వుమన్స్ డే (పత్రిక)
వుమన్స్ డే (పత్రిక) అనేది అమెరికాకు చెందిన స్త్రీల మ్యాగజైన్. ఈ పత్రికలో ఇంటి అలంకరణ, ఆహారం, పోషణ, శారీరిక దృఢత్వం, భౌతిక ఆకర్షణ, ఫ్యాషన్ వంటి విషయాలపై వ్యాసాలు ఉంటాయి. అమెరికాలో ప్రచురించే సెవెన్ సిస్టర్స్ మాగజైన్స్ లో ఈ పత్రిక ఒక భాగం.1931లో మొట్టమొదటిసారి ఈ పత్రికను ది గ్రేట్ అట్లాంటిక్ & పసిఫిక్ టీ కంపెనీలు ప్రచురించాయి.[1] ప్రస్తుతం హార్స్ట్ కార్పొరేషన్ అనే ప్రచురణ సంస్థ ప్రచురిస్తోంది.
చరిత్ర
మార్చుఎ&పి వారి కిరాణా దుకాణాల్లో ఈజీ-టు-రీడ్ విధానంలో వంటల రెసిపీ పుస్తకాలను ప్రచురించేది.1936లో ఎ&పి మొట్టమొదటి ఆధునిక సూపర్ మార్కెట్ ప్రారంభించిన సందర్భంగా 1937లో ఆ చిన్న రెసిపీ పుస్తకాలను విస్తరించి, మరిన్ని విషయాలతో వుమన్'స్ డే పత్రికను ప్రచురించడం మొదలుపెట్టింది. ఈ పత్రిక మొదటి వెల 5 సెంట్లు. ఈ పత్రిక పిల్లల పెంపకం, కళలు, ఆహారం తయారీ, వంటలు, ఇంటి అలంకరణ, కుట్టుపని, ఆరోగ్యం వంటి విషయాలపై పలు వ్యాసాలు వెలువరించేది. వీటితో పాటు ప్రముఖ కార్టూనిస్టు వాల్టర్ హోబన్ జెర్రీ ఆన్ ది జాబ్ అనే కామిక్ స్ట్రిప్ రాసేవారు.[2]ఈ పత్రికను ఎ&పి దుకాణాల్లో మాత్రమే ప్రత్యేకంగా అమ్మేవారు. 1944లో ఈ పత్రిక 3,000,000 కాపీలు అమ్ముడుపోయాయి.
మూలాలు
మార్చు- ↑ "Top 100 U.S. Magazines by Circulation" (PDF). PSA Research Center. Archived from the original (PDF) on 2016-11-15. Retrieved February 6, 2016.
- ↑ "Gallery". Archived from the original on 2017-02-10. Retrieved 2017-03-08.