వల్లోల్ల గంగాధర్ గౌడ్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, శాసనమండలి మాజీ సభ్యుడు. 2017-2023 వరకు తెలంగాణ శాసనమండలి సభ్యుడిగా ఉన్నాడు.

వి.గంగాధర్ గౌడ్
వి.గంగాధర్ గౌడ్


శాసన మండలి సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
30 మార్చి 2017 నుండి 29 మార్చి 2023
నియోజకవర్గం ఎమ్మెల్యే కోటా

వ్యక్తిగత వివరాలు

జననం 07 జులై 1951
రాంపూర్, డిచ్‌పల్లి మండలం, నిజామాబాదు జిల్లా, తెలంగాణ
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు గంగ గౌడ్, గంగమ్మ
నివాసం హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు
మతం హిందూ

జననం, విద్యాభాస్యం మార్చు

వుల్లోల్ల గంగాధర్‌ గౌడ్‌ 1951, జూలై 7న తెలంగాణ రాష్ట్రం, నిజామాబాదు జిల్లా , డిచ్‌పల్లి మండలం, రాంపూర్ గ్రామంలో గంగాగౌడ్, గంగమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన నిజామాబాద్ లోని గిరిరాజ్ ప్రభుత్వ కాలేజ్ లో 1973లో బీకామ్ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం మార్చు

గంగాధర్ గౌడ్ తెలుగు దేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1995 నుండి 2004 వరకు డీసీసీబీ జిల్లా అధ్యక్ష్యుడిగా పని చేశాడు. ఆయన 2011లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. కొంతకాలం నిజామాబాద్ జిల్లా టీడీపీఅధ్యక్షుడిగా పని చేశాడు.[1] 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పడక ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి అక్టోబర్ 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[2] ఆయన 2017లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[3] గంగాధర్ గౌడ్ 2017లో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శిగా నియమితుడయ్యాడు.[4]

మూలాలు మార్చు

  1. Sakshi (14 August 2014). "సమగ్ర కుటుంబ సర్వేపై ప్రజల్లో ఆందోళన". Sakshi. Archived from the original on 21 జూన్ 2021. Retrieved 21 June 2021.
  2. Sakshi (1 October 2014). "టీఆర్‌ఎస్‌లోకి తీగల!". Sakshi. Archived from the original on 11 మే 2021. Retrieved 11 May 2021.
  3. Sakshi (31 March 2017). "నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం". Archived from the original on 19 ఆగస్టు 2021. Retrieved 19 August 2021.
  4. Sakshi (10 October 2017). "67 మందితో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గం". Archived from the original on 12 జనవరి 2022. Retrieved 12 January 2022.