రేపల్లె నివాసి. ప్రముఖ ప్రకృతి వైద్యులు, ప్రముఖ చిత్రకారులు. ప్రముఖ హేతువాద ఉద్యమ నాయకులు. ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు. వీరు చిత్రించిన అనేక చిత్రాలు నేటికీ రేపల్లె మునిసిపల్ హైస్కూలులో లభిస్తాయి.

రేపల్లె సమీపంలోని పెనుమూడి గ్రామంలో ప్రకృతి ఆశ్రమం నెలకొల్పి అనేకమందికి ఆరోగ్యం ప్రసాదించారు. హేతువాద ఉద్యమ నాయకులుగా కొన్ని వేల ఆదర్శ వివాహాలు చేయించారు. చిత్రకారులుగా వెల్లటూరులోని నవరంగ్ చిత్రకళా నికేతన్‌లో అనేక మంది చిత్రకారులను తయారు చేశారు.

జననం: 02 అక్టోబరు 1939. మరణం: 17 మే 1996

రచనలు

  1. రామాయణం రంకు 1978
  2. పెళ్ళిమంత్రాల బండారం 1979
  3. సుప్రభాత శృంగారం 1979