విశ్వనాథ సాహిత్య అకాడమీ
విశ్వనాథ సాహిత్య అకాడమీ గుంటూరు కేంద్రంగా పని చేస్తున్న సాహితీ, సాంస్కృతిక సంస్థ. ఈ సంస్థ మంచి సాహిత్య గ్రంథాలను ప్రచురించడం, కళా ప్రదర్శనలు నిర్వహించడం, ఏడాదికొకసారి కళారంగానికి సంబంధించిన వ్యక్తులకు విద్యాసుందరి బెంగుళూరు నాగరత్నమ్మ స్మారక పురస్కారం, విశ్వనాథ సంస్కృతి పురస్కారం అందచేస్తుంది.[1]
పుస్తక ప్రచురణ
మార్చు- సెప్టెంబర్ 2019 లో శ్రీరమణ దీర్ఘ కథ నాలుగో ఎకరం ప్రచురణ
పురస్కార గ్రహీతలు
మార్చువిద్యాసుందరి బెంగుళూరు నాగరత్నమ్మ పురస్కారం ఒక సంవత్సరం నాట్యంలో, తరువాత సంవత్సరం సాహిత్యంలో, తరువాత సంవత్సరం సంగీతంలో ప్రదానంచేస్తారు. కారణం ఆమెకి ఈ మూడు రంగాలలో ప్రవేశం ఉండటం. జానపద కళాకారులకు విశ్వనాథ సంస్కృతి పురస్కారం అందిస్తారు.
విద్యాసుందరి బెంగుళూరు నాగరత్నమ్మ పురస్కారం
మార్చు- 2017 - నాట్య రంగం - కళావంతుల నాట్య శైలిలో ప్రతిభావంతురాలైన డా. యశోదా ఠాకోర్, హైదరాబాద్
- 2018 - సాహిత్య రంగం - నాటక,సాహిత్య, నాట్య, జానపద కళా పరిశోధకులు ప్రొఫెసర్ మొదలి నాగభూషణశర్మ
- 2019 - సంగీత రంగం - గుంటూరులో త్యాగరాజ ఆరాధన సంఘం స్థాపించి గుంటూరులో శాస్త్రీయ సంగీత అభిరుచి ఇనుమడింపచేసిన శ్రీ బుర్రా సీతారామశాస్త్రి
- 2020 - నాట్య రంగం - కథక్ నృత్య కళాకారిణి శరథిని గోలే
- 2021 - సాహిత్య రంగం - రసమయి పత్రిక సంపాదకులు, నండూరి పార్థసారథి
విశ్వనాథ సంస్కృతి పురస్కారం
మార్చు- 2019 లో తూర్పు భాగవతం కళాకారుడు బొంతలకోటి సాంబమూర్తి, కోమటిపల్లి (బొబ్బిలి వద్ద).
- 2020 లో తోలుబొమ్మలాట కళాకారుడు తోట బాలకృష్ణ.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "విశ్వనాథ సాహిత్య అకాడమీ కార్యక్రమాలు". ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతి. 27 Jan 2020. Retrieved 26 March 2020.