గోదావరి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
గోదావరి నది భారతదేశంలో గంగ, సింధు తరువాత అతి పెద్ద నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి,నిజామాబాదు జిల్లా రెంజల్ మండలం కందకూర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు,కరీంనగర్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలం దిగువన ఆంధ్ర ప్రదేశ్ లోనికి ప్రవేశించి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల గుండా ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళా ఖాతములో సంగమిస్తుంది. గోదావరి నది మొత్తం పొడవు 1465 కిలోమీర్లు [4]. ఈ నది ఒడ్డున చాలా ప్రఖ్యాత పుణ్యక్షేత్రములు, పట్టణములు ఉన్నాయి. భద్రాచలము, రాజమహేంద్రవరం వంటివి కొన్ని. ధవళేశ్వరం దగ్గర అఖండ గోదావరి (గౌతమి) ఏడు పాయలుగా చీలుతుంది. అది గౌతమి, వశిష్ఠ, వైనతేయ, ఆత్రేయ, భరద్వాజ, తుల్యభాగ, కశ్యప. ఇందులో, గౌతమి, వశిష్ఠ, వైనతేయలు మాత్రమే ప్రవహించే నదులు. మిగిలినవి అంతర్వాహిని లు. ఆ పాయలు సప్తర్షుల పేర్ల మీద పిలువబడుతున్నాయి.
గోదావరి | |
దక్షిణ గంగ | |
River | |
The Mouth of the Godavari river (East) emptying into the Bay of Bengal.
| |
దేశం | భారతదేశం |
---|---|
రాష్ర్టాలు | మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్ ఘడ్, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి (యానాం) |
Region | దక్షిణ , పశ్చిమ భారతదేశం |
ఉపనదులు | |
- ఎడమ | పూర్ణా నది, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, తాలిపేరు, వెయిన్ గంగా, పెంగంగా, వర్ధ, దుధన |
- కుడి | ప్రవర, మంజీరా, పెద్దవాగు, మన్నేరు, కిన్నెరసాని |
Cities | నాసిక్, నాందేడ్, నిజామాబాద్, రాజమహేంద్రవరం |
Source | |
- స్థలం | త్రయంబకేశ్వర్,మహారాష్ట్ర, నాసిక్, మహారాష్ట్ర, ఇండియా |
- ఎత్తు | 920 m (3,018 ft) |
- అక్షాంశరేఖాంశాలు | 19°55′48″N 73°31′39″E / 19.93000°N 73.52750°E |
Mouth | |
- location | అంతర్వేది వద్ద బంగాళాఖాతము, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్, ఇండియా |
- ఎత్తు | 0 m (0 ft) |
- coordinates | 17°0′N 81°48′E / 17.000°N 81.800°E [1] |
పొడవు | 1,465 km (910 mi) |
పరివాహక ప్రాంతం | 3,12,812 km2 (1,20,777 sq mi) |
Discharge | |
- సరాసరి | 3,505 m3/s (1,23,778 cu ft/s) [2] |
Discharge elsewhere (average) | |
- పోలవరం (1901-1979) | 3,061.18 m3/s (1,08,105 cu ft/s) [3] |
గోదావరి నది ఇతిహాసంసవరించు
పూర్వము బలి చక్రవర్తిని శిక్షించేందుకు శ్రీ మహావిష్ణువు వామనావతారం ఎత్తి మూడడుగుల స్థలం కావాలని అడుగగా బలి చక్రవర్తి మూడడుగులు ధారపోసాడు. మహావిష్ణువు ఒక అడుగు భూమి పైన, రెండో అడుగు ఆకాశం పైన, మూడో అడుగు బలి తలపై పెట్టి పాతాళం లోకి త్రొక్కి వేస్తాడు. భూమండలం కనిపించకుండా ఒక పాదం మాత్రమే కనిపించడంతో చతుర్ముఖ బ్రహ్మ కమండలం లోని నీటిలో సమస్త తీర్థాలను ఆవాహన చేసి ఆ ఉదకంతో శ్రీ మహావిష్ణువు పాదాలను అభిషేకించి, మహావిష్ణువును శాంతింపజేస్తాడు. అందువల్లనే గంగను విష్ణుపాదోద్భవి గంగా అని పిలుస్తారు. అలా పడిన గంగ పరవళ్ళు త్రొక్కుతుంటే శివుడు తన జటాజూటంలో బంధిస్తాడు. పరమశివుడిని మెప్పించి భగీరథుడు తన పితామహులకు సద్గతులను కలగజేయడానికి గంగను, గోహత్యాపాతకనివృత్తి కోసం గౌతమ మహర్షి గోదావరిని భూమికి తీసుకొని వస్తారు.
ఒకానొకప్పుడు దేశంలో క్షామం ఏర్పడి కరువుతో తినడానికి తిండి లేకుండా ఉన్న సమయంలో గౌతమ మహర్షి తన తపోశక్తితో తోటి ఋషులకు, వారి శిష్యులకు కరువు నుండి విముక్తి కలిగించి అన్నపానాలు దొరికే ఏర్పాటు చేశాడు. అప్పుడు ఆ ఋషులు తమకు లేని తపోశక్తులు గౌతమునికి ఉన్నాయని ఈర్ష్యతో ఒక మాయ గోవును పంపి గౌతముడి పాడిపంటలు నాశనం చేయించారు. గౌతముడు ఒక దర్భతో ఆ గోవును అదలించగా అది మరణించింది. గౌతముడు తాను చేసిన గోహత్యాపాతకం నివృత్తి కోసం శివుడిని మెప్పించి గంగను భూమి మీదకు తెప్పించాడు ఆ గంగయే గోదావరి లేదా గౌతమీ నది. ఈ నదిని ఆ చనిపోయిన గోవు మీద నుండి ప్రవహింపజేసి తన గోహత్యాపాతకాన్ని విముక్తి చేసుకొన్నాడు. ఆ గోవుకి స్వర్గప్రాప్తి కలిగింది. ఆ స్థలమే గోష్పాద క్షేత్రం. ఈ క్షేత్రమే ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు పట్టణం.
