వీణా శ్రీనివాస్

సంగీత కళాకారులు

వీణా శ్రీనివాస్ (జననం 1968 సెప్టెంబరు 12) తెలంగాణ రాష్ట్రానికి చెందిన వీణా వాద్యకారుడు.[1] కర్ణాటక సంగీతంలో ప్రావీణ్యం సంపాదించాడు.

వీణా శ్రీనివాస్
వ్యక్తిగత సమాచారం
జన్మ నామండి. శ్రీనివాస్
జననం (1968-09-12) 1968 సెప్టెంబరు 12 (వయసు 56)
సంగీత శైలికర్ణాటక సంగీతం
వాయిద్యాలువీణా వాద్యకారుడు
క్రియాశీల కాలం1980 – ప్రస్తుతం
వెబ్‌సైటుhttp://www.veenasrinivas.com/

శ్రీనివాస్ 1968, సెప్టెంబరు 12న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జన్మించాడు. శ్రీనివాస్ తల్లి తులసి కూడా వీణా వాద్యకారురాలు. తన వీణా కచేరీల కోసం శ్రీనివాస్ అనేక ప్రాంతాలు పర్యటించాడు.

కెరీర్

మార్చు

శ్రీనివాస్ చిన్నప్పటి నుండి తన తల్లి తులసి దగ్గర సంగీతంలో శిక్షణ పొందాడు. తరువాత ఎల్. సుబ్రమణ్యంతో జుగల్బందీ వయొలిన్ సంగీత స్వరాలను నేర్చుకున్నాడు. వీణలోని ప్లకింగ్ టెక్నిక్‌పై పనిచేయడం ప్రారంభించి మూడేళ్ళపాటు శ్రమించి ఒక నిమిషంలో వెయ్యి ప్లక్స్ వాయించడం సాధన చేశాడు.[2] శ్రీనివాస్ తన తొమ్మిదేళ్ళ వయసులోనే హైదరాబాదులోని ఆకాశవాణిలో తన తొలి కచేరీ నిర్వహించాడు.[3] టాప్ గ్రేడ్ వీణా కళాకారుడిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిచే ఉగాది విశిష్ట పురస్కారం కూడా అందుకున్నాడు. 25 సంవత్సరాలుగా దేశవిదేశాలలో వీణా కచేరీలను నిర్వహిస్తున్నాడు. ఐక్యరాజ్య సమితిలో ప్రదర్శన ఇచ్చిన ఏకైక వీణా కళాకారుడిగా ప్రసిద్ధి పొందాడు.

అవార్డులు, సన్మానాలు

మార్చు
  • ఈమని శంకరశాస్త్రి అవార్డు
  • చిట్టిబాబు స్మారక పురస్కారం
  • గిడుగు లలిత స్మారక పురస్కారం
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉగాది విశిష్ట పురస్కారం.

బిరుదులు

మార్చు
  • వీణా విధ్వామణి
  • వీణా ప్రవీణ
  • రాగ సుధాకర
  • వైణిక రత్న
  • వైణిక సామ్రాట్
  • వైణిక చక్రవర్తి
  • వీణా సంబ్రహ్మ

డిస్కోగ్రఫీ

మార్చు
  • వీణపై త్యాగరాజ కృతి
  • ఇండియన్ క్లాసికల్ రింగ్‌టోన్‌లు[4]

మూలాలు

మార్చు
  1. The Hindu : Friday Review Hyderabad / Tribute : Strings of tribute
  2. Naidu, Jaywant (2017-11-21). "Weaving magic with the veena". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 2017-11-21. Retrieved 2021-11-04.
  3. "about srinivas". Archived from the original on 23 July 2008. Retrieved 24 March 2009.
  4. Ringtones on iTunes Ringtones on Google Play

బయటి లింకులు

మార్చు