ఆదినాథుడు అని కూడా పిలువబడే రిషభ లేదా వృషభ నాథుడు జైన మతపు తొలి తీర్థంకరుడు. సంస్కృతంలో రిషభ అనగా మంచి లేదా నాణ్యమైనది అని అర్థం. ఇక్ష్వాకుల కులానికి చెందిన రిషభనాథుడు అయోధ్యలో రాజు నభిరాజ, రాణి మరుదేవిలకు జన్మించాడు. ఇతడు ప్రజలకు వ్యవసాయం, పశుపాలన మొదలగు విషయాలపై అవగాహన కల్పించాడు. ఇతడికి 101 కుమారులు.[ఆధారం చూపాలి] ఇతని మొదటి కుమారుడు భరత చక్రవర్తి. ఇతడి రెండో కుమారుడు బహుబలి. కర్ణాటకలోని శ్రావణబెళగోళలో ఉన్న మహాశిల్పం ఇతడిదే. రిషభుడు చివరి జీవితంలో సన్యాసం పుచ్చుకొని మోక్షజీవితాన్ని గడిపినాడు.ఇతని గురించి ప్రస్తావన ఋగ్వేదంలో కలదు. విష్ణు భాగవత పురాణాలు నారాయణ అవతారం గా పేర్కొన్నాయి.ఇతని చిహ్నం ఋషభం. ఇతని కొడుకు కమ్మటేశ్వరుడు (గోమఠేశ్వరుడు), కుమార్తె బ్రహ్మి.ఇతని కైలాస శిఖరం దగ్గర నిర్యాణం చెందినట్లు భావిస్తున్నారు..

వృషభనాథుడు
ఆదినాథుని విగ్రహం (16వ శతాబ్దం)