ఆంధ్రప్రదేశ్ శాసనమండలి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థలోని సభలలో ఎగువ సభ.[1] 1958 నుండి 1985 వరకు ఈ వ్యవస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉనికిలోవుంది. 2007 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరల ఉనికిలోకి వచ్చి, ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం కొనసాగుతున్నది.

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి
రకం
రకం
కాల పరిమితులు
శాశ్వత సభ, సభ్యుల పదవీకాలం 6 సంవత్సరాలు
నాయకత్వం
అధ్యక్షుడు
ఉపాధ్యక్షుడు
ప్రతిపక్ష నాయకుడు
నిర్మాణం
సీట్లు58 (50 ఎన్నుకోబడిన+ 8 సూచించబడిన)
రాజకీయ వర్గాలు
అధికార పక్షం లేక జట్టు (13)
 •   YSRCP (25)

ప్రధాన ప్రతిపక్షం లేక జట్టు (28)

ఇతరులు(10)

 •   PDF (4)
 •   BJP (1)
 •   IND (4)

నామినేటెడ్

 •   (8)

ఖాళీ (1)

 •   Vacant (1)
ఎన్నికలు
ఓటింగ్ విధానం
బదలాయించగల ఒక ఓటు
సమావేశ స్థలం
Andhra Pradesh Secreteriat.jpg
శాసనమండలి భవనం
అమరావతి, ఆంధ్రప్రదేశ్
వెబ్‌సైటు
http://www.aplegislature.org/web/legislative-council

చరిత్రసవరించు

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకే సభ ఉన్న పార్లమెంటరీ వ్యవస్థలో పనిచేసింది. 1956 డిసెంబరు 5 న ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఏర్పాటు చేయుటకు తీర్మానం చేసింది. ఈ వ్యవస్థ మూలంగా రెండు సభలు ఉంటాయి.[2] అధికారికంగా విధాన పరిషత్తు 1958 జూలై 1 న ప్రారంభించబడింది. ఈ ఏర్పాటు భారత రాజ్యాంగంలోని 168 అధికరణం మూలంగా జరిగింది. 1968 జూలై 8 న అప్పటి భారత రాష్ట్రపతి, రాజేంద్రప్రసాద్ ప్రారంభోత్సవం చేసాడు.[2]

రద్దులు, పునరుజ్జీవనాలుసవరించు

1985 రద్దుసవరించు

1980 వ దశకంలో, ఎగువ సభలను రద్దు చేయాలని కోరే రాష్ట్రాలలో మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ వుంది. ఇది జనాభా ప్రాతినిధ్యం లేనిదని, రాష్ట్ర బడ్జెట్ పై భారమని, చట్టం ఆమోదించడంలో జాప్యాలకు కారణమనే విమర్శలతో రద్దు కోరబడింది.[2][3][4][5] ఏదేమైనా అప్పటి పాలక పార్టీ తెలుగుదేశం రాజకీయ ప్రతిపక్షమైన భారత జాతీయ కాంగ్రెస్కు శాసన మండలిలో ఎక్కువ సీట్లు ఉండటంవల్ల చట్టాన్ని ఆలస్యం జరిగింది.[5]

ఆంధ్రప్రదేశ్ విధానసభ ఆమోదించిన తీర్మానం ప్రకారం, భారత పార్లమెంటు 1985 లో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి (నిర్మూలన) చట్టం ద్వారా విధాన పరిషత్‌ను రద్దు చేసింది.

2007 పునరుజ్జీవనముసవరించు

1989 లో రాష్ట్ర ఎన్నికలలో గెలిచిన కాంగ్రెస్ (ఐ) కు చెందిన ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి శాసన మండలిని పునరుద్ధరించడానికి తదుపరి ప్రయత్నాలు ప్రారంభించాడు.[2][5] శాసన మండలిని పునరుద్ధరించడానికి ఒక తీర్మానం 1990 జనవరి 22 న విధానసభలో ఆమోదించబడింది.[2]

1990 మే 28 న రాష్ట్ర విధానసభ తీర్మానం ప్రకారం, భారత పార్లమెంటు ఎగువ సభ (రాజ్యసభ)లో శాసన మండలి యొక్క పునరుద్ధరణకు అధికారమిచ్చిన శాసనం ఆమోదం పొందింది కానీ అర్ధంతరంగా 1991 లో లోక్‌సభ రద్దు కావటంతో నిలిచిపోయింది.[2] తరువాత వచ్చిన లోక్‌సభలు (1991–1996, 1996–1998, 1998–2004) ఈ విషయంపై ఎలాంటి చర్య తీసుకోలేదు.

