు: ,200 గ్రాం.లను తూచగలిగినది, 0.01మి, గ్రాం.వరకు కచ్చితంగా భారాన్ని తూచగలిగినది.

స్పెసిఫిక్ బాటిల్‍లో పట్టు నీటిభారం (300Cవద్ద):

మార్చు

శుభ్రంగా, పొడిగా వున్న 50 మి.లీ.ల స్పెసిఫిక్ బాటిల్ ను తీసికొని, బిరడాతో సహా తూచి దాని భారాన్ని నమోదు చేయాలి. తాజాగా వేడి చేసిన శుభ్రమైన 250Cఉష్ణోగ్రత వున్న నీటిని బాటిల్ నిండి పొర్లి పోయేలా నింపాలి. నింపునప్పుడు బుడగలు లేని విధంగా బాటిల్ లో నింపాలి. బాటిల్ మూతికి బిరడాను బిగించాలి. బాటిల్ బయటి వైపున వున్న తేమను శుభ్రమైన పొడి గుడ్డ తీసికొని తుడచవలెను. ఇప్పుడు స్పెసిఫిక్ బాటిల్‍ను వాటరు బాత్ మీద వుంచి 300C వద్ద బాటిల్ ను కొద్దిసేపు వేడిచెయ్యాలి. స్పెసిపిక్ బాటిల్ లోని నీరు ఉష్ణోగ్రత వలన వ్యాకొచించి, బాటిల్ బిరడాకున్న సన్ననిరంధ్రం ద్వారా బయటకు వచ్చును. బయటకు వచ్చిన నీటిని గుడ్దటో తుడచి శుభ్రం చేయాలి. స్పెసిఫిక్ బాటిల్ ను వాటరుబాత్ నుండి తీసి గది ఉష్ణోగ్రతకు చల్లార్చాలి. ఇప్పుడు స్పెసిఫిక్ బాటిల్ ను నీటితో సహా తూచి భారాన్ని నమోదు చేయాలి. ఈ నీటిభారం విలువ ఈ బాటిల్ కు స్దిరనీటి భారం. ఈ బాటిల్ ను ఉపయోగించి విశిష్ట గురుత్వం నిర్ణయించుటకు మాటిమాటికి నీటి భారాన్ని తూచకుండ ఈ భారాన్నె లెక్కలోకి తీసుకోవచ్చును. కాని అప్పుడప్పుడు భారంలో తేడా ఎమైన వచ్చినదేమో చెక్ చేసుకోవాలి.

ప్రయోగ విధానం

మార్చు

స్పెసిఫిక్ బాటిల్ లో శుభ్రమైన, నలకలు లేని 250Cవరకు చల్లార్చిన నూనెను, (కొవ్వు (fat) లయినచో అవి కరుగు వరకు వేడిచేసి) స్పెసిఫిక్ బాటిలునిండి పొర్లిపోయెలా నింపాలి. బిరడాని బిగించాలి.బాటిల్ బయటకు పొరలి పొయ్యి బాటిలు బయటి గోడ అంచుకు వున్న నూనెను పొడి బట్టతో శుభ్రంగా తుడచి తొలగించెవలెను. బాటిల్ను వాటరు బాత్ మీద వుంచి నూనె అయ్యినచో 300C వరకు కొవ్వు అయినచో 950C వరకు అరగంట సేపు వేడిచేయాలి. వ్యాకొచించి బిరడా రంధ్రం ద్వారా బయటకు వచ్చిన నూనెను తుడచి బాటిల్ ను శుభ్రం చేయాలి. గదిఉష్ణోగ్రతకు బాటిలును చల్లార్చి, తూచి భారాన్ని నమోదు చెయ్యాలి.

విశిష్టగురుత్వం:కొంత నిర్ణిత ఉష్ణోగ్రతవద్ద, ఒక నిర్ధిష్ట ఘనపరిమాణం వున్న ఒకద్రవం యొక్క భారాన్ని అంతే ఘనపరిమాణమున్న నీటి భారంతో భాగహారించుట[3]

నూనె విశిష్ట గురుత్వం 300C/300C వద్ద

 

వివరణ

A=గ్రావిటి బాటిల్+నూనె భారం, గ్రాం.లలో,300Cవద్ద

B=ఖాళి గ్రావిటి బాటిల్ భారం, గ్రాం.లలో

C=గ్రావిటి బాటిల్+నీటిభారం, గ్రాం.లలో,300Cవద్ద.

నూనె /కొవ్వువిశిష్ట గురుత్వం 95C/300C వద్ద

 

వివరణ A=గ్రావిటి బాటిల్+నూనె/కొవ్వు భారం, గ్రాం.లలో,950Cవద్ద

B=ఖాళి గ్రావిటి బాటిల్ భారం, గ్రాం.లలో

C=గ్రావిటి బాటిల్+నీటిభారం, గ్రాం.లలో,300Cవద్ద.

0.000025=గాజు వ్యాకోచ గుణకం

మూలాలు/ఆధారాలు

మార్చు

  1. http://in.ask.com/web?q=Specific+Gravity+of+Liquids&qsrc=466&o=10001189&l=sem&qo=relatedSearchNarrow
  2. Determination ofspecificgravity,IS:548(partI)-1964,pageNO>39
  3. 3.0 3.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-01-25. Retrieved 2013-10-29.
  • B.S.684:1958 Methods of Anylysis Of Oils And Fats.British Standards Institution.