వీరాంజనేయ జలాశయం

తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లా, రేవల్లి మండలంలోని ఏదుల గ్రామంలో నిర్మించిన జలాశయం.

వీరాంజనేయ జలాశయం అనేది తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లా, రేవల్లి మండలంలోని ఏదుల గ్రామంలో నిర్మించిన జలాశయం. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన ఈ జలాశయం 6.5 టీఎంసీల సామర్థ్యాన్ని కలిగివుంది.[1]

వీరాంజనేయ జలాశయం
ప్రదేశంరేవల్లి మండలం, వనపర్తి జిల్లా
స్థితినిర్మాణంలో ఉంది
యజమానితెలంగాణ ప్రభుత్వం
ఆనకట్ట - స్రావణ మార్గాలు
ఆనకట్ట రకంబ్యారేజి
జలాశయం
సృష్టించేదివీరాంజనేయ జలాశయం
మొత్తం సామర్థ్యం6.5 టీఎంసీలు
విద్యుత్ కేంద్రం
నిర్వాహకులుతెలంగాణ రాష్ట్రం
Typeజలాశయం

నిర్మాణం మార్చు

ఈ జలాశయం నుంచి 6.4 కిలోమీటర్ల ఓపెన్‌ కెనాల్‌, 11.5 డయాతో 19 కిలోమీటర్ల పొడవుతో 2 సొరంగాలను నిర్మించారు. కేవలం 22 నెలల్లోనే ఈ జలాశయం నిర్మించబడింది.

నీటి తరలింపు మార్చు

నార్లాపూర్‌ సర్జ్‌పూల్‌ నుండి అంజనగిరి రిజర్వాయర్‌లోకి వచ్చిన శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ను ఓపెన్‌ కెనాల్‌, సొరంగ మార్గం ద్వారా ఏదుల పంప్‌హౌజ్‌కు వస్తాయి. అక్కడ 9 మోటార్ల ద్వారా 124 మీటర్ల ఎత్తున ఉన్న ఈ వీరాంజనేయ జలాశయంకు తరలించబడుతుంది.[2] ఇక్కడి నుంచి ఓపెన్‌ సొరంగాల ద్వారా నీటిని వట్టెం పంప్‌హౌజ్‌కు, 5 టీఎంసీలను అచ్చంపేట ఎత్తిపోతల పథకంకు తరలించనున్నారు.[3]

భూసేకరణ మార్చు

ఈ జలాశయం నిర్మాణంలో భాగంగా బండరాయిపాకులు, కొంకలపల్లి గ్రామాల నుండి భూసేకరణ జరిగింది. ఈ జలాశయం కింద ముంపుకు గురవుతున్న నిర్వాసితులకు ప్రభుత్వం పునరావాస ప్యాకేజీ కొంకలపల్లికి చెందిన 269 కుటుంబాలకు, బండరావిపాకుల 729 కుటుంబాలకు పరిహారం అందించడం కోసం 140.19 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ 2019, డిసెంబరు 21న జీఓ 500 విడుదల చేసింది.[4] ఈ రెండు గ్రామాలలో ఇళ్ళు కోల్పోయిన 976 నిర్వాసిత కుటుంబాలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వడంకోసం గౌరీదేవిపల్లి, కొంకలపల్లిలలో రెండు రిలీఫ్‌ అండ్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్లు ఏర్పాటుచేసి, స్థలాలు అందజేశారు.

మూలాలు మార్చు

  1. "పాలమూరు పనుల్లో వేగం.. బీడు భూములకు సాగునీరు". Prabha News. 2022-11-05. Archived from the original on 2022-11-05. Retrieved 2023-05-27.
  2. telugu, NT News (2023-05-15). "Telangana | అడుగు దూరంలో అరవై ఏండ్ల కల.. శరవేగంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు". www.ntnews.com. Archived from the original on 2023-05-15. Retrieved 2023-05-28.
  3. ABN (2023-05-13). "1534 కోట్లతో అచ్చంపేట ఎత్తిపోతల తొలి దశ". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-05-13. Retrieved 2023-05-28.
  4. arunkumar.p (2019-12-22). "ఆ జలాశయంతో వనపర్తికి మహర్దశ...పనులను పరిశీలించిన మంత్రి సింగిరెడ్డి". Asianet News Network Pvt Ltd. Archived from the original on 2020-08-05. Retrieved 2023-05-28.