2004 రాష్ట్ర ఎన్నికలలో విజయం సాధించిన తరువాత, కాంగ్రెస్ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ శాసన సభ జూలై 8, 2004 న శాసన మండలి పునరుద్ధరణకు మరొక తీర్మానాన్ని ఆమోదించింది.[2] ఇది 2004 డిసెంబరు 16 న ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ బిల్‌గా లోక్‌సభలో ప్రవేశపెట్టబడింది. 2006 డిసెంబరు 15 న లోక్‌సభ శాసనసభ ఆమోదం, డిసెంబరు 20 న రాజ్యసభ ఆమోదం పొంది, 2007 జనవరి 10 న రాష్ట్రపతి ఆమోదం పొందింది.[2] నూతనంగా పునరుద్ధరించబడిన శాసన మండలి 2007 మార్చి 30 న ఏర్పాటు చేయబడింది, ఏప్రిల్ 2 న అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ రామేశ్వర్ ఠాకూర్ చేత ప్రారంభించబడింది.[2]

2020 రద్దు ప్రయత్నంసవరించు

ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణకు సంబంధించిన రెండు బిల్లులను శాసనసభ ఆమోదం తర్వాత, శాసనమండలి ఎంపికచేసిన శాసనమండలి సభ్యుల సభకు నిశిత పరిశీలనకొరకు పంపాలని నిర్ణయించింది. దీనిని వ్యతిరేకించిన జగన్ ప్రభుత్వం శాసనసభలో శాసనమండలి రద్దు బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లు పై చర్చకు తెదేపా హాజరుకాలేదు. జనసేన శాసనసభ్యుడు అంగీకారం తెలపటంతో 133-0 ఆధిక్యంతో ఆమోదం పొందింది. As of 2020-01-28, ఈ బిల్లు కేంద్రం మంత్రి మండలి ముందుకు వచ్చింది.[6]

హోదా, ప్రస్తుత సభ్యులుసవరించు

కౌన్సిల్ చేత ఎన్నుకోబడిన చైర్‌పర్సన్, కౌన్సిల్ యొక్క సెషన్లకు అధ్యక్షత వహిస్తారు. చైర్‌పర్సన్ అందుబాటులోకి లేని సమయంలో సభను నిర్వహించడానికి డిప్యూటీ చైర్‌పర్సన్ ను కూడా ఎన్నుకుంటారు.

సభ్యత్వం , పదవీకాలంసవరించు

శాసన మండలి శాశ్వత సభ.[2] ఇందులో 58 మంది సభ్యులు ఉంటారు. సభ్యుల సాధారణ కాలపరిమితి ఆరుసంవత్సరాలు. అందులో 1/3 వంతు మంది ప్రతీ రెండు సంవత్సరాలకు సభ్యత్వం పూర్తి చేసుకుంటారు. కొత్త సభ్యులు ఎన్నికవుతారు.[2] శాసనమండలి సభ్యుడు కాదలచిన వ్యక్తి భారత పౌరసత్వం కలిగి ఉండాలి. కనీసం 30 ఏళ్ళ వయసు ఉండాలి. మానసికంగా ఆరోగ్యం కలిగి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ లో ఓటు హక్కు కలిగి ఉండాలి. అతడు/ఆమె అదే కాలంలో పార్లమెంటు సభ్యునిగా ఉండరాదు.

20 మంది సభ్యులు శాసనసభ్యుల ద్వారా, 20 మంది సభ్యులు అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల సముదాయం ద్వారా, 10 మంది సభ్యులు పట్టభద్రులు, ఉపాధ్యాయుల నుండి ఎన్నుకోబడతారు . ఆంధ్రప్రదేశ్ గవర్నరు ద్వారా 8 మంది సభ్యులు నామినేట్ చేయబడతారు. [7]

