జయలలిత

భారతీయ నటి మరియు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి

జయలలిత (జ. ఫిబ్రవరి 24, 1948—మ. డిసెంబరు 5, 2016) ప్రముఖ రాజకీయనాయకురాలు, తమిళనాడు రాష్ట్రానికి 2015 మే నుంచి 2016 డిసెంబరులో మరణించే దాకా ముఖ్యమంత్రిగా పనిచేసింది. అంతకు మునుపు 1991 నుంచి 1996, 2001 లో కొంతకాలం, 2002 నుంచి 2006 దాకా కూడా ముఖ్యమంత్రిగా పనిచేసింది. రాజకీయాలలోకి రాకమునుపు తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో సుమారు 140 సినిమాల్లో నటించింది. 1961 నుంచి1980 వరకు ఎక్కువగా కథానాయికగా వివిధ రీతుల చిత్రాలలో, వైవిధ్యభరితమైన పాత్రలలో నటించింది. నాట్యంలో కూడా ఆమెది అందే వేసినచేయి. ఒకరకంగా తమిళ చిత్రసీమను మకుటం లేని మహారాణిగా కొద్దికాలం పాటు ఏలింది.[1] తమిళనాడు ప్రాంతీయ రాజకీయ పార్టీ అయిన ఆల్ ఇండియా అణ్ణా ద్రావిడ మున్నేట్ర కళగం యొక్క సాధారణ కార్యదర్శి. ఆమె అభిమానులు ఆమెను పురట్చి తలైవి (విప్లవ నాయకురాలు), అమ్మను పిలిచాడు అని పిలుచుకుంటా ఉంటారు.

జె. జయలలిత
J Jayalalitha
ஜெ. ஜெயலலிதா
జయలలిత


16th
పదవీ కాలం
16 మే 2011 – 28 సెప్టెంబెర్ 2014
ముందు ఎం.కరుణానిధి
తరువాత ఓ. పన్నీర్‌సెల్వం
నియోజకవర్గం శ్రీరంగం

పదవీ కాలం
2 మార్చి 2002 – 12 మే 2006
ముందు ఓ.పన్నీర్‌సెల్వం
తరువాత ఎం.కరుణానిధి
నియోజకవర్గం ఆండిపట్టి

తమిళనాడు ముఖ్యమంత్రి (క్వాషెద్)
పదవీ కాలం
14 మే 2001 – 21 సెప్టెంబర్ 2001
ముందు ఎం.కరుణానిధి
తరువాత ఓ.పన్నీర్‌సెల్వం
నియోజకవర్గం పోటీ చేయలేదు

పదవీ కాలం
24 జూన్ 1991 – 12 మే 1996
ముందు రాష్టపతి పరిపాలన
తరువాత ఎం.కరుణానిధి
నియోజకవర్గం బర్గూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1948-02-24)1948 ఫిబ్రవరి 24
మైసూర్,
భారత దేశం
మరణం 05 డిసెంబర్, 2016
చెన్నై, తమిళనాడు
రాజకీయ పార్టీ ఎ.ఐ.ఎ.డి.ఎమ్.కె.
నివాసం పోయస్ గార్డెన్,
చెన్నై,
భారత దేశం
మతం హిందూ మతము

ఆమె నటిగా ఎం.జి.ఆర్ సరసన ఎన్నో చిత్రాలలో నటించింది. ఎం.జీ.ఆర్ రాజకీయాలలో ప్రవేశించిన తరువాత జయలలిత కూడా రాజకీయాల్లోకి వచ్చింది. 1984 నుంచి 1989 వరకు తమిళనాడు నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైంది. ఎంజీఆర్ మరణం తరువాత అతని వారసురాలిగా ప్రకటించుకున్నది.