పుష్కరాలుసవరించు
దేశంలో ప్రతీ జీవ నదికీ పుష్కరం ఉన్నట్లే, గోదావరికి కూడా పుష్కరం ఉంది. పంచాంగము ప్రకారం గురుడు సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు గోదావరికి పుష్కరం వస్తుంది. 2015, జూలై నెలలో గోదావరికి మహాపుష్కరం వచ్చింది.
(పూర్తి వ్యాసం కొరకు గోదావరి నది పుష్కరము చూడండి)
ఉప నదులుసవరించు
గోదావరి నది యొక్క పరీవాహక ప్రాంతము 3,13,000 చదరపు కిలోమీటర్ల మేర మహారాష్ట్ర, తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, ఒడిషా రాష్ట్రాలలో వ్యాపించి ఉంది. ఈ నది యొక్క ప్రధాన ఉపనదులు:
- వైన్గంగా
- పెన్ గంగ
- వార్ధా నది
- మంజీరా నది
- ఇంద్రావతి నది
- బిందుసార
- శబరి నది
- ప్రవర
- ఫూర్ణా
- ప్రాణహిత: ఈ నది ప్రాణహిత వన్యప్రాణుల అభయారణ్యం మీదుగా ప్రవహిస్తోంది. ఇది మంచిర్యాల పట్టణానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది.[5][6]
గోదావరి నదిపై ప్రాజెక్టులుసవరించు
గోదావరి ఒడ్డున ఉన్న ముఖ్య పట్టణాలుసవరించు
మహారాష్ట్రసవరించు
తెలంగాణసవరించు
ఆంధ్రప్రదేశ్సవరించు
పాండిచ్చేరిసవరించు
గోదావరి ఒడ్డున వెలసిన పుణ్య క్షేత్రాలుసవరించు
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో గోదావరిచూడండి. |
గోదావరి ప్రాంతపు కవులుసవరించు
తెలుగులో తొలి కావ్యరచన కాలం నుండి గోదావరి ప్రాంతంలో అనేకమంది కవులు చాలా కావ్యాలను రచించారు. వీరిలో ఎక్కువమంది ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవాళ్ళు. ప్రాచీనకాలం నుండి 1980 ప్రాంతం వరకు గోదావరి ప్రాంతంలో వెలసిన కవులీ వ్యాసంలో పేర్కొన్నారు:[7]
- అల్లమరాజు వేంకటకవి
- అవసరాల పద్మరాజు
- అనివిళ్ళ వేంకటశాస్త్రి
- ఈదులపల్లి భవాని శంకరకవి
- ఎర్రమిల్లి సూర్యప్రకాశ కవి
- ఏనుగు లక్ష్మణకవి
- ఏనుగు లత్సకవి
- ఓగిరాల జగన్నాథ కవి
- ఓగిరాల రంగనాథ కవి
- కూచిమంచి జగ్గకవి
- కూచిమంచి తిమ్మకవి
- కూచిమంచి వేంకటరాయుడు
- కొడిచెర్ల శ్రీనివాసకవి
- కొత్తలంక మృత్యుంజయకవి
- చెళ్ళపిళ్ళ నరసకవి
- జగన్నాథ పండితరాయలు
- తామరపల్లి తిమ్మయ్య
- దామరాజు లక్ష్మీనారాయణ
- దిట్టకవి వేంకటామాత్యుడు
- నడిమింటి సర్వమంగళేశ్వరశాస్త్రి
- నింబార్కుడు
- నిట్టల ప్రకాశాదాసు
- నూతనకవి సూరన్న
- పట్టమట్ట సరస్వతీ సోమయాజి
- పిండిప్రోలు లక్ష్మణ కవి
- భాస్కరాచార్యులు
- మల్లికార్జున పండితుడు
- మిక్కిలి మల్లికార్జున కవి
- ములపాక బుచ్చన్న శాస్త్రి
- యథావాక్కుల అన్నమయ్య
- రేకపల్లి సోమనాథకవి
- వంకాయలపాటి వేంకటకవి
- నారాయణతీర్థులు
- చిర్రావూరి కామేశ్వరరావు
ఇవి కూడా చూడండిసవరించు
మూలాలుసవరించు
- ↑ మూస:GEOnet2
- ↑ Kumar, Rakesh; Singh, R.D.; Sharma, K.D. (2005-09-10). "Water Resources of India" (PDF). Current Science. Bangalore: Current Science Association. 89 (5): 794–811. Retrieved 2013-10-13.
- ↑ "Sage River Database". Archived from the original on 2010-06-21. Retrieved 2011-06-16.
- ↑ Eenadu special edition, 12 July, 2015
- ↑ ఈనాడు, తెలంగాణ (12 November 2017). "ప్రకృతి ఒడిలో వన్యప్రాణులు". Archived from the original on 22 ఏప్రిల్ 2020. Retrieved 22 April 2020. Check date values in:
|archivedate=
(help) - ↑ సాక్షి, ఎడ్యుకేషన్ (30 August 2016). "వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు". Sakshi. Archived from the original on 22 ఏప్రిల్ 2020. Retrieved 22 April 2020. Check date values in:
|archivedate=
(help) - ↑ గోదావరి ప్రాంతపు కవులు, డా. గల్లా చలపతి, మాతల్లి గోదావరి, పుష్కర ప్రత్యేక సంచిక, 2003, పేజీలు: 52-59.