వీరాజీ పాత్రికేయులు ,రచయిత,సంపాదకులు. ఈయన అసలు పేరు పిళ్ళా కృష్ణమూర్తి

పిళ్ళా కృష్ణమూర్తి
వీరాజీ
జననంపిళ్ళా కృష్ణమూర్తి
మరణం18 ఆగస్ట్ 2021
హైదరాబాద్
ఇతర పేర్లువీరాజీ
ప్రసిద్ధిపాత్రికేయులు
రచయిత,
సంపాదకులు,

జీవిత విశేషాలు

మార్చు

వీరాజీ గా పేరుపడ్డ ఈయన అసలు పేరు పిళ్ళా కృష్ణమూర్తి. బాల్యంలో అనగా 12 వ సంవత్సరంలో రచనలు మొదలు పెట్టారు.ఎక్కువ కాలం ఆంధ్ర పత్రికలో పనిచేశారు. ఆయన శీరిషికలు ఒకవారం విపరీతం, పాలాక్షుడి డైరీ, క్విక్ ఇంటర్వ్యూ వంటివి. ఆంధ్ర సచిత్ర వార పత్రికకు చివరి సంపాదకుడు.

  • కరివేపాకు : ఈ కథలో వీరాజీ వ్యంగ్యం ద్వారా, విభిన్న మానవ మనస్తత్వాల్ని చిత్రించిన తీరు విలక్షణంగా ఉంటుంది.
  • లక్ష : మధ్య తరగతి మనిషి మనస్తత్వం, స్వభావం, ఊహపోహలు, బహిరంతర ప్రవర్తన అన్నీ సాధారణీకరణం చెంది "చక్రపాణి" పాత్రద్వారా సమాజంలో ఒక మధ్యతరగతి మనిషి నమూనా కథకెక్కించిన కథ.
  • సావిత్రి గ్రహించిన సత్యం : పల్లె గురించి, వారి గురించి సావిత్రి కున్న భావనలో మార్పు గూర్చి, ఆమె జీవిత సత్యాన్ని గ్రహించిన తీరుకు అద్దం పడుతోంది.
  • కోతి-భీతి : కొండపల్లి అడవుల్లోకి పోయి కోతుల్ని పట్టుకొచ్చి బెజవాడలో ఎగుమతి వ్యాపార దళారీలకు అమ్ముకుని బతుకు సాగిస్తున ఖుద్దూస్ అనే బడుగు జీవి కథ ఇది.

హేతువు, కార్యకారణ సంబంధాలు పక్కనపెట్టి చూస్తే ఒక అద్భుతమైన మానవతా గోపురం కనిపిస్తుంది కథలో. ఉత్తమమైన విలువలకి పట్టం కట్టిన కథగా అర్ధమౌతుంది. జంతుహింస గురించి ఆలోచనల్ని రేపుతోంది. 1960లో నాలుగున్నర పేజీల్లో రాయబడిన కోతి-భీతి కథకుల శిక్షణ శిబిరానికొక పెద్ద బాలశిక్షగా స్వీకరించదగిన ఉత్తమ కథానిక!

మూలాలు

మార్చు

యితర లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=వీరాజీ&oldid=3322253" నుండి వెలికితీశారు