ఇతడు అరవీటి వంశ రాజు వారందరిలో గొప్పవాడు విజయనగర సామ్రాజ్యాన్ని అత్యధిక కాలం పాలించాడు ఇతడు గొప్ప సాహిత్య పోషకుడు రెండవ ఆంధ్రభోజుడుగా రెండవ శ్రీ కృష్ణదేవరాయలుగా ప్రసిద్ధి చెందాడు . ఇతను తన రాజధానిని పెనుగొండ నుండి చంద్రగిరికి మార్చాడు. ఆయన అక్బర్ కు, మొహమ్మద్ షాకు సమకాలికుడు ఇతని కాలంలో అక్బర్ తన సౌరభౌమత్వాన్ని అంగీకరించమని ఒత్తిడి చేయగా తిరస్కరించాడు. పోర్చు గీసు వారితో, స్పెయిన్ రాజు రెండవ పిలిప్ తో సంబంధం ఏర్పాటు చేసుకున్నాడు. ఇతడు చంద్రగిరిలో క్రైస్తవ చర్చి నిర్మాణానికి అనుమతి ఇచ్చాడు డచ్ వారికి పులికాట్ వద్ద వ్యాపారం అనుమతిచ్చాడు.

"https://te.wikipedia.org/w/index.php?title=వెంకట_II&oldid=4076317" నుండి వెలికితీశారు