వి.సెంథిల్ బాలాజీ

వి.సెంథిల్ బాలాజీ తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తమిళనాడు శాసనసభకు ఐదు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై జయలలిత & ఎం. కె. స్టాలిన్ మంత్రివర్గంలో రెండుసార్లు మంత్రిగా పని చేశాడు.[2]

వీ. సెంథిల్ బాలాజీ

పోర్ట్‌ఫోలియో లేని మంత్రి
పదవీ కాలం
16 జూన్ 2023 – 12 ఫిబ్రవరి 2024
ముందు పి. తంగమని

విద్యుత్‌, ప్రొబిషన్‌, ఎక్సైజ్‌ శాఖ మంత్రి
పదవీ కాలం
7 మే 2021 – 16 జూన్ 2023[1]

రవాణా శాఖ మంత్రి
ముందు కే. ఎన్. నెహ్రు
తరువాత పి. తంగమని

ఎమ్మెల్యే
పదవీ కాలం
7 మే 2021 – ప్రస్తుతం
నియోజకవర్గం కరూర్
పదవీ కాలం
23 మే 2019 – 6 మే 2021
నియోజకవర్గం అరవకురిచ్చి
పదవీ కాలం
22 నవంబర్ 2016 – 27 సెప్టెంబర్ 2018
నియోజకవర్గం అరవకురిచ్చి
పదవీ కాలం
15 మే 2011 – 19 మే 2016
నియోజకవర్గం కరూర్
పదవీ కాలం
12 మే 2006 – 14 మే 2011
నియోజకవర్గం కరూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1975-10-25) 1975 అక్టోబరు 25 (వయసు 49)
కరూర్, తమిళనాడు, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ డీఎంకే (1996 - 2000 & 2018-present)
ఇతర రాజకీయ పార్టీలు మరుమలార్చి ద్రావిడ మున్నేట్ర కజగం (1994 - 1996)
అన్నాడీఎంకే (2000-2017)
అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (2018)
జీవిత భాగస్వామి మేఘాల సెంథిలబాలాజీ
సంతానం 1 కుమార్తె
వృత్తి

జననం, విద్యాభాస్యం

మార్చు

వి.సెంథిల్ బాలాజీ కరూర్ జిల్లాలోని రామేశ్వరపట్టి గ్రామంలో 1975 అక్టోబర్ 21న జన్మించాడు. ఆయన రామేశ్వరపట్టి ప్రభుత్వం నుండి హైస్కూల్ & హయ్యర్ సెకండరీ స్కూల్, పాఠశాల, వివేకానంద పాఠశాల, పశుపతిపాళయం, మున్సిపల్ హయ్యర్ సెకండరీ పాఠశాల, కరూర్ లో పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

మార్చు

వి.సెంథిల్ బాలాజీ 21 సంవత్సరాల వయస్సులో రాజకీయాల్లోకి వచ్చి 1997లో స్థానిక సంస్థ సభ్యునిగా ఎన్నికయ్యాడు. ఆయన 2006లో కరూర్ శాసనసభ నియోజకవర్గం నుండి అన్నాడీఎంకే అభ్యర్ధిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు. సెంథిల్ బాలాజీ  2011లో కరూర్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 2011 నుండి 2015 వరకు జయలలిత మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా పని చేశాడు. ఆయన 2016లో అరవకురిచ్చి నియోజకవర్గం నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. జయలలిత మరణానంతరం ప్రభుత్వాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషించి అన్నాడీఎంకే వర్గాలుగా విడిపోయినప్పుడు టీటీవీ దినకరన్‌కు అండగా నిలిచారు. 18 సెప్టెంబర్ 2017న, ముఖ్యమంత్రిని మార్చాలంటూ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్‌కి పిటీషన్ చేసినందుకు 18 మంది ఎమ్మెల్యేలను స్పీకర్ పి. ధనపాల్ అనర్హులుగా ప్రకటించాడు. సెంథిల్ బాలాజీ 14 డిసెంబర్ 2018న డీఎంకే పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ సమక్షంలో ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) పార్టీలో చేరాడు.

సెంథిల్ బాలాజీ 2019లో అరవకురిచ్చి నియోజకవర్గంకు జరిగిన ఉప ఎన్నికలో డీఎంకే  పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఐదోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఎం. కె. స్టాలిన్ మంత్రివర్గంలో 7 మే 2021 నుండి 16 జూన్ 2023 వరకు విద్యుత్‌, ప్రొబిషన్‌, ఎక్సైజ్‌ శాఖల మంత్రిగా పని చేశాడు.[3]

అరెస్టు

మార్చు

సెంథిల్‌ బాలాజీ 2013లో రవాణా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసిన కేసులో మనీలాండరింగ్‌ కేసులతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జూన్ 13న అర్ధరాత్రి ఆయనను అరెస్టు చేసి సెషన్స్‌ కోర్టు ముందు హాజరుపరుచగా 2023 జూన్ 28 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. అరెస్ట్ సమయంలో సెంథిల్‌ బాలాజీ తీవ్ర అస్వస్థతకు గురికావటంతో చికిత్స నిమిత్తం ఓమండురార్‌ ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు.[4][5]

మనీలాండరింగ్‌ కేసులో అరెస్టై జైలు శిక్ష అనుభవిస్తున్న ఆయన 2024 ఫిబ్రవరి 12న తన మంత్రి పదవికి రాజీనామా చేశాడు.[6][7]

మూలాలు

మార్చు
  1. https://www.news18.com/amp/politics/portfolios-of-senthil-balaji-tamil-nadus-arrested-minister-given-to-2-dmk-leaders-8085289.html
  2. Sakshi (6 May 2021). "తమిళనాడు కొత్త మంత్రులు వీరే!". Archived from the original on 2021-10-29. Retrieved 3 April 2022.
  3. TV9 Telugu (6 May 2021). "తమిళనాడులో కొలువుదీరనున్న డీఎంకే ప్రభుత్వం.. స్టాలిన్ మంత్రి మండలిలో కొత్త మంత్రులు వీరే!". Archived from the original on 3 April 2022. Retrieved 3 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Andhra Jyothy (15 June 2023). "తమిళనాడు మంత్రి సెంథిల్‌ అరెస్టు". Archived from the original on 18 June 2023. Retrieved 18 June 2023.
  5. Eenadu (15 June 2023). "తమిళనాడు మంత్రి సెంథిల్‌బాలాజీ అరెస్టు". Archived from the original on 18 June 2023. Retrieved 18 June 2023.
  6. Andhrajyothy (13 February 2024). "మంత్రి పదవికి సెంథిల్ బాలాజీ రాజీనామా.. ఎందుకంటే..?". Archived from the original on 13 February 2024. Retrieved 13 February 2024.
  7. The Hindu (28 September 2024). "Udhayanidhi Stalin elevated as deputy CM by M.K. Stalin, Senthilbalaji makes a comeback" (in Indian English). Archived from the original on 28 September 2024. Retrieved 28 September 2024.