వి.అనామిక
వి.అనామిక ప్రముఖ భారతీయ సమకాలీన కళాకారిణి. తమిళనాడులోని చెన్నైలో జన్మించిన ఆమె, ప్రముఖ ఆర్టిస్టు శ్రీ ఎస్.ధనపాల్ శిష్యురాలు అనామిక. చెన్నైలోని ప్రభుత్వ లలిత కళల కళాశాల నుండి 1999లో పెయింటింగ్, ప్రింట్ మేకింగ్ లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసింది ఆమె. తన సాంకేతిక నైపుణ్యాలు పెంచుకోవడం కోసం 2005లో చెన్నై ప్రభుత్వ మ్యూజియంలోని వస్తువుల సంరక్షణ చేసే కోర్సు చేసింది ఆమె. 2006లో ఆమె స్కాట్లాండ్లో ఈడెన్ బర్గ్ ప్రింట్ మేకర్స్ స్టూడియోలో జపనీస్ ఉడ్ బ్లాక్ పెయింటింగ్ నేర్చుకునేందుకు ఆర్టిస్ట్ స్కాలర్ గా వెళ్ళింది అనామిక.[1]
వి.అనామిక | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | అనామిక మార్చి 12, 1975 చెన్నై, తమిళనాడు |
వృత్తి | కళాకారిణి |
భాష | తమిళం, హింది, తెలుగు, ఇంగ్లీష్ |
జాతీయత | భారతీయురాలు |
పౌరసత్వం | భారతీయత |
విద్య | ఫైన్ ఆర్ట్స్ లో మాస్టర్ (చిత్రకళ, ప్రింటు మేకింగ్) |
పూర్వవిద్యార్థి | ప్రభుత్వ లలిత కళల కళాశాల, ఎగ్మోర్, చెన్నై |
విషయం | పెయింటింగ్, ప్రింట్ మేకింగ్ |
పురస్కారాలు | 55వ జాతీయ లలిత కళా అకాడమీ పురస్కారం ది చార్ల్స్ వాలెస్ ఇండియా ట్రస్టు పురస్కారం విజిటింగ్ ఆర్టిస్ట్ పురస్కారం-ఈడెన్ బర్గ్ ప్రింట్ మేకర్స్ స్టుడియో యువ కళాకారులకు లలిత కళా అకాడమీ వారు ఇచ్చే స్కాలర్ షిప్ యాలీ ఫౌండేషన్ వారి చే అవార్డ్ ఫర్ ఎక్సెలెన్స్ |
మూలాలు
మార్చు- ↑ "Edinburgh Printmakers - Buy Art Online, Art courses online and more". www.edinburghprintmakers.co.uk. Retrieved 2016-05-14.