విశ్వనాథ పావని శాస్త్రి

శ్రీ విశ్వనాథ పావని శాస్త్రి, కవిసామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి కుమారుడు. పావని శాస్త్రి గారు తండ్రి అంత కాకపోయినా, పండిత పుత్రుడన్న అపవాదు పడకుండా చూసుకున్నారు. ఈయన స్వంతంగా కొన్ని కథలు వ్రాశారు. తన తండ్రి వ్రాసిన చెలియలకట్ట అన్న నవలకు రేడియో అనుసరణ వ్రాశారు.