2014 సెప్టెంబరు 27 న జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు అయింది. దాంతో ఆమె తన ముఖ్యమంత్రి పదవి రద్దయింది. పదవిలో ఉండగా కేసులో ఇరుక్కుని పదవీచ్యుతురాలైన మొదటి ముఖ్యమంత్రి అయింది.[2][3] 2015 మే 11న కర్ణాటక ఉన్నత న్యాయస్థానం ఆమెను నిర్దోషిగా విడిచిపెట్టింది. దాంతో ఆమె మే 23న తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టింది.

ఆమె 2016, డిసెంబరు 5, రాత్రి 11:30 గంటలకు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో మరణించింది.అంతకు మునుపు సుమారు రెండున్నర నెలలుగా ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలోనే ఉంది. డిసెంబరు 6న అంత్యక్రియలు జరిగాయి.

బాల్యం

జయలలిత 1948 ఫిబ్రవరి 24న అప్పటి మైసూరు రాష్ట్రంలోని పాండవపుర తాలూకా, మేలుకోటేలో జయరాం, వేదవల్లి దంపతులకు జన్మించింది. తల్లి ఒక తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ వంశానికి చెందినది.[4] జయలలిత అసలు పేరు కోమలవల్లి. అది ఆమె అవ్వగారి పేరు. బ్రాహ్మణ సంప్రదాయాన్ని అనుసరించి ఆమెకు రెండు పేర్లు పెట్టారు. జయలలిత అనే రెండో పేరును పాఠశాలలో చేర్చేటపుడు నమోదు చేశారు.

తిరుచ్చి జిల్లా శ్రీరంగం పూర్వీకంగా కలిగిన జయలలిత 1981లో తమిళనాడు రాజకీయాలలో ప్రవేశించి రామచంద్రన్ మరణానంతరం అతని భార్య జానకి రామచంద్రన్ తమిళనాడు ముఖ్యమంత్రి అయిననూ ఆమె ఎక్కువ రోజులు పదవిలో కొనసాగలేకపోయింది. జయలలిత 1989 అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి తొలి మహిళా ప్రతిపక్ష నాయకురాలిగా స్థానంసంపాదించిరి. 1991లో రాజీవ్ గాంధీ మరణానంతరం జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించింది. ప్రజలచే ఎన్నిక కాబడిన తొలి తమిళనాడు మహిళా ముఖ్యమంత్రిగా అవతరించింది. 5 సంవత్సరాలు పూర్తి కాలం పదవిలో ఉండి 2006 మేలో జరిగిన శాసనసభ ఎన్నికలలో పరాజయం పొందినది. ఆమె పార్టికి కేవలము నాలుగు స్థానాలే దక్కాయి. 2006 లో ఓటమి సమయంలో తమ మిత్రపక్షాలతో కలిసి శాసన సభలో 1977 తరువాత అత్యంత పటిష్ఠమైన ప్రతిపక్షంగా నిలవగల సీట్లను సంపాదించారు. ఈమే ప్రస్తుత తమిళ నాడు ముఖ్యమంత్రి. అభిమానులు జయలలితను అమ్మ అని, పురచ్చి తలైవి (విప్లవాత్మక నాయకురాలు) అని పిలుస్తుంటారు.

కుటుంబ పరిస్థితులవలన ఈమె తల్లి బలవంతముతో తన 15వ యేట సినిమా రంగములో ప్రవేశించింది. జయలలిత తొలి సినిమా చిన్నడ గొంబె కన్నడ చిత్రం పెద్ద హిట్టయ్యింది. ఈమె తొలి తెలుగు సినిమా మనుషులు మమతలు ఈమెను పెద్దతార స్థాయికి తీసుకెళ్లింది. 1972లో తమిళనాడు ప్రభుత్వం జయలలితను కళైమామణి పురస్కారముతో సత్కరించింది. ఈమె అవివాహిత గానే జీవితాన్ని గడిపారు.

