వడ్లమూడి వెంకటరావు

(వి.వెంకట రావు నుండి దారిమార్పు చెందింది)

వడ్లమూడి వెంకటరావువ విద్వాంసుడు, ఉపాధ్యాయుడు, దానశీలి, పద్మశ్రీ పురస్కార గ్రహీత.[1]

జీవిత విశేషాలు

మార్చు

వి.వెంకట రావు నెల్లూరు జిల్లా నాయుడుపేటలో 1899 డిసెంబరు 14న జన్మించాడు. ప్రాథమికవిద్య నాయుడుపేటలో, హైస్కూలు, ఇంటర్ వరకు నెల్లూరులో చదివి, ఉన్నత విద్యకోసం ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు. అక్కడ ప్రొఫెసర్ మామిడిపూడి వెంకటరంగయ్య, ప్రొఫెసర్ బేణీప్రసాద్ ప్రేమాభిమానాలను చూరగొని, మద్రాసు, అలహాబాదు విశ్వవిద్యాలయాల్లో చదివాడు. అలహాబాదు విశ్వవిద్యాలయంనుంచి ఎం.ఏ., డిలిట్ చేసాడు. 1937 ఏర్పడిన రాజాజీ మంత్రివర్గంలో బెజవాడ గోపాలరెడ్డికి పర్సనల్ ఆఫీసరుగా చేశాడు. ప్రపంచ యుద్ధం సందర్బం లో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసాడు.

1932-58 మధ్యకాలంలో ఆర్థిక, చరిత్ర శాఖల్లో అధ్యాపకునిగా పని చేసాడు. 1958లో ఆంధ్రవిశ్వవిద్యాలయం రాజకీయశాస్త్రం డిపార్టుమెంటు ఏర్పరచినపుడు దానికి తొలి అధిపతిగా చేసి 1973లో పదవీవిరమణ చేసాడు. 1973నుంచి77వరకు ప్రొఫెసర్ ఎమిరిటస్‌గా అక్కడే చేశాడు. 1962లో పుల్టిజెర్ స్కాలర్ గా ఎంపికయి ఏడాదిపాటు యు.ఎస్.ఏ లో ఇండియానా విశ్వవిద్యాలయంలో అధ్యయనం సాగించాడు. కొంతకాలం మణిపూర్ విశ్వవిద్యాలయంలో, డిబ్రూఘర్ విశ్వవిద్యాలయంలోను విజిటింగ్ ప్రొఫెసర్ గా పని చేశాడు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి అయినా అతను ఉప్పు సత్యాగ్రహం చేసి ఒక సంవత్సరం జైల్లో గడిపి, గాంధిజీ ఇర్విన్ ఒప్పందంలొ 1931లొ జైలు నుంచి విదుదల అయినాడు. ఈయన సేవలకు ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. 1993 అక్టోబరు 29న ఈయన అసువులు బాశాడు.

ఆధారాలు:

మార్చు

1. Ms Niru Hazarika, The Late Professor V.VENKATARAO,: An Appreciation of His Contributions, The Indian Journal of Political Scicence, Vol 55. No 1.(University, March, 1994} PP 73-75.

మూలాలు

మార్చు
  1. Hazarika, Niru (1994). "THE LATE PROFESSOR V. VENKATA RAO: AN APPRECIATION OF HIS CONTRIBUTIONS". The Indian Journal of Political Science. 55 (1): 73–75. ISSN 0019-5510.