ఎన్నికల ఫలితం నిర్ణయంసవరించు

ఎన్నికలలో అభ్యర్ధులను ప్రాధాన్యతను ఓటరు సూచించాలి. ఎన్నికల ఫలితం నిర్ణయం ప్రక్రియ క్రిందివిధంగా వుంటుంది. ఓటులో దోషమున్న వాటిని బ్యాలెట్ పెట్టెల నుంచి వేరు చేస్తారు. పోటీ చేసిన అభ్యర్థుల్లో ఎవరికీ తొలి ప్రాధాన్య ఓటు పడకపోయినా దాన్ని కూడా చెల్లనిదిగానే పరిగణిస్తారు. చెల్లుబాటైన వాటిల్లో తొలి ప్రాధాన్య ఓట్లు 50 శాతం కన్నా ఒక్కటి ఎక్కువగా వచ్చినా ఆ అభ్యర్థి విజయం సాధించినట్లు. అలా జరగక పోతే వాటిలో అతి తక్కువ తొలి ప్రాధాన్య ఓట్లు వచ్చిన అభ్యర్థిని తొలగిస్తారు. ఆ అభ్యర్థి తొలి ప్రాధాన్యంగా వున్న బ్యాలెట్‌ పత్రంలో రెండో ప్రాధాన్య ఓట్లు ఎవరికి పడ్డాయో గుర్తించి ఆయా అభ్యర్థులకు వాటిని బదలాయిస్తారు. అప్పుడు ఎవరైనా అభ్యర్థికి 50 శాతం కంటే ఒక్కటి అధికంగా వచ్చితే వారు గెలిచినట్లు. అప్పుడు కూడా 50 శాతం కంటే ఒక్క ఓటైనా ఎవరికి ఎక్కువ రాకుంటే, తొలి ప్రాధాన్య ఓట్లు తక్కువగా వచ్చిన రెండో అభ్యర్థిని తొలగిస్తారు. ఆ అభ్యర్థి తొలి ప్రాధాన్యంగా వున్న బ్యాలెట్‌ పత్రంలో ఆ అభ్యర్ధి రెండో ప్రాధాన్య ఓట్లను, మొదట తొలగించిన అభ్యర్థికి వచ్చిన మూడో ప్రాధాన్య ఓట్లను మిగతా అభ్యర్థులకు కలుపుతారు. అలా ఒకరికైనా 50 శాతం కంటే ఒక్క ఓటైనా అధికంగా వచ్చేంతవరకూ లెక్కింపు కొనసాగించి ఫలితం ప్రకటిస్తారు. [8]

శాసన మండలి సభ్యులుసవరించు

శాసనసభ సభ్యుల ప్రాతినిధ్యంసవరించు

20 మంది శాసససభ్యులచే ఎన్నుకోబడతారు. 4 సీట్లు ఖాళీగా వున్నవి.

పేరు ఎన్నికైన పార్టీ కాలం
యనమల రామకృష్ణుడు తె.దే.పా 2019 - 2025
పర్చూరి అశోక్ బాబు తె.దే.పా 2019 - 2025
దువ్వారపు రామారావు తె.దే.పా 2019 - 2025
బెందుల తిరుమల నాయుడు తె.దే.పా 2019 - 2025
వట్టికూటి వీరవెంకన్న చౌదరి తె.దే.పా 2019 - 2025
షేక్ మహమ్మద్ ఇక్బాల్ వై.ఎస్.ఆర్.కా.పా 30 మార్చ్ 2021 - 29 మార్చ్ 2027
పెన్మత్స సురేష్‌ బాబు వై.ఎస్.ఆర్.కా.పా 17 ఆగష్టు 2020 - 2023
నారా లోకేశ్ తె.దే.పా 2017 - 2023
గంగుల ప్రభాకర్ రెడ్డి వై.ఎస్.ఆర్.కా.పా 30 మార్చి 2017 - 29 మార్చి 2023
జంగా కృష్ణమూర్తి వై.ఎస్.ఆర్.కా.పా 2019 - 2025
పోతుల సునీత[9] వై.ఎస్.ఆర్.కా.పా 2020 - 2026
బచ్చుల అర్జునుడు తె.దే.పా 30 మార్చి 2017 - 29 మార్చి 2023
డొక్కా మాణిక్యవరప్రసాద్[10] వై.ఎస్.ఆర్.కా.పా 14 ఆగస్ట్ 2020 - 29 మార్చి 2023
చల్లా భగీరథరెడ్డి వై.ఎస్.ఆర్.కా.పా 26 ఫిబ్రవరి 2021 - 29 మార్చి 2023
సి.రామచంద్రయ్య వై.ఎస్.ఆర్.కా.పా 30 మార్చ్ 2021 - 29 మార్చ్ 2027
దువ్వాడ శ్రీనివాస్ వై.ఎస్.ఆర్.కా.పా 30 మార్చ్ 2021 - 29 మార్చ్ 2027
పాలవసల విక్రాంత్ వై.ఎస్.ఆర్.కా.పా 30 మార్చ్ 2021 - 29 మార్చ్ 2027
దేవసాని చిన్న గోవిందరెడ్డి వై.ఎస్.ఆర్.కా.పా 30 మార్చ్ 2021 - 29 మార్చ్ 2027
ఇసాక్‌ బాషా వై.ఎస్.ఆర్.కా.పా 30 మార్చ్ 2021 - 29 మార్చ్ 2027
బల్లి కళ్యాణ్ చక్రవర్తి వై.ఎస్.ఆర్.కా.పా 30 మార్చ్ 2021 - 29 మార్చ్ 2027

స్థానిక సంస్థలుసవరించు

స్థానిక సంస్థలకు 20 సీట్లున్నాయి. మూడు సీట్లు ఖాళీగావున్నాయి.