  • జయలలితపై ఎన్నో రకాలైన కేసులు పెట్టినా, ఎదురు నిలిచి పోరాడింది. ఆమె మీద పెట్టిన 11 కేసులలో తొమ్మిది కేసులు పూర్తి అయ్యాయి. మిగిలిన రెండు కేసులలో ఆమె పోరాడుతుంది.
  • 1982లో అఖిల భారత అణ్ణా ద్రావిడ మున్నేట్ర కళగములో సభ్యురాలిగా చేరిన ఆమె, 1984 లో రాజ్యసభకు నామినేట్ చేయబడింది. 1989 లో బోడినాయకనూరు నుండి మొట్టమొదటి సారిగా ఎం.ఎల్.ఏగా గెలిచారు. 1991 లో గాంగేయం, బర్గూరు నుండి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. 1996 లో బర్గురులో ఓటమి. టాన్సి భూ బేర అవినీతి కేసులో శిక్ష విధింపబడిన కారణముగా 2001 శాసనసభ ఎన్నికలలో పాల్గొనుటకు అనర్హురాలిగా ప్రకటింపబడ్డారు. కానియు ఆండిపట్టి, కృష్ణగిరి, భువనగిరి, పుదుక్కోట నియోజకవర్గములలో నామపత్రాలు దాఖలు చేశారు. అవన్నియు తిరస్కరణకు గురైనవి. కాని ఆమె పార్టీ గెలుచుటచే ఆమె ముఖ్యమంత్రి అయ్యారు. కాని అది చెల్లదని సుప్రీం కోర్టు 2001 సెప్టెంబరు 21 నాడు తీర్పునివ్వటంతో ఆమె పదవి రద్దైంది. 2002 లో టాన్సి కేసులో విడుదలై, ఆండిపట్టి నుండి పోటీ చేసి ముఖ్యమంత్రి ఐనారు. 2006 లో ఆండిపట్టి నుండి గెలుపు, కాని పార్టీ అధికారాన్ని కోల్పోయింది. 2011 లో శ్రీరంగం నుండి ఎన్నిక, ముఖ్యమంత్రిగా ప్రమాణం. 2014 సెప్టెంబరు 27 లో ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై బెంగుళూరు లోని ప్రత్యేక న్యాయస్థానము నాలుగు సంవత్సరముల కారాగార శిక్ష, నూరు కోట్ల రూపాయల జరిమానా విధించుటచే పదవి కోల్పోయారు. 2015 మేలో ఆ కేసులో విడుదలై, చెన్నై ఆర్.కే. నగర్ లో పోటీ చేసి మరల ముఖ్యమంత్రి అయిరి. 2016 లో చెన్నై ఆర్.కే. నగర్ లో విజయం సాధించి తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణము చేసిరి.

ఎన్నికల చరిత్ర

సంవత్సరం నియోజకవర్గం ఫలితం ఓటు శాతం ప్రత్యర్థి ప్రత్యర్థి పక్షం ప్రత్యర్థి ఓట్ల శాతం
1989 బోడినాయకనూరు గెలుపు 54.51 ముత్తుమనోహరన్ డీ.ఎం.కె 27.27[5]
1991 బర్గూరు గెలుపు 69.3 రాజేందర్ తాయగ మరుమలర్చి కళగము, టి.ఎం.కే 29.34[6]
1991 గాంగేయం గెలుపు 63.4 ఎన్.ఎస్.రాజకుమార్ మండ్రడియార్ డీ.ఎం.కె 32.85[7]
1996 బర్గూరు ఓటమి 43.54 ఇ.జి.సుఖవనం డీ.ఎం.కె 50.71[6]
2001 ఆండిపట్టి, కృష్ణగిరి, భువనగిరి, పుదుక్కోట నామపత్రముల తిరస్కరణ[8]
2002 ఆండిపట్టి గెలుపు 58.22 వైగై శేఖర్ డి.ఎం.కె 27.64[9]
2006 ఆండిపట్టి గెలుపు 55.04 సీమాన్ డి.ఎం.కె 36.29[10]
2011 శ్రీరంగము గెలుపు 58.99 ఎన్.ఆనంద్ డి.ఎం.కె 35.55[11][12]
2015 డాక్టర్.రాధాకృష్ణన్ నగర్ గెలుపు 88.43 సి.మహేంద్రన్ సి.పి.ఐ. 5.35[13]
2016 డాక్టర్.రాధాకృష్ణన్ నగర్ గెలుపు 55.87 సిమ్లా ముత్తుచోళన్ డి.ఎం.కె 33.14[14]

