వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్

గుండెలో జఠరికలలో సాధారణంగా రక్త ప్రసరణ జరుగకుండా కంపించడము వలన ఏర్పడిన అసాధారణ (గుండె) లయ

వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ (V-fib లేదా VF) అనేది గుండె జఠరికలలో రక్త ప్రసరణ సాధారణంగా జరుగకుండా కంపించడము వలన ఏర్పడిన అసాధారణ (గుండె) లయ. [1] గుండెలో నాలుగు గదులుంటాయి. పైన రెండు గదులలో గుడ్ లయ తప్పడాన్ని ఏట్రియల్ ఫిబ్రిలేషన్ లేదా ఏ.ఎఫ్. అంటారు. గుండె క్రింద రెండు గదులలో గుండె వేగం పెరిగినప్పుడు వెంట్రిక్యూలర్ ఫిబ్రిలేషన్ (వి.ఎఫ్. ) అంటారు.[2]

వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్
ఇతర పేర్లువి.ఎఫ్.
వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ చూపిస్తున్న ఇ .సి.జి.
ప్రత్యేకతకార్డియాలజీ
లక్షణాలుగుండె పోటు, దడ, స్పృహ కోల్పోవడం, నాడి అందదు
కారణాలుకొరోనరీ హార్ట్ డిసీస్, వాల్వ్యులర్ హార్ట్ డిసీస్, కార్డియోమయోపతి, బ్రుగడా సిండ్రోమ్, లాంగ్ క్యూ.టి. సిండ్రోమ్ లేదా ఎలక్ట్రిక్ షాక్ లేదా ఇంట్రాక్రేనియల్ రక్తస్రావము
రోగనిర్ధారణ పద్ధతిఎలెక్ట్రాకార్డియోగ్రామ్ (ఇసిజి)
భేదాత్మక రోగనిర్థారణ పద్ధతిటోర్సాడెస్ డి పాయింట్స్
చికిత్సకార్డియోపల్మోనరీ పునరుజ్జీవనం (సి.పి.ఆర్)
ఔషధంఎపినెఫ్రిన్ లేదా అమియోడారోన్
రోగ నిరూపణమనుగడ రేట్లు సుమారు 17% కాగా ఆసుపత్రిలో ఇది 46%.
తరుచుదనముగుండె పోటు ఉన్న 10% మందిలో ప్రారంభంలో ఈ వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ పరిస్థితి కనిపిస్తుంది

కొరోనరీ గుండె జబ్బులు, వాల్వ్యులర్ గుండె జబ్బులు, కార్డియోమయోపతి, బ్రుగడా సిండ్రోమ్, లాంగ్ క్యూ.టి. సిండ్రోమ్ లేదా ఎలక్ట్రిక్ షాక్ లేదా ఇంట్రాక్రానియల్ రక్తస్రావము కారణంగా వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ సంభవించవచ్చు.[3][1][4] ఎలెక్ట్రాకార్డియోగ్రామ్ (ఇసిజి) ద్వారా రోగ నిర్ధారణ జరుగుతుంది.[1] ఒక ముఖ్యమైన రోగనిర్ధారణ ఏమంటే టోర్సాడెస్ డి పాయింట్స్ (నిర్దుష్టమైన గుండె అసాధారణమైన లయ). ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు గుండె లయ వి.ఎఫ్.లో నిముషానికి 300 పైగా పెరుగవచ్చు. గుండె కొట్టుకోవడం ఆగే ప్రమాదం ఉంటుంది. [2]

చికిత్సలో కార్డియోపల్మోనరీ పునరుజ్జీవనం (సి.పి.ఆర్ - cardiopulmonary resuscitation ) ఇంకా డీఫిబ్రిలేషన్ ఉంటుంది.[5] ప్రారంభ చికిత్సలు ప్రభావవంతంగా లేకపోతే ఎపినెఫ్రిన్ లేదా అమియోడారోన్ మందులు ఉపయోగిస్తారు.[1] 'అరిథ్మియా' ను గుర్తించినప్పుడు ఆసుపత్రి నుండి బయటపడిన వారిలో మనుగడ రేట్లు సుమారు 17% కాగా ఆసుపత్రిలో ఇది 46%.[6][1]

ఇవి కూడా చూడండి

మార్చు
  1. గుండె
  2. గుండెపోటు
  3. ఎట్రియల్ ఫిబ్రిలేషన్

సూచనలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 . "Ventricular Tachycardias: Characteristics and Management.".
  2. 2.0 2.1 డా.గుడపాటి, రమేష్ (2024-09-14). "గుప్పెడంత గుండె పై ఉప్పెనంత ఒత్తిడి". ఈనాడు.
  3. "Types of Arrhythmia". NHLBI. July 1, 2011. Archived from the original on 7 June 2015. Retrieved 7 September 2016.
  4. Barash, Paul G. (2009). Clinical Anesthesia (in ఇంగ్లీష్). Lippincott Williams & Wilkins. p. 168. ISBN 9780781787635. Archived from the original on 2017-08-08.
  5. (3 November 2015). "Part 1: Executive Summary: 2015 American Heart Association Guidelines Update for Cardiopulmonary Resuscitation and Emergency Cardiovascular Care.".
  6. (November 2010). "Global incidences of out-of-hospital cardiac arrest and survival rates: Systematic review of 67 prospective studies.".