వీపన్‌గండ్ల మండలం

తెలంగాణ, వనపర్తి జిల్లా లోని మండలం

వీపనగండ్ల మండలం, తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లాకు చెందిన మండలం.[1] వీపనగండ్ల, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన వనపర్తి నుండి 46 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం వనపర్తి రెవిన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మహబూబ్ నగర్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 11 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.

వీపనగండ్ల మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో వనపర్తి, వీపనగండ్ల మండలం స్థానాలు
తెలంగాణ పటంలో వనపర్తి, వీపనగండ్ల మండలం స్థానాలు
తెలంగాణ పటంలో వనపర్తి, వీపనగండ్ల మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 16°09′14″N 78°13′00″E / 16.154007°N 78.216705°E / 16.154007; 78.216705
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వనపర్తి
మండల కేంద్రం వీపనగండ్ల
గ్రామాలు 25
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 51,336
 - పురుషులు 26,338
 - స్త్రీలు 24,998
అక్షరాస్యత (2011)
 - మొత్తం 45.24%
 - పురుషులు 58.85%
 - స్త్రీలు 31.02%
పిన్‌కోడ్ 509105

మహబూబ్ నగర్ జిల్లా నుండి వనపర్తి జిల్లాకు మార్పు సవరించు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మహబూబ్‌నగర్ జిల్లా పటంలో మండల స్థానం

లోగడ వీపన్‌గండ్ల మండలం, మహబూబ్ నగర్ జిల్లా జిల్లా, వనపర్తి రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా వీపన్‌గండ్ల మండలాన్ని (1+10) పదకొండు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన వనపర్తి జిల్లా, వనపర్తి రెవిన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[3]

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 164 చ.కి.మీ. కాగా, జనాభా 28,581. జనాభాలో పురుషులు 14,611 కాగా, స్త్రీల సంఖ్య 13,970. మండలంలో 6,612 గృహాలున్నాయి.[4]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు సవరించు

 1. వీపనగండ్ల
 2. సంగినేపల్లి
 3. గోవర్ధనగిరి
 4. తూంకుంట
 5. సంపత్‌రావుపల్లి
 6. పుల్గర్‌చర్ల
 7. కల్వరాల
 8. గోపాల్‌దిన్నె
 9. కొర్లకుంట
 10. బొల్లారం
 11. వల్లభాపూర్

మూలాలు సవరించు

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 242, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016  
 2. "వనపర్తి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
 3. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2020-01-19.
 4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు సవరించు