జయలలిత నటించిన తెలుగు చిత్రాలు

  1. కథానాయకుడు కథ (1965)
  2. మనుషులు మమతలు (1965)
  3. ఆమె ఎవరు? (1966)
  4. ఆస్తిపరులు (1966)
  5. కన్నెపిల్ల (1966)
  6. గూఢచారి 116 (1966)
  7. నవరాత్రి (1966)
  8. గోపాలుడు భూపాలుడు (1967)
  9. చిక్కడు దొరకడు (1967)
  10. ధనమే ప్రపంచలీల (1967)
  11. నువ్వే (1967)
  12. బ్రహ్మచారి (1967)
  13. సుఖదుఃఖాలు (1967)
  14. అదృష్టవంతులు (1968)
  15. కోయంబత్తూరు ఖైదీ (1968)
  16. తిక్క శంకరయ్య (1968)
  17. దోపిడీ దొంగలు (1968)
  18. నిలువు దోపిడి (1968)
  19. పూలపిల్ల (1968)
  20. పెళ్ళంటే భయం (1968)
  21. పోస్టుమన్ రాజు (1968)
  22. బాగ్దాద్ గజదొంగ (1968)
  23. శ్రీరామకథ (1968)
  24. ఆదర్శ కుటుంబం (1969)
  25. కథానాయకుడు (1969)
  26. కదలడు వదలడు (1969)
  27. కొండవీటి సింహం (1969)
  28. పంచ కళ్యాణి దొంగల రాణి (1969)
  29. ఆలీబాబా 40 దొంగలు (1970)
  30. కోటీశ్వరుడు (1970)
  31. గండికోట రహస్యం (1970)
  32. బొమ్మలాట (1970)
  33. మేమే మొనగాళ్లం (1971)
  34. శ్రీకృష్ణ విజయం (1971)
  35. శ్రీకృష్ణసత్య (1971)
  36. భార్యాబిడ్డలు (1972)
  37. డాక్టర్ బాబు (1973)
  38. దేవుడమ్మ (1973)
  39. దేవుడు చేసిన మనుషులు (1973)
  40. లోకం చుట్టిన వీరుడు (1973)
  41. ప్రేమలు - పెళ్ళిళ్ళు (1974)
  42. నాయకుడు – వినాయకుడు (1980)

