వీధిభాగవతం
కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగ రంగా అంటూ పోతన భాగవతం లోని ఘట్టాలను జానపద శైలిలో అభినయిస్తూ గానం చేస్తారు.
కూచిపూడి భాగవతం, చిందు భాగవతం, గంటె భాగవతం, ఎరుకుల భాగవతం, శివ భాగవతం, చెంచు భాగవతం, తూర్పు భాగవతం, మొదలైనవి ప్రసిద్ధి చెందిన వీధి భాగవత కళారూపాలు.[1]
పురాణ గాథలను నాట్య రూపంగా ప్రదర్శించే వారిని భాగవతులు అంటారు. భాగవతులు అంటే భగవంతునికి సంబంధించిన కథలను ప్రదర్శించే వారిని అర్థం .మన రాష్ట్రంలో ఈ భాగవతాన్ని ప్రదర్శించే వారిలో వివిధ కులాలకు చెందిన వారు ఉండటం విశేషం. వీరిలో ఎర్రగొల్లలు ,కూచిపూడి భాగవతులు,జంగాలు,చిందుభాగవతులు,యానాదులు,దాసరులు ముఖ్యులు[2]
ఈ జానపద కళారూపాలు చాలావరకు కనుమరుగుకాగా తూర్పు తీర ప్రాంతంలో నేటికీ సజీవంగా ఉన్న జానపద కళ వీధి భాగవతం లేదా తూర్పు భాగవతం.దీనికి సత్యభామ కలాపం అనే పేరు కూడా ఉంది.శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తూర్పు భాగవతం పేరుతో అమ్మవారి పండుగలు పేరంటాల జాతరలో ప్రదర్శితమౌతోంది.ముఖ్యంగా పైడితల్లి ముత్యాలమ్మ ,నూకాలమ్మ పండుగలు దీన్ని ప్రదర్శిస్తున్నారు .ఉత్తరాంధ్ర మండలికాలు , బాణీలు, యాసతో తూర్పు భాగవతం ఎంతో వినసొంపుగా ఉంటుంది.వరద ఆదినారాయణ , బొంతల కోటి జగన్నాథం ,దూడల శంకరయ్య , మీగడ దాలయ్య, కాలుగంటి వెంకటస్వామి మొదలైన వారు వీధి భాగవతుల్లో ప్రసిద్ధులు[3].
మూలాలు
మార్చు- ↑ "Veethi Bhagavatam of Andhra". INDIAN CULTURE (in ఇంగ్లీష్). Retrieved 2023-09-05.
- ↑ "veedhi bhagavatam Archives". ఆవకాయ.ఇన్ | అక్షర లోకమ్ (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-08-30. Retrieved 2023-09-05.
- ↑ మూర్తి, మిక్కిలినేని రాధాకృష్ణ. "తెలుగువారి జానపద కళారూపాలు/విలక్షణ వీథి భాగవతం తూర్పు భాగవతం - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2023-09-05.