జిల్లా పేరు ఎన్నికైన పార్టీ కాలం
చిత్తూరు కృష్ణ రాఘవ జయేంద్ర భరత్ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 2021 - 2027
తూర్పు గోదావరి చిక్కాల రామచంద్రరావు తె.దే.పా 2017 - 2023
తూర్పు గోదావరి అనంత ఉదయభాస్కర్ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 2021 - 2027
కృష్ణా తలశిల రఘురాం వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 2021 - 2027
కృష్ణా మొండితోక అరుణ్ కుమార్ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 2021 - 2027
ప్రకాశం తూమాటి మాధవరావు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 2021 - 2027
విశాఖపట్నం వరుదు కల్యాణి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 2021 - 2027
విశాఖపట్నం వంశీకృష్ణ శ్రీనివాస్‌ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 2021 - 2027
విజయనగరం ద్వారపురెడ్డి జగదీశ్వరరావు తె.దే.పా 2015 - 2021
విజయనగరం ఇందుకూరి రఘురాజు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 2021 - 2027
పశ్చిమ గోదావరి అంగర రామమోహన్ తె.దే.పా 2015 - 2021
అనంతపురం జి.దీపక్ రెడ్డి తె.దే.పా 2017 - 2023
అనంతపురం
చిత్తూరు బి.ఎన్.రాజసింహులు తె.దే.పా 2017 - 2023
గుంటూరు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 2017 - 2023
గుంటూరు మురుగుడు హనుమంతరావు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 2021 - 2027
కడప మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి (బీటెక్‌ రవి) తె.దే.పా 30 మార్చి 2017 - 29 మార్చి 2023
కర్నూలు కె.ఇ.ప్రభాకర్ [11] తె.దే.పా 2018 - 2024
నెల్లూరు వాకాటి నారాయణ రెడ్డి తె.దే.పా 2017 - 2023
శ్రీకాకుళం శత్రుచర్ల విజయరామరాజు తె.దే.పా 2017 - 2023
పశ్చిమ గోదావరి మంతెన వెంకట సత్యనారాయణ రాజు తె.దే.పా 2017 - 2023

పట్టభద్రులుసవరించు

జిల్లా పేరు ఎన్నికైన పార్టీ కాలం
పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి ఇళ్ల వెంకటేశ్వరరావు పి.డి.ఎఫ్ 2019 - 2025
కృష్ణా జిల్లా, గుంటూరు కలగర సాయి లక్ష్మణరావు పి.డి.ఎఫ్ 2019 - 2025
శ్రీకాకుళం జిల్లా, విజయనగరం, విశాఖపట్నం పి.వి.ఎన్.మాధవ్ బి.జె.పి 2017 - 2023
ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు యండవల్లి శ్రీనివాసులు రెడ్డి పి.డి.ఎఫ్ 2019 - 2025
అనంతపురం, కర్నూలు, కడప వెన్నపూస గోపాల్ రెడ్డి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 30 మార్చి 2017 - 29 మార్చి 2023

ఉపాధ్యాయులుసవరించు

5 సీట్లు ఉపాధ్యాయ ప్రతినిధులకున్నాయి.

జిల్లా పేరు ఎన్నికైన పార్టీ కాలం
శ్రీకాకుళం జిల్లా, విజయనగరం, విశాఖపట్నం పాకలపాటి రఘువర్మ స్వతంత్ర 2019 - 2025
పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి షేక్‌ సాబ్జీ[12] యు.టి.ఎఫ్ 2021-2027
కృష్ణా, గుంటూరు టి.కల్పలత[13] స్వతంత్ర 2021-2027
ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు విఠపు బాలసుబ్రహ్మణ్యం పి.డి.ఎఫ్ 2017 - 2023
అనంతపురం, కర్నూలు, కడప కత్తి నరసింహారెడ్డి స్వతంత్ర 30 మార్చి 2017 - 29 మార్చి 2023

నామినేటెడ్సవరించు

ఈ వర్గంలో ఎనిమిది సీట్లున్నాయి.

