విష్ణుమాయా నాటకం

అయిదు అశ్వాసాలు ఉంటాయి. ఈ కావ్యం ఎవరు రచించారన్న దాని మీద స్పష్టత లేదు. ఇందులో హీరో పుండరీకుడు. అతను విష్ణు మాయ లో పడి ఒక బోయ దానిని పెళ్ళి చేసుకుని సంసార బాధ్యతలలో పడి పామరుడై జీవనము సాగిస్తాడు. విష్ణు మాయ నాటకము ప్రతులు దొరకు స్థలములు; 1) కాకినాడ ఆంధ్ర సాహితీ పరిషత్తు కార్యాలయము, 2) మద్రాసు ప్రాచ్య లిఖిత భాండాగారము, 3) మద్రాసు యూనివర్సిటీ గ్రంథాలయము ఈ కావ్యమును చింతలపూడి ఎల్లనార్యుడు కానీ, మడికి అనంతయ్య కానీ రచించి ఉంటారని చరిత్ర కారుల అభిప్రాయము. చింతల పూడి ఎల్లనార్యుడు మలి రాయల యుగం లోని వాడు. కృష్ణదేవరాయలు ఇతనికి ‘రాదా మాధవ కవి’ అనే బిరుదుని ఇచ్చాడు. ఇతన విష్ణు మాయా నాటకాన్ని రచించి ఉంటాడని ఒక వాదన ఉంది. అయితే గ్రంథం లోని ఆతరంగిక సాక్ష్యాల వలన ఇది మడికి అనంతయ్య రచన అయిఉండవచ్చు అనే వాదన కూడా బలంగా ఉంది. విష్ణు మాయా నాటకంలో గోదావరి వర్ణన చర్చా ఉన్నాయి అయితే చింతల పూడి ఎల్లనార్యుడు రాయలసీమ ప్రాంతాల వాడు. మడికి అనంతయ్య ఈ ప్రాంతం వాడే కనుక ఇతనే దీనిని రాసిఉంటారా అనే మీమాంస ఉంది.