జె.జయలలిత నేతృత్వములో అణ్ణా డి.ఎం.కె. సాధనలు

  • 1991-వ సంవత్సరము జరిగిన శాసనసభ ఎన్నికలలో 168 నియోజకవర్గములలో పోటీ చేసి 164 నియోజకవర్గములలో గెలిచి ప్రభుత్వమును ఏర్పరచింది.
  • 1998-వ సంవత్సరము జరిగిన లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలలో 18 నియోజకవర్గములలో గెలిచి వాజపేయి నేతృత్వములోని కేంద్ర ప్రభుత్వములో పాలుపంచుకొనెను.
  • 2001-వ సంవత్సరము మే నెలలో జరిగిన శాసనసభ ఎన్నికలలో 132 నియోజకవర్గములలో గెలిచి ప్రభుత్వమును ఏర్పరచింది.
  • 2011-వ సంవత్సరము ఏప్రియల్ లో జరిగిన శాసనసభ ఎన్నికలలో 150 నియోజకవర్గములలో గెలిచి ప్రభుత్వమును ఏర్పరచింది.
  • 2011-వ సంవత్సరము సెప్టెంబరు/అక్టోబరులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో మొత్తమున్న 10 నగరపాలికలను దక్కించుకున్నది.
  • 2014-వ సంవత్సరములో జరిగిన లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలలో తమిళనాడు లోని 39, పుదుచ్చేరి లోని ఏకైక నియోజకవర్గములో ఒంటరిగా పోటీ చేసి 37 నియోజకవర్గములలో గెలిచి చరిత్ర సృష్టించుటయేగాక లోక్‌సభలో మూడవ అతిపెద్ద పక్షముగా అవతరించెను.
  • 2016-వ సంవత్సరము జరిగిన శాసనసభ ఎన్నికలలో మొత్తమున్న 234 నియోజకవర్గములలో ఒంటరిగా పోటీ చేసి, 134 నియోజకవర్గములలో నెగ్గి అధికారమును నిలబెట్టికొనెను. 1984 కి పిమ్మట అధికారములో ఉన్న పక్షమే తిరిగి నెగ్గుట ఇదియే మొదలు. .
  • 2016-వ సంవత్సరము జూను నెలలో జరిగిన రాజ్యసభ ఎన్నికలలో నలుగురు సభ్యులను గెలిపించుకొనుట ద్వారా దేశ పార్లమెంటులో అణ్ణా డి.ఎం.కే బలము 50కి పెరిగెను (37 లోక్‌సభ+ 13 రాజ్యసభ). ఇది తమిళనాడు లోని మరే రాజకీయ పక్షము సాధించని అపురూప విజయము.
  • 2011 శాసనసభ ఎన్నికలు, 2011 స్థానిక సంస్థల ఎన్నికలు, 2014 సార్వత్రిక ఎన్నికలు, 2016 శాసనసభ ఎన్నికలు అని వరుసగా నాలుగు ఎన్నికలలో ఆమె నాయకత్వములో అణ్ణా డి.ఎం.కె చిరస్మరణీయ విజయములను సాధించెను.

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. http://www.dailymirror.lk/25952/tamil-nadu-chief-minister-jayalalithaa-on-the-warpath-against-sri-lanka-again
  2. "Tamil Nadu CM J Jayalalithaa convicted to 4 years imprisonment in disproportionate assets case". DNA. 27 Sep 2014. Retrieved 27 September 2014.
  3. "Top India politician Jayalalitha jailed for corruption". BBC News Online. 27 September 2014. Retrieved 27 September 2014.
  4. "Jayalilathaa victory finds resonance". DNA. Retrieved 2 February 2016.
  5. "Party wise comparison since 1977 in Bodinayakkanur constituency". Election Commission of India. Retrieved 10 November 2013.
  6. 6.0 6.1 "Party wise comparison since 1977 in Bargur constituency". Election Commission of India. Retrieved 10 November 2013.
  7. "Party wise comparison since 1977 in Kangeyamconstituency". Election Commission of India. Retrieved 10 November 2013.
  8. J., Venkatesan (31 March 2012). "Jayalalithaa's SLP listed for final hearing in July". The Hindu. Retrieved 10 November 2013.
  9. T., Ramakrishnan (20 January 2002). "The conundrum in an AIADMK stronghold". The Hindu. Archived from the original on 15 డిసెంబరు 2013. Retrieved 10 November 2013.
  10. "Party wise comparison since 1977 in Andipatti constituency". Election Commission of India. Retrieved 10 November 2013.
  11. "Winner and runners of 2011 Tamil Nadu legislative assembly elections" (PDF). Election Commission of India. p. 8. Archived from the original (PDF) on 14 జనవరి 2014. Retrieved 18 జనవరి 2017.
  12. "Statistical report of 2011 Tamil Nadu legislative assembly elections" (PDF). Election Commission of India. p. 162. Retrieved 10 November 2013.
  13. "2015 Tamil Nadu bypass election result". CNN-IBN. Archived from the original on 2 జూలై 2015. Retrieved 30 June 2015.
  14. "Election Commission of India- State Election, 2016 to the Legislative Assembly Of Tamil Nadu" (PDF). Election Commission of India. p. 1. Retrieved 9 December 2016.

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=జయలలిత&oldid=4343781" నుండి వెలికితీశారు