పేరు నామినేట్ చేసిన పార్టీ కాలం
పండుల రవీంద్రబాబు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 2020 - 2026
జకియా ఖానమ్‌ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 2020 - 2026
తోట త్రిమూర్తులు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 2021 - 2027
కొయ్యే మోషేన్‌రాజు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 2021 - 2027
రాజగొల్ల రమేశ్ యాదవ్ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 2021 - 2027
ఎన్.ఎం.డి. ఫరూఖ్ తె.దే.పా 2017 - 2023
చదిపిరాళ్ల శివనాథ రెడ్డి [14] వై.ఎస్.ఆర్.కా.పా 08 మార్చి 2019 - 29 మార్చి 2023
పామిడి శమంతకమణి[15] వై.ఎస్.ఆర్.కా.పా 2019-2025

చైర్మన్లుసవరించు

మాజీ శాసనమండలి సభ్యులుసవరించు

ఇవికూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

 1. "legislative council, Andhrapradesh". AP Government. Retrieved 11 June 2019.
 2. 2.00 2.01 2.02 2.03 2.04 2.05 2.06 2.07 2.08 2.09 2.10 "Andhra Pradesh Legislative Council History". National Informatics Centre. Retrieved 2010-09-03.
 3. Sharma. Introduction to the Constitution of India, Fifth Edition. PHI Learning Pvt. Ltd. pp. 212–13. ISBN 978-81-203-3674-2.
 4. Laxmikanth. Indian Polity For UPSC 3E. Tata McGraw-Hill. pp. 27–1. ISBN 978-0-07-015316-5.
 5. 5.0 5.1 5.2 Agarala Easwara Reddy (1994). State politics in India: reflections on Andhra Pradesh. M.D. Publications Pvt. Ltd. pp. 97–110. ISBN 978-81-85880-51-8.
 6. "శాసనమండలి రద్దు బిల్లును కేంద్రానికి పంపిన ఏపీ ప్రభుత్వం". జీన్యూస్. 2020-01-28. Retrieved 2021-01-25.
 7. TMH General Knowledge Manual. Tata McGraw. 2007. p. 176. ISBN 978-0-07-061999-9.
 8. "AP MLC Election Results 2021 LIVE: కృష్ణా-గుంటూరులో కల్పలత.. ఉభయ గోదావరి జిల్లాల టీచర్‌ ఎమ్మెల్సీగా యూటీఎఫ్‌ అభ్యర్థి ఘన విజయం". tv9. 2021-03-18. Retrieved 2021-03-18.
 9. "ఎమ్మెల్సీగా పోతుల సునీత ఏకగ్రీవం". సాక్షి. 2020-01-19. Retrieved 2021-01-24.
 10. "ఎమ్మెల్సీగా డొక్కా మాణిక్యవరప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక ఏకగ్రీవం". సమయం. 2020-06-25. Retrieved 2021-01-24.
 11. "TDPs Prabhakar elected unopposed to AP Legislative Council". India today. 2017-12-29. Retrieved 2021-01-25.
 12. "AP MLC Election Results 2021 LIVE: కృష్ణా-గుంటూరులో కల్పలత.. ఉభయ గోదావరి జిల్లాల టీచర్‌ ఎమ్మెల్సీగా యూటీఎఫ్‌ అభ్యర్థి ఘన విజయం". tv9. 2021-03-18. Retrieved 2021-03-18.
 13. "AP MLC Election Results 2021 LIVE: కృష్ణా-గుంటూరులో కల్పలత.. ఉభయ గోదావరి జిల్లాల టీచర్‌ ఎమ్మెల్సీగా యూటీఎఫ్‌ అభ్యర్థి ఘన విజయం". tv9. 2021-03-18. Retrieved 2021-03-18.
 14. "Chadipiralla Sivanatha Reddy". Retrieved 2021-03-28.
 15. "Pamidi Samanthakamani". Retrieved 2021-03-28.
 16. 10TV (18 June 2021). "Andhrapradesh: శాసన మండలి ప్రొటెం స్పీకర్‌గా విఠపు బాలసుబ్రహ్మణ్యం". 10TV (in telugu). Archived from the original on 20 June 2021. Retrieved 20 June 2021.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
 17. Andhrajyothy (19 November 2021). "మండలి చైర్మన్‌గా మోషేన్‌రాజు". Archived from the original on 19 November 2021. Retrieved 19 November 2021.
 18. Vaartha (25 June 2018). "ఎమ్మెల్సీగా గాలి స‌ర‌స్వ‌తి". Archived from the original on 1 జనవరి 2022. Retrieved 1 January 2022. {{cite news}}: Check date values in: |archivedate= (help)
 19. "Rama Krishna wins from Guntur-Krishna teachers' constituency". Business Standard. 25 March 2015. Retrieved 12 June 2021.